3, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4493

4-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు”
(లేదా...)
“వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు సైంధవా”

21 కామెంట్‌లు:

  1. చిన్నబిడ్డల చేష్టలచిందులేసి
    వన్నెచిన్నెలవిలుకాడు వచ్చెనహహ

    తానెరారాజునంచునుతాండవించు
    వచ్చినట్టిఫల్గుణునిగెల్వంగవచ్చు

    రిప్లయితొలగించండి
  2. క్షితి కొరకయి సంగ్రామ క్షేత్రమందు
    తగవులాట జరుగుచుండ దమకెదురుగ
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు
    ననుకొ నిన రీతి నెప్పటికబ్బదుగద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Eppudu e madagajayanaku ravika matrame chalu chiraletikin. E vyakayanam ki samadanam cheppandi plz

      తొలగించండి
    2. శ్రీ నాగేశ్వరరావు గారు!నమస్తే.

      మదగజయానకున్ రవిక మాత్రమె చాలును చీర యేటికిన్ .
      ఈ సమస్యను శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు అష్టావధానములో పూరించారని విన్నాను,ఆ పద్యము నాకు గుర్తులేదు,ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  3. అచ్చపుమేనికాంతివిడియానముఁజేసెనుభాస్కరుండునున్
    మెచ్చెనుదైవమంతటనుమిన్నునఁజూచియుమోదమందుచున్
    వచ్చినవాఁడుఫల్గుణుడవశ్యముగెల్వగవచ్చు, సైంథవా

    హెచ్చినపౌరుషంబునను, హేయముకార్యమునీవుజేయగన్

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    *వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు, సైంధవా!*
    నచ్చిన రీతి దాగుకొని నైజము జూడుము వ్యూహమందునన్
    చచ్చిన పుత్రు దల్చ వెత, శాంతము లేకయు, నొజ్జ ద్రోణునిన్
    విచ్చిన చాప కౌశలము, వేడును పాండవ మధ్యముండిటన్.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    మింటి యందున రవి యస్తమించకుండ
    సైంధవుని చంపెదనటంచు శపథమునిడి
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగ వచ్చు
    నే?యని సుయోధనుండు చింతించె మిగుల.

    రిప్లయితొలగించండి
  6. వలచెను ప్రమీల సుందర పార్థునపుడు,
    గెలువలేమితని యను సఖియల తోడ
    పలికెను ప్రమీల, "చెలులార! వలపు తోడ
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగ వచ్చు".

    రిప్లయితొలగించండి
  7. రారాజు దుర్యోధనుడు సైంధవుని తో....

    తేటగీతి
    నింగి రవియుండ సైంధవా! నిన్నుఁ గూల్చఁ
    జేతఁ గాక సంధ్య పిదపన్ జేరె మనల
    ప్రతిన నెరవేరలేదని భంగపడియు
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు!

    ఉత్పలమాల
    రెచ్చిన పౌరుషాన విపరీత ప్రతిజ్ఞల సంధ్యముందటన్
    దుచ్ఛుడవంచు నిన్నడచ దూకుడు మీర ప్రయత్న మెంచఁగా
    నిచ్చయె తీరదాయె తలకెక్కిన నోటమిఁ బుత్రశోకమై
    వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు సైంధవా!

    రిప్లయితొలగించండి

  8. మగతనంబును కోల్పోయి మఘవ సుతుడు
    వేగమున వచ్చుచుండెనా పేడి జూడ
    నర్భకుడు సారథిగ గొని యంకమునకు
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు.


    అచ్చెరు వొందబోకుడు మహారణమున్ సలుపంగ నెంచుచున్
    వచ్చెడివాడెవండనుచు వ్యగ్రతదేలనొ బాలకుం డతం
    డిచ్చట కేగుదెంచెగద హెచ్చిన యుత్సహమందు, కాదిటన్
    వచ్చినవాఁడు ఫల్గుణుఁ , డవశ్యము గెల్వఁగవచ్చు సైంధవా!

    రిప్లయితొలగించండి
  9. ఆల మందల రక్షింప నాజి జేయ
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగ వచ్చు
    నని భ్రమయుచున్న దుర్యోధ నాదులెల్ల
    వోడి వెడలినారచటె గోవులను వదలి.

    రిప్లయితొలగించండి
  10. ఉత్పలమాల
    చిచ్చర పిడ్గువోలె గడు చిందఱ వందఱసేయ బూనియున్
    వచ్చిన వాఁడు ఫల్గుణుఁ,డవశ్యము గెల్వగ వచ్చు సైంధవా!
    చెచ్చెర గ్రుంకె భానుఁడదె చీకటి క్రమ్మెను తప్పెముప్పు నీ
    వచ్చట దాగనేల?యని యత్తరి పల్కె సుయోధనుండహో!

    రిప్లయితొలగించండి
  11. పశ్చిమదిశకు సూర్యుడు పరుగులిడక
    ముందు నిర్జింతు ననిచెప్పి నందువలన
    పగటిపూటదాగిన చాలు బన్నముపడి
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు

    కచ్చితమైననిశ్చయముఁ కాలునిమాదిరి నిర్గమంబుతో
    వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు, సైంధవా!
    రెచ్చిన కోపగానికెదురేగుట చావును స్వాగతించుటే
    నచ్చిన చోటుకేగి యటనక్కిన మృత్యువు దూరమౌనుగా

    రిప్లయితొలగించండి
  12. చండమార్తాండ తేజమ్ముచదలనిండ
    సైంధవునిజంపగాఘోరశపధమూని
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు
    వెలుగురేడుతా నస్తాద్రి మలగెనేని

    రిప్లయితొలగించండి
  13. సైంధవా! నీకు వరమున శక్తి కలిగె
    సమర మందున విజయమ్ము సాధ్య మగును
    వచ్చి న ట్టి ఫల్గునుని గెల్వంగ వచ్చు
    మంచి యవకాశ మి య్యె డ మనకు దొరికె

    రిప్లయితొలగించండి
  14. తే॥ అసువులు విడువ నెచ్చెలు లందరు నని
    యందు ధుర్యోధనుఁడు పిచ్చి యంకురించి
    పలికె ఖిన్నుఁడై యీరీతిఁ బాలు పోక
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు

    ఉ॥ మెచ్చక సంధి సూత్రములు మేలని యుద్ధముఁ గోరెనాముతో
    నెచ్చెలు లెందరో యనిని నేలకు కూలఁగ దుఃఖమెక్కువై
    పిచ్చిని పైన వేసుకొని ప్రేలుచు సాఁగె సుయోధనుండిటుల్
    వచ్చిన వాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు సైంధవా

    రిప్లయితొలగించండి
  15. పూర్తిగ నిరాశ నిస్పృహ ఆవహించినపుడు ఇలా తమకు తామే గొణుగుకోవడము సర్వ సాధరణమైన మనో చాంచల్యమండి

    రిప్లయితొలగించండి
  16. మగతనమ్మించుకయు లేని మగువకాని
    నర్తనమ్మునునేర్పెడునట్టు వొజ్జ
    సమరమునుచేయనరుదెంచెసత్వరముగ
    *“వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు”*


    పేడిగాడువీడువినుమువీనులార
    స్యందనమునునడుపువాడు సవ్యసాచి
    శాపముక్తుడై ఠీవిగ సమరమునకు
    వచ్చినట్టి ఫల్గుణుని గెల్వంగవచ్చు.


    చచ్చిన పుత్రునిన్ దలచి సంకట మొందుచు వచ్చు వేగమే
    రెచ్చినకోపమూనుచును క్రీడియు వ్యూహము పన్నియున్నచో
    ఖచ్చితమౌనటంచునటకౌరవుడెంచుచుపల్కెనివ్విధిన్
    వచ్చినవాడుఫల్గుణుడవశ్యముగెల్వగవచ్చుసైంధవా

    రిప్లయితొలగించండి
  17. అచ్చెరువంద వీరవరు లాహవమందున కౌరవేయులన్
    విచ్చలుగా శరంబులను వేయుచు వేసటనొంద జేయుచున్
    వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్వఁగవచ్చు, సైంధవా
    చచ్చునుతానె తథ్యమిక చంపెద నిన్నను సంధ దీర్చకన్

    రిప్లయితొలగించండి
  18. చిచ్చర పిడ్గువోలె జని జిందర
    వందర జేయు సైన్యమున్
    వచ్చినవాడు పాల్గుణు, డవస్యము
    గెల్వుగవచ్చు సైంధవా!
    వచ్చినచో మరెవ్వరును భండన
    మందున దప్పకుండ, వి
    వ్వచ్చుడు శత్రు భీకరుడు
    వాసవ పుత్రుడు వచ్చెనిత్తరిన్

    రిప్లయితొలగించండి