9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4671

10-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్”
(లేదా...)
“రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్”

43 కామెంట్‌లు:

  1. కందం
    దోషమనక కౌంతేయులు
    ద్వేషము విడి సంధిఁ గోరి, ధిక్కారమునన్
    రోషపడ జ్ఞాతులు, దురు
    క్రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్

    ఉత్పలమాల
    దోషము కాదుకాదనుచు తోయజనేత్రుని సంధికంపినన్
    ద్వేషము కౌరవుల్ విడక వీరులమంచును యుద్ధమెంచియున్
    రోషపడంగ, పాండవులు ప్రోచెడు కృష్ణుడు తోడుగన్ దురు
    క్రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఉక్రోషము (ఉక్కు + రోషము) దేశ్యపదమండి. కనుక దురుక్రోషము సాధువు కాదు.

      తొలగించండి
    3. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      శ్రీపోచిరాజువారి సూచనకు ధన్యవాదములతో సవరించిన పూరణ:

      ఉత్పలమాల
      దోషము కాదుకాదనుచు తోయజనేత్రుని సంధికంపినన్
      ద్వేషము కౌరవుల్ విడక వీరులమంచును యుద్ధమెంచియున్
      రోషపడంగ, పాండవులు ప్రోవఁగ కృష్ణుడు దుష్టమైన ను
      క్రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

      తొలగించండి
    4. సవరించిన కందం:

      కందం
      దోషమనక కౌంతేయులు
      ద్వేషము విడి సంధిఁ గోరి, ధిక్కారమునన్
      రోషపడ దుష్టమగు ను
      క్రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్

      తొలగించండి
    5. మరిన్ని సవరణలతో:


      కందం
      దోషమనక కౌంతేయులు
      ద్వేషము విడి సంధిఁ గోరి, ధిక్కారమునన్
      రోషపడ దుష్టమగు యు
      క్రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్

      ఉత్పలమాల
      దోషము కాదుకాదనుచుఁ దోయజనేత్రుని సంధికంపినన్
      ద్వేషము కౌరవుల్ విడక వీరులమంచును యుద్ధమెంచియున్
      రోషపడంగఁ, బాండవులు ప్రోవఁగఁ గృష్ణుడు దుష్టమైన యు
      క్రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

      తొలగించండి
  2. ఘోషించెగజీవాత్మయు
    భాషలకామాదులందు భాసురమగుచున్
    దోషముతెలిసినవాడై
    రోషముడిగిచంపిరేవిరోధులబలిమిన్

    రిప్లయితొలగించండి
  3. శోషిలఁజేస్రిరేమునులు శుష్కములైనవిజీవితాశలన్
    వేషముజూపువర్గములవిజ్ఞత జూపుచుముక్తిగోరుచున్
    తోషమువిష్ణువేయనిరిదుర్మతివీడిమమేకమైహృదిన్
    రోషములేనివారలువిరోధులయుక్కడంచిరుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    ఘోషణ జేసె దా సురల గోవుల మించిన యజ్ఞమూర్తిగా
    నోషధి లేదు, వేనుడను నొక్కని, నీచుని, లోకకంటకున్
    తోషము లేని బ్రాహ్మణులు దువ్వక దండును హుంకరించగన్
    *రోషము లేని వారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్.*

    ... డా. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  5. పాషాణహృదయులపయిన
    రోషముడిగి , చంపిరే విరోధుల బలిమిన్
    భాషణమందున వారికి
    తోషము కలిగించు పలుకు దోరగ నుడువన్

    రిప్లయితొలగించండి

  6. ఆ షండుని గనినంతనె
    భీషణ శపథము గలిగిన భీష్ముడట నా
    పౌషమున నస్త్రములువిడె
    రోషముడిగి, చంపిరే విరోధుల బలిమిన్.



    పౌషము నందు కట్టెదుట పార్థుని ముందు శిఖంఢి నిల్వగా
    భీషణ బంధకమ్ముగల వీరుడు భీష్ముడు బ్రహ్మచర్యమే
    భూషణమైన వాడు కడు పూజ్యుడు వానికి పాండు పుత్రులా
    రోషము లేనివారలు, విరోధుల నుక్కడగించి రుద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  7. దోషము రావణ విభునిది
    ద్వేషము లేదాయె లంక వీరుల పైనన్
    ఘోషణమలరగ కపులే
    రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్

    భీషణ యుద్ధమందున విభీషణుడే కనిపించకుండినన్
    దోషములేని సైనికులు దూకిరి యుద్ధమునందు గ్రుడ్డిగా
    దూషణ తోడ వానరులు దుష్టుడు రావణుడంపు సేనపై
    రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  8. ద్వేషము గలిగిన వారై
    భీషణ రణమును సలుపక విష చిత్త ముతో
    దూషణ మొన రింప క యే
    రోషము డిగి చంపిరే విరో ధు ల బలిమిన్

    రిప్లయితొలగించండి
  9. ద్వేషమె యరిషట్కపు కా
    వేషములకు మూలమంచు వేగమె నుడుపన్
    తోషణ నెలకొనఁగ మదిని
    రోషముడిగి, చంపిరే విరోధుల బలిమిన్

    రిప్లయితొలగించండి
  10. కం॥ భీషణ నిష్ఠను తపమును
    కాషాయ వలువ ధరించి కనుచు భువిని సం
    తోషముగ షడ్గుణములను
    రోషము ముడగి చంపిరే విరోధుల బలిమిన్

    ఉ॥ భీషణ నిష్ఠతోఁ దపము విజ్ఞతఁ బాయక నాచరించుచున్
    శోషణ షడ్గుణమ్ములను స్ఫూర్తిగ చేసెడి నిశ్చయమ్మతో
    వేషము వేయకుండఁగను వేడుచు నీశ్వరు మౌనివర్యులే
    రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

    గుణములు(గుణమ్ములు)+అను గుణములను (గుణమ్ములను) విరోధులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కాషాయ వలువ' దుష్టసమాసం.

      తొలగించండి
    2. ధన్యవాదములండి. కాషాయంబును ధరించి లేక
      కాషాయాంబరముఁ బడసి అనగలమాండి

      తొలగించండి
  11. కం:రోషము లేదని ,శాంతము
    నాషామాషీ గ నెంచి యతివాదముతో
    ద్వేషించ భరత వీరులు
    రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్?

    రిప్లయితొలగించండి
  12. ఉ:భాషయు,ప్రాంతమున్,మతము బట్టుక నిత్యము వాని నెంచుచున్
    ద్వేషము,పక్షపాతమును,భేదము లెన్నక నిష్ఫలమ్ములౌ
    రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్”
    "వేషము లింక సాగ" వని వీడెను శత్రువు యుద్ధకాంక్షలన్.
    (భాషామతాలభేదాల నిష్ఫల మైన రోషలు లేని వారు)

    రిప్లయితొలగించండి
  13. కాషాయమ్ముల వెలుఁగుచు
    వేషమ్ముల మార్చి యంత భీకర లీలన్
    దూషించుచుఁ గపటమ్మున
    రోష ముడిగి చంపిరే విరోధుల బలిమిన్


    ఘోష లొనర్చుచున్ భృశము ఘోర తరమ్ముగఁ దిట్టుచుండఁగన్
    దూషణ భాషణమ్ము లవి తోరము నొవ్వఁగఁ జేయ నుగ్రులై
    దోష నిరూపణమ్మునను దూర్ణము కించి దవాంఛనీయమౌ
    రోషము లేని వారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  14. కాషాయాంబరు లుందురు
    రోషముడిగి,చంపిరే విరోధుల బలిమిన్
    భీషణమగు రణమందున
    పాషాణపుహృదయులగుచుఁబ్రతియొక్కరినిన్

    రిప్లయితొలగించండి
  15. ద్వేషమె యంకురమ్ము పరివేదన గూర్చఁగ మానవాళికిన్
    దోషములెంచకన్ పరులు తోషము నొందగజేయు రీతి కా
    వేషమునాది షట్కముల వీడిచరించెడు బుద్ధిశాలురౌ
    రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దోషము లెంచకుండ పరతోషము..." అంటే బాగుంటుంది కదా?

      తొలగించండి
  16. వేషము మార్చి పాండవులు వేరుగ చేరిరి మత్స్య దేశమున్
    తోషముతో విరాటుడును దోసిలిమోడ్చుచు నాదరించగన్
    భీషణమౌరణమ్మునను వేగమె గెల్చిముదమ్ము గూర్చగన్
    *“రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్”*

    రిప్లయితొలగించండి