3-2-2024 (శనివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా” (లేదా...) “గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్” (ఆముదాల మురళి గారి అష్టావధానంలో విట్టుబాబు ఇచ్చిన సమస్య)
కం:సర్వ మెరుగు గురుదేవుడు గర్వమ్మే లేని వాడు, కవి కాడు కదా! సర్వమున శూన్యు డయ్యును సర్వజ్ఞుడ ననుచు దలచి సంబర మొందన్. (గురువు గారికి గర్వం లేదు.ఆయన కవి కాదు కదా! కవులకి గర్వం ఎక్కువ అని నా అధిక్షేపణ.)
ఉ:సర్వము భ్రష్టమై భరతజాతి కృశించగ నాంగ్లపాలనన్ "సర్వ జగత్తునన్ భారత జాతిని మెచ్చరె దేశభక్తి తో గర్వము తోడ" నంచనెను గా కవివర్యుడు రాయప్రోలె ! ఆ గర్వము లేని వాడు కవి కాడు కదా తలబోసి చూచినన్ (ఏ దేశ మేగినా,ఎందు కాలిడినా ---నిలుపరా నీజాతి నిండు గౌర్వమ్ము/గర్వమ్ము)
(3)కం:సర్వభ్రష్టుని బొగడుచు సర్వేశ్వరు డనుచు వ్రాసె చంపక మాలల్ సర్వాధము బొగడు నితడు గర్వమ్మే లేని వాడు , కవిగాడు కదా! (ఇక్కడ "కవిగాడు" అంటే "కవిగాడు" అనే నిందార్థం లోనే తీసుకోవాలి.అలా పొగడటం సిగ్గు లేని తనమే కదా!)
పర్వముకన్నులకగుగా
రిప్లయితొలగించండిసర్వముకవితాజగతినిచదివినచోటన్
సర్వేశ్వరుడాకవియే
గర్వమ్మేలేనివాడుకవిగాడుగదా
ఉర్వినిసార్వభౌములననుందురువారును కీర్తినందుచున్
రిప్లయితొలగించండిఇర్వురునైరివారునిలనీశ్వరులందురనంతకోటిలో
పర్వముగాగనిల్చెకవి, పాలకుచెంతనుగౌరవంబుగా
గర్వము లేనివాడు కవికాడుగదాతలపోసిచూచినన్
ఉర్విని భోగ భాగ్యములు నుండిన లాభములేదు తెల్గులో
రిప్లయితొలగించండిసర్వవిధాల కష్టపడి సారపువిద్యను
నేర్చి యందులో
సర్వము వచ్చు నాకుగడు జక్కని
పాటవముందినాకనే
గర్వములేనివాడు కవిగాడు కదా తలపోసి జూసినన్
కందం
రిప్లయితొలగించండిపర్వదినమ్మున శుభమని
సర్వకవుల గూడఁ గట్ట సమ్మేళనమై
యోర్వని వారిని మించుట
గర్వమ్మే? లేనివాఁడు కవి గాఁడు కదా!
ఉత్పలమాల
పర్వదినమ్మునన్ బిలిచి పాండితి జూపుమటంచు కోరగన్
సర్వకవీశ్వరుల్ తమరి చాతురి చాటుచు నుండ యోగ్యుఁడై
యోర్వని వారి మించునటు లుత్తమ పాటవమొల్కఁ గాదుగా
గర్వము? లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్!
రిప్లయితొలగించండిసర్వోన్నత భాషయనిన
నుర్విని నా మాతృ భాష యొకటే యనుఛున్
గర్వింతురు సుజనుండ్రా
గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా!
చర్విత చర్వణమ్ముగ ప్రచారము జేయుచు మాతృ భాషయే
యుర్విని భాషలందు గన నున్నత మైనదటంచు నెప్పుడున్
గర్వముతో వచింపగల గండడులే కడు స్వల్ప మైన నా
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్.
సర్వోత్కృష్టఁపు కావ్యము
రిప్లయితొలగించండిపర్వముగావ్రాయ జనులు భళియని పొగడన్
గర్వము నొందుట సాజము
గర్వమ్మే లేనివాఁడుకవిగాఁడుకదా
గీర్వాణ భారతమ్మున
రిప్లయితొలగించండిపర్వములన్నటి నెరవుగ పఠనము జేయన్
సర్వము దనకు దెలియునను
గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా
గర్వాతిశయమున కవుల్
రిప్లయితొలగించండిసర్వోన్నతి చాటు చుంద్రు శ్మశ్రువు తోనే
గర్వంబించుక సహజము
గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా
గర్వము చాటిచెప్పుటకు గాదెకవీంద్రులు పెంచు మీసముల్
చర్వితచర్వణమ్మనగ చాటిరి వేంకట లబ్దవర్ణులే
యుర్విని రెండు బాసలకు యోగ్యులు తామని నిశ్చయంబుగా
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్
పర్వముగా కవిత్వమును పండిత పామర రంజకమ్ముగా
రిప్లయితొలగించండినుర్విని వ్రాయు సత్కవిని యుక్తముగా ప్రజ సత్కరించగా
గర్వమొకింత బూననది గౌరవముంగని సంతసించుటే
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్
సర్వజ్జు o డై చెలగుచు
రిప్లయితొలగించండిసర్వుల హితములను గోరి చక్కని కవిత ల్
గర్వా న నల్లు నతని కి
గర్వమ్మే లేని వాడు కవి కాడు గదా!
కం॥ గీర్వాణాంధ్రముల నెరిఁగి
రిప్లయితొలగించండిసర్వము నేర్చిన విబుధుఁడు సైరా నాకీ
యుర్విని లేరు సరియనెడి
గర్వమ్మే లేని వాఁడు కవి గాఁడు కదా
ఉ॥ పూర్వపు సత్కవుల్ భువినిఁ బొంది కవిత్వ పటుత్వ సంపదల్
గర్వ మొకింతఁ జూపకను గారవ మొప్పఁగ వ్రాసిరెన్నియో
యుర్వినిఁ బ్రస్తుతమ్ము కని యున్నది యిమ్ముగఁ దెల్పమందువో
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్
-
రిప్లయితొలగించండిసర్వము సరస్వతి చలువ!
గర్వమ్మే లేనివాఁడు కవి; గాఁడు కదా
నోర్వనితనమ్ము తోడై
నిర్వాహకుల చెడమడ దునిమెడు మనుజుడౌ
కవి కాడు కదా!అన్నారా?కవిగాడు కదా!అన్నారా? రెంటికీ అర్థం లో తేడా ఉంది.
రిప్లయితొలగించండికం:సర్వ మెరుగు గురుదేవుడు
రిప్లయితొలగించండిగర్వమ్మే లేని వాడు, కవి కాడు కదా!
సర్వమున శూన్యు డయ్యును
సర్వజ్ఞుడ ననుచు దలచి సంబర మొందన్.
(గురువు గారికి గర్వం లేదు.ఆయన కవి కాదు కదా! కవులకి గర్వం ఎక్కువ అని నా అధిక్షేపణ.)
ఉ:సర్వము భ్రష్టమై భరతజాతి కృశించగ నాంగ్లపాలనన్
రిప్లయితొలగించండి"సర్వ జగత్తునన్ భారత జాతిని మెచ్చరె దేశభక్తి తో
గర్వము తోడ" నంచనెను గా కవివర్యుడు రాయప్రోలె ! ఆ
గర్వము లేని వాడు కవి కాడు కదా తలబోసి చూచినన్
(ఏ దేశ మేగినా,ఎందు కాలిడినా ---నిలుపరా నీజాతి నిండు గౌర్వమ్ము/గర్వమ్ము)
(3)కం:సర్వభ్రష్టుని బొగడుచు
రిప్లయితొలగించండిసర్వేశ్వరు డనుచు వ్రాసె చంపక మాలల్
సర్వాధము బొగడు నితడు
గర్వమ్మే లేని వాడు , కవిగాడు కదా!
(ఇక్కడ "కవిగాడు" అంటే "కవిగాడు" అనే నిందార్థం లోనే తీసుకోవాలి.అలా పొగడటం సిగ్గు లేని తనమే కదా!)
పూర్వము వినమే లోచన
రిప్లయితొలగించండిపర్వపుఁ గవి సార్వభౌముఁ బండిత వరు నీ
యుర్విని విశ్వాస జనిత
గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా
గర్వ విహీన ధీ పటిమ గౌరవ సంజని తేద్ధ భావ నా
ఖర్వ విలాస భాస పరికల్పిత రమ్య ముఖార విందుఁడై
సర్వ వచః ప్రభా కలిత శాస్త్ర వివేక విచక్షణౌఘ వా
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్
[వాక్+అర్వము=వాగర్వము; అర్వము = గుఱ్ఱము]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
సర్వులు కవులున్న సభను
పర్వమున చదువ కవితను పదుగురు
పొగడన్
గర్వము కనపడు కొలదిగ
గర్వమ్మే లేని వాడు కవి గాడు కదా!
ఉ.
రిప్లయితొలగించండిపర్వము నాంధ్ర భాష మధుపానము ద్వంద్వ కవుల్ సభాస్థలిన్
సర్వము తేట తెల్లమయి సారము పాటల రూపమందెడిన్
బూర్వపు వైభవంబు కథ పూరణ జేసెడి వాక్పటుత్వమున్
*గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్.*
ఉర్విని కవియన నించుక
రిప్లయితొలగించండిగర్వమ్మే లేనివాడు, కవి గాడు కదా
గర్వము చూపుచు సతతము
సర్వము నాకెరుకనుచును సాగు నరుడిలన్