శ్రీరామునిచే చచ్చుటె పారమ్యమ్మనుచు తాను భావించుచు తా సారంగముగను మారిన మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్.
సారంగమ్ముగ మారి రాఘవుని యా శల్యమ్ము తో చచ్చుటే పారమ్యమ్మని యెంచుచున్ గదలె సంవాదమ్మునే పెంచకన్ శ్రీ రాముండన భక్తి జూపెగద జేజేగొంగ తానైన నా మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్,
శా:శ్రీరామున్ గుడి నిల్ప భక్తియుతులై సేవింప రారైరి పో! మీరన్ కక్షలు, హిందు జాతి మదిలో మెప్పొంద గా నైన నౌ రా! రాకుండిరి,వీరి కంటె తుది లో రామా యటం చేడ్చు నా మారీచుండు మహాత్ముడే యగును సన్మానార్హుడై యొప్పెడిన్
పోరున గెలువగరాదని
రిప్లయితొలగించండివారింపగరావణుండు వైరముతోడన్
మీరెన్ తాటకిపుత్రుని
మారీచుండుత్తముడును మాన్యుండెయగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోరియు వైరము గూడదు
రిప్లయితొలగించండివీరుడు రఘురామచంద్రువినురావణ!యా
క్రూరుడు వినకను మడిసెను
మారీచుండుత్తముండు మాన్యుండయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమారెను బంగరు జింకగ
రిప్లయితొలగించండిచేరియు విపినమును దాను జే టొ న రిం చెన్
దారుణ మొన రింప నెటు ల
మారీచుండు త్త ముడును మాన్యుం డ య్యె న్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కోరంగాగనిరాచకార్యమును తాకూర్చెంగ చిత్రాకృతిన్
రిప్లయితొలగించండిపారంబంటెనురాముబాణమున తాపంబున్విడెన్శాంతుడై
నారిన్సీతనుదెచ్చుకార్యమున తానైక్యంబునందెన్హరిన్
మీరీచుండుమహాత్ముడేయగును సన్మానార్హుడైయొప్పెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కూర్చెంగ' అనడం సాధువు కాదు.
సవరిస్తాను
తొలగించండిమారీచుండు
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిమీరి దశకంఠుఁ జావక
శ్రీరాముని చేతఁజచ్చి చెందె ముగితి! నిం
ద్రారుల మధ్యన ధన్యుడు!
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
శార్దూలవిక్రీడితము
మీరన్జూడక రావణాసురుని నున్మేషాన ధర్మాత్ముడౌ
శ్రీరామున్ మదినెంచి బాణహతి నిర్జీవుండునయ్యెన్ గదా!
క్రూరత్వంబున రేగు రాక్షసుల సద్గుణ్యంబునౌ చింతనన్
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివైరము వలదని దెల్పియు
రిప్లయితొలగించండిక్రూరుడు రావణుని చేత గూలుటకన్నన్
శ్రీరామ శరమునడగిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరామాయణ కథలో
రిప్లయితొలగించండిఆరావణు డాధరణిజ నంకించుటకై
మారి మెకముగ గతించిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా.
రిప్లయితొలగించండిశ్రీరాముండు సుబాహు జంపె, మునికై సిద్ధాశ్రమాధ్వర్యమున్
మారీచుండు శిలీముఖంబు హతి వైమాలమ్ముగా డుల్లుటన్
ఆరాధ్యుండని రావణాజ్ఞ, హతుడై, హాహా! కురంగమ్ముగా
*మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్.*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీరామునిచే చచ్చుటె
పారమ్యమ్మనుచు తాను భావించుచు తా
సారంగముగను మారిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్.
సారంగమ్ముగ మారి రాఘవుని యా శల్యమ్ము తో చచ్చుటే
పారమ్యమ్మని యెంచుచున్ గదలె సంవాదమ్మునే పెంచకన్
శ్రీ రాముండన భక్తి జూపెగద జేజేగొంగ తానైన నా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికోరివరించెను మృత్యువు
రిప్లయితొలగించండిశ్రీరాముని చేతులందు శివమగుననుచున్
మారెను బంగరు జింకగ
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రూరుండౌ లంకేశుని
రిప్లయితొలగించండివారింపగ లేనివాడు ప్రాణము విడిచెన్
కోరిన సాయము చేసిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
క్రూరాత్ముండగు రావణుండు కొసరెన్ కొంగ్రొత్త మోసంబునే
తొలగించండివేరేమార్గము లేక పాల్గొనెఁ గదా విద్రోహ కార్యంబులో
శ్రీరాముండు వధింపగా గతపడెన్ జేకొన్న కార్యార్థమై
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిశ్రీరాముండవతారమూర్తి హరియే శిక్షించుతాఁ దైత్యులన్
రిప్లయితొలగించండివారింపన్ వినకున్న రావణుడహో బంగారు రిశ్యమ్ముగా
నారామంబునకంపె పుణ్యగతులే యారాముడీయంగనా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:శ్రీరాముని గుడి గట్టం
రిప్లయితొలగించండిగా రానే రామటంచు,కళవళ బడు నా
నా రభసల జూడ నసుర
మారీచుం డుత్తముడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅయ్యా!ధన్యవాదం.
తొలగించండికం॥ ఆరావణు మాట వినుచు
రిప్లయితొలగించండిశ్రీరాముని కార్యమునకు సేవను జేసెన్
మారీచుఁడు సమిధగనై
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
శా॥ శ్రీరాముండిలఁ బుట్టె ధర్మమును రక్షించంగ సద్వర్తనన్
బారావారముఁ గాంచు మార్గమును సంభావించెడిన్ వారలన్
సారించంగఁ బరోక్ష రీతిగఁ గనెన్ సాయంబు మారీచుఁడే
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిశా:శ్రీరామున్ గుడి నిల్ప భక్తియుతులై సేవింప రారైరి పో!
రిప్లయితొలగించండిమీరన్ కక్షలు, హిందు జాతి మదిలో మెప్పొంద గా నైన నౌ
రా! రాకుండిరి,వీరి కంటె తుది లో రామా యటం చేడ్చు నా
మారీచుండు మహాత్ముడే యగును సన్మానార్హుడై యొప్పెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీరాముని బలమెరిగిన
రిప్లయితొలగించండిమారీచుడు రావణునకు మంచిగ బోధన్
తీరుగ చేసె గన నసుర
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరామామణి సీతను
రిప్లయితొలగించండిదారుణముగ మోసగించ దవ్వులదిరుగన్
గ్రూరుఁడు దుష్టుఁడె,యెటులుగ
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరాముడప్రమేయుడుఁ
రిప్లయితొలగించండిబోరాడగ తగవవనిజ పోకార్చు నినున్
మారామేటికఁ బలికిన
మారీచుండుత్తముడును మాన్యుండెయగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిఏ రీతిని రామునితోఁ
రిప్లయితొలగించండిబోరు దలంపఁ దగ దంచు బోధింపంగా
నా రావణునకు ధర్మము
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్
ఆరాధ్యుం డగు దైత్య దానవ విహం గాదిత్య సిద్ధాప్స రో౽
నూరశ్యేన గవాశ్వ యక్ష తరు నాగోష్ట్రౌఘ శార్దూల ర
క్షోరాడ్వ్రాత మృగేంద్ర గార్దభముఖస్థోమమ్ముఁ బుట్టించె నో
ధారాళమ్ముగ నెవ్వఁ డివ్వసుధ నాతం డౌను నిక్కమ్ముగా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్
[మారీచుఁడు = మరీచి పుత్రుఁడు, కశ్యపుఁడు]
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిశ్రీరామా యనికేకవెట్టుచును తా శీఘ్రమ్ముగా కానలో
రిప్లయితొలగించండినారాచమ్మునవేగఘాతినటబొందన్ ఖిన్నుడౌచున్నటన్
శ్రీరామున్కరమందెజచ్చెనసురశ్రేష్టుండునచ్చోటనా
*“మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
నారిని రాముని కిడమన
నా రావణుడు వినకుండె;నంతట వనికే
గెన్ రామునిచే మడియగ
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్
.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
(సవరణతో...)
నారిని రాముని కిడమన
నా రావణుడు వినకుండె;నంతట చనె తా
నా రామునిచే మడియగ
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్