7, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4669

8-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్”
(లేదా...)
“నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్”

20 కామెంట్‌లు:

 1. కందం
  ఎక్కఁదగు గద్దె దక్షులు
  మక్కువనభివృద్ధి పథము మన్నన నడుపన్
  బొక్కసముఁ దరుగ మ్రింగెడి
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  ఉత్పలమాల
  ఎక్కగనొప్పు పీఠమును నేర్పడ దక్షత దేశమేలఁగన్
  మక్కువ వృద్ధిఁ జేయుచును మన్ననలంద ప్రపంచమంతటన్
  బొక్కసమన్నదాని సరిపుచ్చక రాబడి పెంచి, మ్రింగెడున్
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 2. అక్కునౄజేర్చినకొడుకును
  ప్రక్క ఁజూచినభయపడిపాఱుటకంటెన్
  స్రుక్కకమదిలో తండ్రియు
  నక్కలనున్స్రుక్కఁజేసినన్మెచ్చగగున్

  రిప్లయితొలగించండి
 3. ప్రక్కన గలవారిపయిన
  నక్కసు కలిగినను కూడ నగుపడ కుండన్
  చక్కగ మాటాడెడి యా
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  రిప్లయితొలగించండి
 4. నిక్కము లెక్కలేని సిరి నిర్భయ
  మొప్పగ బ్రోగుజేయగన్
  జిక్కిని బక్కవారలను జిత్రముగా
  భయపెట్టి డబ్బులన్
  మెక్కెచు నిత్యమున్ సతము మేదినిలో
  నివసించునట్టి యా
  నక్కల సృక్క జేసెడు గుణప్రవరున్
  గొనియాడగా దగున్.

  రిప్లయితొలగించండి
 5. -

  ముక్కాబలా ! జిలేబీ
  ముక్కాబల! వెనుతిరుగకు మున్ముందుకుపో
  తిక్కకుదురునటుల సదరు
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  రిప్లయితొలగించండి
 6. చక్కనిదేశపు ప్రగతిని
  నక్కలవలె కాచుకొన్న నాయక ముఖ్యుల్
  చిక్కుల పడజేతురుగద
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నక్కలవంటివారుగద నాయక ముఖ్యులు పోల్చిచూడగా
   చక్కని దేశమందుగల సంపద మొత్తము కొల్లగొట్టగా
   మక్కువ చూపువారలను మార్కొని జిత్తులమారులైన యా
   నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

   తొలగించండి

 7. పెక్కుగ మననేత లిపుడు
  రక్కసి మూకలను బోలి రాజ్యము నేలన్
  లెక్కింపక నట్టి కపట
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్.


  చక్కని చుక్క దక్కెనని సంబర మించుక లేకపోయెనే
  రక్కసు లక్కలే యొడయు రాలిని రాతము హింస పెట్టగా
  పెక్కుగనేడ్చు పద్మముఖి వేదన దీర్చు నెపమ్ము తోడ తా
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్.

  తాను+ అక్కల= తా / నక్కల

  రిప్లయితొలగించండి
 8. దక్కిన దానిని మ్రింగుచు
  చిక్కిన దేమైన గాని చేకొనుచు సదా
  మెక్కగ చూచెడు మానవ
  నక్కల నున్ స్రు క్క జేసినన్ మెచ్చ దగున్

  రిప్లయితొలగించండి
 9. చొక్కటమగు మాటలతో
  పెక్కురు సుజనులను మభ్యబెట్టుచు గమిలో
  తప్పుడు పనులొనరించెడు
  “నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్”

  రిప్లయితొలగించండి
 10. చక్కగ నిలబడి వాక్య
  మ్మొక్కటి బల్కంగ లేక నుత్తమ పీఠం
  బెక్కియు వ్రేలాడెడు యా
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  సరిగా నిలబడి ఒక వాక్యం పూర్తిగా పలుక లేకున్నా అధికార పీఠం వదలని అమెరికా అధ్యక్షుడు లాంటి వారు.

  రిప్లయితొలగించండి
 11. చొక్కఁపు మాటలన్ బలికి క్షోభము గూర్చెడు మోసకారులన్
  చిక్కని స్నేహబంధమున చిచ్చును రేపెడు కల్మషాత్ములన్
  పెక్కువిధాల సజ్జనుల వేసటఁ బెట్టెడు దుండగీడులౌ
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 12. కం:"నక్కయె రాజాజీ యని"
  య క్కపటపు తెల్ల వాడె యచ్చెరు వొందెన్
  చక్కని కౌటిల్యమ్మున
  నక్కలనున్ స్రుక్క జేసినన్ మెచ్చ దగున్
  (చక్రవర్తుల రాజగోపాలా చారి తెలివికికి బ్రిటిష్ వాళ్లే ఆశ్చర్య పడి మదరాసు గుంట నక్క అని పేరు పెట్టారు.ఆయన్ని మెచ్చుకోవాలి మరి!)

  రిప్లయితొలగించండి
 13. కం॥ చక్కని మాటల నాడుచు
  మక్కువఁ బడయు కపటుల ప్రమాదము గనుచున్
  టక్కున పాఠముఁ గరపుచు
  నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చఁదగున్

  ఉ॥ కుక్కల వోలె నమ్మకము గొప్పగఁ జూపుచుఁ జెంతఁ జేరుచున్
  నక్కల వోలె మోసమును నమ్మక ద్రోహముఁ జేయు వారలన్
  గ్రక్కునఁ గాంచి వారలకు గట్టిగ బుద్ధిని నేర్పు యోధుఁడై
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 14. ఉ:అక్కట చూడుమా కరటకా! ఒక యెద్దున కింత సఖ్యమా
  పక్కన జేరి పింగళకు బారిన చిక్కకనున్నదే కదా!
  చక్కగ మిత్రభేదమును సాగక యున్నది వాని తెల్వి తో
  నక్కల స్రుక్క జేసెడు గుణప్రవరున్ గొనియాడగా దగున్
  (నీతి చంద్రిక లో కరటక దమనకులు నక్కలు.పింగళకు డనే సింహానికి,సంజీవకు డనే యెద్దుకి మిత్రభేదం కలిగించే ప్రయత్నం లో దమనకుని ఆశ్చర్యం.)

  రిప్లయితొలగించండి
 15. ఒక్కరి కైనను బోరున
  దక్కునె శాంతి యిసుమంత తర్కించి యిటుల్
  వెక్కసముగ నష్ట మొసఁగు
  నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చఁ దగున్

  [కలను = యుద్ధము]


  దిక్కయి యెల్ల వారలకు దేశ పురోగతి పైన నాత్మలో
  మక్కువ మిక్కుటం బడర మాన్పఁగఁ గ్రక్కునఁ జిక్కు లింపుగాఁ
  జిక్కక యేరికిం బుడమిఁ జిక్కిన రొక్కము నెల్ల బొక్కెడిన్
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 16. నిక్కముఁబలుకక యెప్పుఁడు
  కుక్కలువలె మొఱుగు చుండు కుత్సిత బుద్ధిన్
  జుక్కల నంటిన గుంటల
  నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

  రిప్లయితొలగించండి
 17. చక్కటి బాహువుల్గలిగి సాహస ఋద్ధిని వైరి వీరులన్
  నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్
  బక్కగ నుండువాఁడిహను భార్యను సైతము మూర్కొనంగడే
  యిక్కడ యక్కడంయనక నెక్కడనైనను వేలుఁజూపుమా

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  టక్కరి మాటలు చెప్పుచు
  చిక్కులు బెట్టుచు పదుగురు ఛీ యను
  విధమున్
  మిక్కిలి నయవంచకులౌ
  నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చదగున్.

  రిప్లయితొలగించండి
 19. చక్కనివాడవీవునిను స్వాంతము నందున కోరుకొంటినే
  మక్కువ తోడ పారుడవు మానిని యింగిత మీవెరుంగవే
  నెక్కడికైనవచ్చెదనునీవున నౌననజాలునోసఖా
  నక్కలు స్రుక్కజేసెడి గుణప్రవరున్ గొనియాడగాదగున్

  రిప్లయితొలగించండి