27-8-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే”(లేదా...)“పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో రమణమూర్తి గారి సమస్య)
కం:నిరపేక్ష తోడి మగడనవరతము మడిగట్టుకున్న వ్యర్థమ్మగునేనిరతివలదు, నలుగురిలో పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
కందంనిరతము పరోపకారముగురుతర బాధ్యతగఁ దల్చు గుణమలవడగానిరుగుపొరుగు వారలొసఁగుపరపతి మేలనుచు సతులు వల్కుట సబబేచంపకమాలనిరతము దోడి వారలకు నిర్మల బుద్ధి పరోపకారముల్గురుతర బాధ్యతన్ బగిది గొప్పగఁ దల్చెడు భావనంబునన్దిరువును నిర్గుపొర్గు మదినిండుగ నొందుచు వారొసంగెడున్పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా(పరపతి = గౌరవము)
అరయగ నప్పులు వెదకుచుపరితాపమునొందుచున్న భర్తల కంటెన్నిరతము సంఘములోతమ పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
నిరతమునప్పుకైవెదకి నేరక నప్పుల యూబిలోపలన్తిరపడు భర్తలన్ గనుచు తేకువ వీడక తాము నేరుగా సరియగు కాలమందు తమసంపద పెంపును నిర్వహించి మాపరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా
ఇరుగుల పొరుగుల సఖ్యతపరులకు సాయమ్ము సలుపు భావన దోడన్బరగ సమాజము న గలుగుపరపతి మేలనుచు సతులు బల్కు ట సబబే!
నిరతము ప్రేమ భావమున నిక్కముగా తమ జీవితంబులోకరము దయార్ద్ర చిత్తమున గాలముగడ్పుచు సజ్జనాత్ములైపరులు నుతించు రీతిగను బ్రత్కెడివారలయొక్క గొప్పదౌపరపతి మేలుమేలనుచు భామలువల్కుట భవ్యమేకదా.
కం॥ పరపతితోఁ బనులు జరుగుపరపతి గణ్యు నొనరించుఁ బదుగురిలోనన్బరపతి లేకఁ బలచనగుపరపతి మేలనుచు సతులు వల్కుట సబబే! పరపతి గౌరవము
పొరచి కొరకయి జతనుపడపురమున పయిసా యయినను పుట్టుట లేదేపొరుగున నైనను గొంచెముబరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
నిరతము పరోపకారము వెరువక చేయుచు పదుగురు భేషని పొగడన్ సిరులవియె లేక పోయిన పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే.(పరపతి=గౌరవము)తరుణికి వలువల నొసగుచుగరువమ్మును నిలిపినట్టి కరుణా మయుడానరునకు సారథి యగు ద్వాపర పతి మేలనుచు సతులు పల్కుట సబబే.ధరణిని ధర్మమున్ నిలుప దానవులన్ దునుమాడె వాడు సంగరమున తేర్పుపూన్పరయి కఱ్ఱికి గీతను బోధసేసె యంబరముల నిచ్చి కృష్ణ గరువమ్మును గాచిన కైటభారి ద్వాపర పతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చం॥ మరువక భార్య యక్కరలు మన్నన సేయుచు వెంట వెంటనేనిరతము నామె కోరికల నేమము తోడను దీర్చి ధాత్రిలోపరపతి తోడ సంఘమునఁ బ్రాభవ మొంది తనర్చు చున్నచోపరపతి మేలు మేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా!పరపతి గౌరవముఆదర్శ పతి కాకపోతే దుర్లభమండి
నరులకు భూషణంబన ధనార్జనయే కలి కాలమందునన్వరుసగ వచ్చి చేరుగద ప్రాభవ మేంతయొ విత్తమున్నచోతరుణులెరుంగుటన్ సబబె దా మను మాటల నెంచి చూడగా,పరపతి మేలుమేలనుచు భామలు పల్కుట భావ్యమే కదా.
కందం:పరులకు నుపకారమ్మునునిరతము నొనగూర్చునట్టి నిర్మలచిత్తుల్వరులుగ బొందిన కలిగెడుపరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
చంపకమాల:నిరతము సత్కృతుల్ నెరపు నిర్మల చిత్తుని సద్గుణాన్వితున్సరసఁపు వాక్కులన్ బలికి సర్వుల మన్ననలందు సాత్త్వికున్వరునిగ బొంద సంఘమున వావిరిగా సతికిన్ లభించు నాపరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా
శంకరాభరణం సమస్య: పూరణ:పరపతి సంఘమందునను బాగుగ సాగిన భాగ్యమే గదానరబడి కేశముల్ ముదిమి నందున దెచ్చునుగాదె మన్ననల్పరపతి సంఘమందునను పండిన కేశసమాదరమ్ముతోన్పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా.కడయింటి కృష్ణమూర్తి..27-8-23
నిరతము గొప్పలు పోవుచుజరజర మితిమీరఖర్చు సలుపుట మేలా?నెరవుగ వెచ్చము చేసెడిపరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
చం.చురుకుగ చేరగా యమున సుందర గోపికలాడ నగ్నికల్వరదుడు పట్టె వస్త్రములు, పార్వతిఁ గొల్చిన స్త్రీలు భ్రాంతిచేకరములు జోడ్చి కృష్ణుఁ గని కాంతలు కోరుచుఁ గోకలన్ రహిన్*పరపతి మేలు మేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా!*
రిప్లయితొలగించండికం:
నిరపేక్ష తోడి మగడన
వరతము మడిగట్టుకున్న వ్యర్థమ్మగునే
నిరతివలదు, నలుగురిలో
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
కందం
రిప్లయితొలగించండినిరతము పరోపకారము
గురుతర బాధ్యతగఁ దల్చు గుణమలవడగా
నిరుగుపొరుగు వారలొసఁగు
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
చంపకమాల
నిరతము దోడి వారలకు నిర్మల బుద్ధి పరోపకారముల్
గురుతర బాధ్యతన్ బగిది గొప్పగఁ దల్చెడు భావనంబునన్
దిరువును నిర్గుపొర్గు మదినిండుగ నొందుచు వారొసంగెడున్
పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా
(పరపతి = గౌరవము)
అరయగ నప్పులు వెదకుచు
రిప్లయితొలగించండిపరితాపమునొందుచున్న భర్తల కంటెన్
నిరతము సంఘములోతమ
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
నిరతమునప్పుకైవెదకి నేరక నప్పుల యూబిలోపలన్
తొలగించండితిరపడు భర్తలన్ గనుచు తేకువ వీడక తాము నేరుగా
సరియగు కాలమందు తమసంపద పెంపును నిర్వహించి మా
పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా
ఇరుగుల పొరుగుల సఖ్యత
రిప్లయితొలగించండిపరులకు సాయమ్ము సలుపు భావన దోడన్
బరగ సమాజము న గలుగు
పరపతి మేలనుచు సతులు బల్కు ట సబబే!
నిరతము ప్రేమ భావమున నిక్కము
రిప్లయితొలగించండిగా తమ జీవితంబులో
కరము దయార్ద్ర చిత్తమున గాలము
గడ్పుచు సజ్జనాత్ములై
పరులు నుతించు రీతిగను బ్రత్కెడి
వారలయొక్క గొప్పదౌ
పరపతి మేలుమేలనుచు భామలు
వల్కుట భవ్యమేకదా.
కం॥ పరపతితోఁ బనులు జరుగు
రిప్లయితొలగించండిపరపతి గణ్యు నొనరించుఁ బదుగురిలోనన్
బరపతి లేకఁ బలచనగు
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే!
పరపతి గౌరవము
పొరచి కొరకయి జతనుపడ
రిప్లయితొలగించండిపురమున పయిసా యయినను పుట్టుట లేదే
పొరుగున నైనను గొంచెము
బరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
రిప్లయితొలగించండినిరతము పరోపకారము
వెరువక చేయుచు పదుగురు భేషని పొగడన్
సిరులవియె లేక పోయిన
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే.
(పరపతి=గౌరవము)
తరుణికి వలువల నొసగుచు
గరువమ్మును నిలిపినట్టి కరుణా మయుడా
నరునకు సారథి యగు ద్వా
పర పతి మేలనుచు సతులు పల్కుట సబబే.
ధరణిని ధర్మమున్ నిలుప దానవులన్ దునుమాడె వాడు సం
గరమున తేర్పుపూన్పరయి కఱ్ఱికి గీతను బోధసేసె యం
బరముల నిచ్చి కృష్ణ గరువమ్మును గాచిన కైటభారి ద్వా
పర పతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం॥ మరువక భార్య యక్కరలు మన్నన సేయుచు వెంట వెంటనే
రిప్లయితొలగించండినిరతము నామె కోరికల నేమము తోడను దీర్చి ధాత్రిలో
పరపతి తోడ సంఘమునఁ బ్రాభవ మొంది తనర్చు చున్నచో
పరపతి మేలు మేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా!
పరపతి గౌరవము
ఆదర్శ పతి కాకపోతే దుర్లభమండి
నరులకు భూషణంబన ధనార్జనయే కలి కాలమందునన్
రిప్లయితొలగించండివరుసగ వచ్చి చేరుగద ప్రాభవ మేంతయొ విత్తమున్నచో
తరుణులెరుంగుటన్ సబబె దా మను మాటల నెంచి చూడగా,
పరపతి మేలుమేలనుచు భామలు పల్కుట భావ్యమే కదా.
కందం:
రిప్లయితొలగించండిపరులకు నుపకారమ్మును
నిరతము నొనగూర్చునట్టి నిర్మలచిత్తుల్
వరులుగ బొందిన కలిగెడు
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
చంపకమాల:
రిప్లయితొలగించండినిరతము సత్కృతుల్ నెరపు నిర్మల చిత్తుని సద్గుణాన్వితున్
సరసఁపు వాక్కులన్ బలికి సర్వుల మన్ననలందు సాత్త్వికున్
వరునిగ బొంద సంఘమున వావిరిగా సతికిన్ లభించు నా
పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా
శంకరాభరణం సమస్య: పూరణ:
రిప్లయితొలగించండిపరపతి సంఘమందునను బాగుగ సాగిన భాగ్యమే గదా
నరబడి కేశముల్ ముదిమి నందున దెచ్చునుగాదె మన్ననల్
పరపతి సంఘమందునను పండిన కేశసమాదరమ్ముతోన్
పరపతి మేలుమేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా.
కడయింటి కృష్ణమూర్తి..27-8-23
నిరతము గొప్పలు పోవుచు
రిప్లయితొలగించండిజరజర మితిమీరఖర్చు సలుపుట మేలా?
నెరవుగ వెచ్చము చేసెడి
పరపతి మేలనుచు సతులు వల్కుట సబబే
చం.
రిప్లయితొలగించండిచురుకుగ చేరగా యమున సుందర గోపికలాడ నగ్నికల్
వరదుడు పట్టె వస్త్రములు, పార్వతిఁ గొల్చిన స్త్రీలు భ్రాంతిచే
కరములు జోడ్చి కృష్ణుఁ గని కాంతలు కోరుచుఁ గోకలన్ రహిన్
*పరపతి మేలు మేలనుచు భామలు వల్కుట భావ్యమే కదా!*