17, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4679

18-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చంప వచ్చువారిఁ గనిన సంతసమగు”
(లేదా...)
“జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రు వర్గమే”
(ఊర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

33 కామెంట్‌లు:

  1. పండుగకు బిలిచిరనుచు పయనమయితి ,
    శ్వశురుని యింటినందున శయనమొంద
    మంచముపయి పరుపునందు మత్కుణముల
    చంప వచ్చువారిఁ గనిన సంతసమగు

    రిప్లయితొలగించండి
  2. పరుల హింసించి దురితం పు పనులె కాక
    క్రూర కృత్యము లొనరించు నేర చరి తు
    చంప వచ్చు వారి గనిన సంతస మగు
    వారె లోకోప కారులై వాసి గాంత్రు

    రిప్లయితొలగించండి
  3. తే.గీ:
    శాత్రవుల ధాటి తీవ్రమై శక్తి తగ్గి
    ప్రాణ భయము కలుగుచుండ త్రాణ నిలుప
    చేరవచ్చి తోడు నిలచి వైరి జనుల
    చంప వచ్చువారిఁ గనిన సంతసమగు.

    రిప్లయితొలగించండి
  4. సాధుసద్భాషలనియెడిి సాధనముల
    మనిషి లోనుండు రాక్షస మాయనరసి

    చంపవచ్చువారిగనిన సంతకము
    మహిమగలిగినవారలేమనకుదిక్కు

    రిప్లయితొలగించండి
  5. దుష్ట దుర్నయ ధూర్తుల దుండగములు
    మీరు చుండెను వారల నేరి వేయ
    చంప వచ్చువారిగనిన సంతసమగు
    చీడ పుర్గులువారిచే చెడుపు కలుగు

    రిప్లయితొలగించండి
  6. కంపమునందెభీష్ముడును కిాంచుచు కృష్ణునిరౌద్రమాయెడన్
    నింపెనుకన్నులందుఘన నేరము ముత్యములట్టునుండగా
    పెంపునమానసాంబుధిని పెల్లుబికెన్కెర టాలజల్లులున్
    జంపగవచ్చువారిఁగనిసంతసమందిరి శత్రువర్గముల్

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    సొంపుగ రామసేన చనె సుందర లంకను రాక్షసారిగా
    తెంపగ మానుషాదులట తిండిగ దల్చుచు జప్పరించెడిన్
    పెంపుగ గోతి మూకలను విందుగ బ్రీతిగ నారగించుటన్
    *జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రు వర్గమే.*

    రిప్లయితొలగించండి

  8. ఏడడుగుల విషపు పామదింటిలోకి
    చేరి వీరవిహారము జేయు వేళ
    నడలుచు బిలువ వెంటనె యభయ మొసగి
    చంప వచ్చువారిఁ గనిన సంతసమగు.


    తెంపరి యైన రావణుని ధీరుని యల్పుడటంచు నెంచుచున్
    సంపదలేని రాఘవుడు సంద్రము దాటుటు విగ్రహమ్ము కై
    తుంపరులంటి వానరులె తోడట యంచును వెక్కిరించుచున్
    జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందిరి శత్రు వర్గముల్.

    రిప్లయితొలగించండి
  9. తెలివి తక్కువ భూపతి తెగువచూపి
    పొరుగు రాజ్యము పైబడె పోరుసల్ప
    శత్రు భూవరుడెనలేని శక్తియుతుడు
    చంప వచ్చువారిఁ గనిన సంతసమగు

    తెంపరి యైన భూవరుడు ధీరతతో నలరారుచుండగా
    గుంపుగ దాడిచేసిరట గోప్యతతో తన శత్రు వర్గమే
    తెంపరి సంధికై వగచి తీరగుదూతల నెంచిపంపెఁ రా
    జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రు వర్గమే

    రిప్లయితొలగించండి
  10. తే॥ తప్ప త్రాగి హింసించుచుఁ దగవు లాడు
    మగని బాధలఁ బడలేక మగువ చంపఁ
    దలచి పతి హత్యకనిఁ గొంత ధనమొసఁగఁగఁ
    జంప వచ్చు వారిఁ గనిన సంతసమగును

    (ఇది నడుస్తున్న చరిత్ర అండి)

    ఉ॥ ఇంపుగ సంధిఁ జేతమని యెందరు కోరినఁ గౌరవాధముల్
    దెంపరులై చనన్ నిజము తెల్సిన యోధులు నెందరెందరో
    చంపెడు వారు పాండవులు చచ్చును గౌరవ మూకయే యనిన్
    జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రువర్గమే

    (భీష్మద్రోణ కృపాదులకు సర్వము విదితమే కదండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి చివరన ను పొరపాటున అధికంగా వ్రాసానండి

      తొలగించండి
    2. నేటి సమస్యకు మరొక బాధాకర పూరణ

      కామ మోహముల బిగువు కన్నులనటు
      మూసి వేయఁగాఁ బ్రియునినిఁ బొంద నొదవ
      మగని హథమార్చఁ బూనగ మగవ కపుడు
      చంపగ వచ్చు వారిఁ గనిన సంతసమగు

      నేను చదివే The Hindu లో చాలా objective reporting ఉంటుందండి. కాని గత 1-3 సం॥ దాదాపు అరడజను మారులైనా చదివి యుంటాను

      తొలగించండి
  11. తే.గీ:ఉగ్రవాదులు పేట్రేగ నోర్పు తోడ
    చర్చలన్ జేతు రెన్నాళ్లు శాంతి యనుచు?
    సైనికవిథి తో నా యుగ్రసంతతులను
    జంప వచ్చు వారి గనిన సంతసమగు

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    తమ్మిమొగ్గరమభిమన్యు ధాటిఁజూచి
    వ్యర్థమయ్యెననుచు వైరులనుకొనంగ,
    వెన్నుపోటును కర్ణాదులెన్న, వాని
    చంపవచ్చు వారిఁ గనిన సంతసమగు

    ఉత్పలమాల
    తెంపరి క్రీడి సూనుఁడన ధీరత కూల్చఁగ వైరి సేనలన్
    గుంపుల, తమ్మిమొగ్గరము గోల్పడె నంచును వెన్నుపోటుతో
    ముంపును బాపవచ్చునని పోరున నెంచియు కర్ణుఁడాదిగన్
    జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందిరి శత్రు వర్గముల్

    రిప్లయితొలగించండి
  13. ఉ:తెంపరి శత్రువుల్ చెలగి దేశపు సైన్యము పైన దాడికిన్
    గుంపుగ రాగ, బంధముల గూర్చుచు వారిని చిత్రహింసకున్
    బంపక, "గాల్చి వేయుటయె బా"గన సేన జిహాదు నెంచుచున్
    చంపగ వచ్చు వారి గని సంతస మందెను శత్రువర్గమే.
    (ఉగ్రవాదులు చావటానికి ఇష్టపడతారు కానీ సైన్యం చేతిలో చిత్రహింసలకి ఇష్ట పడరు.సైన్యం తమని బంధించి చిత్రహింసలు పెట్టక కాల్చి పారెయ్యటానికి నిర్ణయించటం తో వాళ్లు జిహద్ లో మరణిస్తున్నందుకు సంతోషించారు.)

    రిప్లయితొలగించండి
  14. ఆడఁ బోయిన తీర్థము పాడిగ నెదు
    రైన యట్టి చందమ్మున నక్కజముగ
    సాయ మొనరింపఁగఁ దలంచి శత్రువులను
    జంప వచ్చు వారిఁ గనిన సంతస మగు

    సంతస మందిరి శత్రువర్గముల్ - యన్వయ లోపము.
    కయ్య మొనర్చెడి వారలు సంతస మందిరి; శత్రు వర్గముల్ కంపము నంద డెందముల.
    ఇట్లు పూరణమున నన్వయ ప్రాప్తి గమ నార్హము.


    ఇంపుగఁ దాము గోరినదె యివ్విధి నిప్పుడు గాంచ నయ్యెనే
    తెంపున మార్కొనంగఁ దమ ద్వేషుల నెల్లర నన్యు లుద్ధతిం
    గంపము నంద డెందములఁ, గయ్య మొనర్చెడి వార లత్తఱిం
    జంపఁగ వచ్చు వారిఁ గని సంతస మందిరి, శత్రు వర్గముల్

    రిప్లయితొలగించండి
  15. చలన చిత్రమనిన మోజు జనులకెపుడు
    దోషులుండి చేయునెపుడు దుష్ట పనులు
    కనలి నాయకానుచరులు కయ్యమాడి
    చంప వచ్చు వారిఁ గనిన సంతసంబగు

    రిప్లయితొలగించండి
  16. బుసలు గొట్టుచు నాగన్న బుట్ట నుండి
    మీద మీదకు వేవేగ మెట్ల నెక్కి
    వచ్చు దానిని గమనించి భయము లేక
    చంప వచ్చువారిఁ గనిన సంతసమగు

    రిప్లయితొలగించండి
  17. తెంపరి రావణాసురుఁడు తీయగఁబల్కగ నమ్మకంబుతోఁ
    సొంపగు సీతనత్తఱిని సూర్యుని సాక్షిగఁ లంక కేగగా
    గుంపుగఁగోతి మూకలను గోరసహాయము చేర లంకకున్
    జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రు వర్గమే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.


    పగలు,రేయి భేదము లేక పంతమూని
    కుట్టుచుండగ దోమలు పట్టుబట్టి
    ప్రభుత చర్యలు గైకొను భాగమందు
    పురుగు మందుతో దోమలన్ పూర్తిగాను
    చంప... వచ్చు వారిఁ గనిన సంతసమగు.

    రిప్లయితొలగించండి
  19. మంచిమాటలనాడుచు మమత చూపి
    అభముశుభములెరుగనట్టియర్భకులను
    మత్తులోనసతతముంచు మాయగాండ్ర
    *“చంప వచ్చువారిఁ గనిన సంతసమగు”*

    రిప్లయితొలగించండి