4, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4666

5-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప”
(లేదా...)
“సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా”

24 కామెంట్‌లు:

  1. జీవకోటికి వెలుగిచ్చు జేజిలనగ
    పవలురాత్రులదేవుళ్లు భాసురముగ
    కనులముందరదారాడు ఘనులు వీరు
    సోమఙాస్కరుల్గలసిరి క్షోభనడప

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    క్రీడి యిహలోక మోహాన కేలుముడచ
    పార్థసారధి కృష్ణుండు పల్కి గీత
    విశ్వరూపమ్ము జూపగ వృష్ణి కనుల
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప


    శార్దూలవిక్రీడితము
    శ్రీమంతుండు హితుండుగన్ నరునకున్ సేమంబునందింపఁగన్
    భూమిన్ ధర్మము నిల్పి క్షోభ నడపన్ మోదించి కృష్ణుండునై
    శ్రీమద్గీతను బోధజేయఁగఁ గురుక్షేత్రాన నేత్రంబులన్
    సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా!

    రిప్లయితొలగించండి
  3. ప్రబలుచున్నట్టి నిస్పృహ ప్రజలలోన
    రూపు మాపగ దలచియు రూఢిగాను
    మతము వేరైన నొకటైరి మంచిజేయ
    సోమ భాస్కరుల్గసిరి క్షోభ నడప.

    రిప్లయితొలగించండి
  4. -

    ఒకడు దామోదరుండు మరొక్కడమితు
    డౌత! జోడుగలిసిరి గుర్జలపు రాష్ట్ర
    మందు! ప్రగతిపథమ్మున మనల నడుప
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప

    రిప్లయితొలగించండి
  5. నీమాలెంచకజీవకోటిగనిరీనేతల్ ఘనోదారులై
    యామంబుల్చలిప్రొద్దునుష్ణములనాయాకాలమర్మంబుతో
    క్షేమంబుల్పరికించుపెద్దలుగనాశైత్యంబుతాపంబుతో
    సోమాదిత్యులుగూడిరొక్కెడజగత్క్షోభంబుమాన్పన్భళా

    రిప్లయితొలగించండి
  6. అల్ల కల్లోలములు రే గె నవని యందు
    శాంతి నెలకొల్ప నెంచియు సౌమ్యులగుచు
    సోమ భాస్కరు ల్ గలసిరి క్షోభ నడప
    ననుచు సుర తతి నుతియించె హర్ష మంది

    రిప్లయితొలగించండి
  7. నిశ్చల పయిన తిమిరము నిండియుండ
    దినము రేయిల భేదము తెలియ కుండు
    సంకటమునుండి క్షితిపయి జనుల దడవ
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడప

    రిప్లయితొలగించండి

  8. అమృతము దనుజులకు దక్కనశుభమంచు
    నెంచి యంబుజోదరుడు మోహినిగ జేరు
    తరుణమున చెంతనగల కర్బురుల జూప
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప.



    క్షేమంబయ్యది కాదటంచు సుధనా జేజేల పాల్జేయకన్
    తామారెన్ దరిదాల్పు మోహినిగ నాస్త్యానమ్ము నే పంచగా
    నేమశ్వమ్మున జేరినట్టి భటులన్ నిర్జింప సూచింపగా
    సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా.

    రిప్లయితొలగించండి
  9. గరళమును స్వీకరించెను పరమ శివుడు
    తానెమోహినిగామారె తాతతాత
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప
    జగతి రక్షణ కయ్యప్ప జన్మమొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోముండే గరళమ్ముఁ మ్రింగె జగతిన్ సొంపార రక్షింపగా
      హేమాంగుండును రూపుమార్చెను గదా హేయంబుగా నెంచకన్
      సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా
      క్షేమంబే గురిగా జనించెను గదా చిద్రూపు డయ్యప్పగా

      తొలగించండి
  10. -
    క్షేమంబంచు జనాళి జాగృతులవన్ శ్రీమంతులైవెల్గగా
    రామా నీవు గృహమ్ము చేరి నిలువన్ రాజ్యాధికారమ్ముతో
    సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా
    యీమార్పుల్ గన భారతాంబ సుకృతాలెన్నెన్ని చేయంగనో!



    రిప్లయితొలగించండి
  11. గురుగారికి నమస్కారములు
    దయచేసి మీ ఫోన్ నం. ఇవ్వగలరు. మీతో మాట్లాడాలని ఉంది

    రిప్లయితొలగించండి
  12. గ్రామంబందున నన్నదాతలు సదా గ్రాసమ్ము నందింత్రు వి
    శ్రామంబన్నదిలేక దేశమును సంరక్షింత్రుగా సైనికుల్
    క్షేమంబున్ సమకూర్చు వీరలెకదా సీరుండు రేరాజులున్
    సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా!

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. తే॥ క్షామమున బేధ భావము క్షేమమగున
      కష్ట సమయమందు నడువఁ గలసి మెలసి
      భిన్న ధృవములు హితమని బేధ మడఁచి
      సోమ భాస్కరుల్ గలసిరి క్షోభ నడుఁప

      శా॥ క్షామమ్మందున క్షేమమెంచి చనఁగాఁ గర్తవ్య నేమమ్ముతోఁ
      బ్రేమంబున్ గని భిన్నతత్వ పరులున్ బేధంబునే కాంచకన్
      సామాన్యంబుగఁ గష్టనష్టములు నాశంబౌనటంచున్ గనన్
      సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా

      తొలగించండి
  14. ప్రాణములనిల్పు పండించి పంట లొకఁడు
    ప్రాణములనొడ్డు సీమఁ గాపాడనొకఁడు
    వీరలిరువురు వినువీధి వేల్పులైన
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప

    రిప్లయితొలగించండి
  15. తే.గీ;సోమశేఖర !నీయందు బ్రేమ కలదు
    దౌష్ట్యముల నణపంగ రౌద్రమ్ము కలదు
    నీదు కన్నులే వారలై నిశ్చయముగ
    సోమభాస్కరుల్ కలిసిరి క్షోభ నడప

    రిప్లయితొలగించండి
  16. శా:భూమిన్ రాజన చంద్రగుప్తుడె సదా పోషించె గా జ్ఞానులన్!
    సేమం బిచ్చెను విక్రమార్కుడన నిశ్షేషమ్ముగా జేసి సం
    గ్రామమ్మందున వైరులన్ ,సముడె రౌద్రమ్మందునన్,బ్రేమలో
    సోమాదిత్యులు కూడి రొక్కెడ జగత్క్షోభమ్ము మాన్ పన్ భళా
    (చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనే పేరులోనే సూర్యచంద్రు లిద్దరూ ఉన్నారు.పేరుకి తగినట్టు ఆ మహారాజు జ్ఞానులని,శాస్త్రాలని ,కవులని ప్రేమ తో పోషించాడు.శత్రువులని తరిమి కొట్టాడు.ఎప్పుడూ పురాణాలే ఎందుకు !అని చరిత్ర ని అందుకొన్నాను.)

    రిప్లయితొలగించండి
  17. శైత్య చండ కిరణ చయ చారు తనులు
    నీరజద్విష మిత్రులు నిత్య చరులు
    గగనమున నభశ్చారులు కాంతు లొసఁగ
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప


    శ్రీమద్రాజ కులోద్భవుల్ సమర దుర్భేద్యుల్ నరవ్యాఘ్రులున్
    శ్రీమంతుల్ విలుకాండ్రు దాశరథు లక్షీణప్రభా కాయులున్
    జామాతల్ జనకాఖ్య రాజ ఋషికిన్ సౌమిత్రి సీతాపతుల్
    సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా

    రిప్లయితొలగించండి
  18. గాలి వెలుతురు వెన్నెల గడప గడప
    కీయుటకునిఁక జగతికి గీడు మాన్ప
    యాక సంబున వెలయుచు నద్భు తముగ
    సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప”

    రిప్లయితొలగించండి
  19. సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా
    యేమీ దృశ్యముఁజూడఁజక్కగ మహాయిష్టంబు గాదోచెడిన్
    భామా! చూచితె నీవు చెప్పుమ వినన్ భావంబు నందంతటన్
    నేమో చెప్పగ రాని కోరిక లెవో యిబ్బందిఁజేకూర్చెనే

    రిప్లయితొలగించండి
  20. క్షీరసాగరమునుమధించెడిసమయము
    నందచటపుట్టినగరళమభవుడుగొన
    నక్ష యుగళిన గనుచును నాదరమున
    *“సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప”*

    రిప్లయితొలగించండి