12, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4674

13-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మెచ్చనట్టివారె మిత్రులకట!”
(లేదా...)
“మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

  1. శాస్త్రమందు నియతిసాధింపవలెనను
    మాటజెప్పువారెమాన్యులిలను
    తప్పు దారికవిత తలదాల్చగాలేక
    మెచ్చనట్టివారెమిత్రులకట

    రిప్లయితొలగించండి
  2. నిచ్చలుమాటయందుతమ నేర్పునుఁజూపుచు ప్రక్క దారిలో
    హెచ్చగదోషభావములుహేయని మేలములాడకేకవిన్
    నచ్చనికావ్యదోషమున నాదరమెంచుచు వృద్ధిగోరగా
    మెచ్చనివారెమిత్రులు సుమీ కవితామృతమెంత బంచినన్

    రిప్లయితొలగించండి
  3. తమకు మిత్రు డయ్యు తమలోని మనుజుడు
    ప్రతిభ జూపినయడ పట్ట నట్లు
    నటన జేయ గలరు నచ్చలేరదివారు
    మెచ్చనట్టివారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    చక్రి బావఁ గోరి సాదిగ రమ్మని
    బంధుమోహమొదవ ఫల్గుణుండు
    విల్లుపట్టననఁగ విహితమ్ము కాదని
    మెచ్చనట్టివారె మిత్రులకట!

    ఉత్పలమాల
    నచ్చిన శీర్షికన్ మలచి నల్గురిలో కవిసంగమమ్మునన్
    ముచ్చట తీర పంచుమనఁ, బూనుచు మచ్చుకు కొన్ని పాడఁగన్
    వచ్చిన మిత్రబృందమున, ప్రజ్ఞ మరింతగ సంతరింపఁగన్
    మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్

    రిప్లయితొలగించండి
  5. వచ్చిన పండితోత్తములు పట్టుబిగించుచు బ్రశ్నలేయ, వా
    క్రుచ్చిన పద్య రాజముల గూర్చి వధానియు వెల్లడించగా
    మచ్చిక గల్గి పద్యరసమాధురి మున్గి సభాంతరాళమే
    మెచ్చని; వారె మిత్రులు సుమీ! కవితామృత మెంతఁ బంచినన్.

    రిప్లయితొలగించండి
  6. ఎంత మధురపదము లెంచి వ్రాసిన కూడ
    వాస్తవముగ జూచు వాటిని విడి
    కలల లోన కనిన కథలని యెరిగించి
    మెచ్చనట్టివారె మిత్రులకట

    రిప్లయితొలగించండి
  7. కవిత లల్ల లేని కపట చిత్తము తోడ
    కల్ల బొల్లి కబురు కథలు జెప్పి
    కుళ్ళు బుద్ధి గల్గి కు విమర్శలొనరించి
    మెచ్చ నట్టి వారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి
  8. మచ్చిక చేసుకొంద్రు తమ మాటల గారడి చూపుచుంద్రు తా
    నచ్చన‌ మెచ్చనట్టి ఘను నాసఖు నాదగు మేలుగోరి తా
    హెచ్చగు కైతగోరి మరి హీనసమానపు కావ్యరాశినిన్
    మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్

    రిప్లయితొలగించండి
  9. ఉ.

    త్రచ్చిన బుద్ధి తేజరిలు దక్షత, ప్రశ్నలు వేయుచుండెడిన్
    విచ్చిన పుష్పరాజముగ వేడుక నివ్వని మందభాగ్యునిన్
    నచ్చిన రీతిలో వ్యధను నైజముగా నిడి యెగ్గుచేయుచున్
    *మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్.*

    రిప్లయితొలగించండి
  10. వ్రాతగాడిననుచు వాగర్థములసొంపుఁ
    గూడనట్టి కవితఁ గూర్చినపుడు
    "అద్భుతమ్ము నిదియు అబ్బబ్బ" యనుచును
    మెచ్చనట్టివారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి
  11. కావ్యరచనమందు కనుగొన్న లోపాలు
    కప్పిపుచ్చకుండ విప్పిచెప్పి
    దోషమున్న కృతిని భేషు! శబాసని
    మెచ్చనట్టివారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నచ్చిన మెచ్చుకొంద్రుగద నైపుణితో రచియించి చూపినన్
      మెచ్చినచో లభించుగద మేలగు మన్నన గ్రంథకర్తకే
      కచ్చితమైనదోషములఁ గన్గొని తెల్పుచు నట్టికావ్యమున్
      మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్

      తొలగించండి

  12. మంచి చెడ్డలంచు నెంచక ప్రతిసారి
    మెచ్చువాడుకాడు మిత్రుడెపుడు
    తప్పులున్న చోట తగదంచు వచియించి
    మెచ్చనట్టివారె మిత్రులకట!


    కుచ్చితులైన వారలను కూలురుగా నటియించు వారలే
    పొచ్చెము పుక్కిలించక ప్రమోదమటంచును మెచ్చు వారలే
    హెచ్చిల, గోసులున్నను సుహృత్తుని నేర్పరి జేయనెంచుచున్
    మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్.

    రిప్లయితొలగించండి
  13. అచ్చెరువొందు రీతి జను లందరు నీ విభవంబు గాంచి నిన్
    మెచ్చెడురీతి పండితు లమేయకవిత్వ పటుత్వమున్ గనన్
    నచ్చెడురీతి వ్రాయఁదగు నచ్చని రీతిగ నున్న యంశముల్
    మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్

    రిప్లయితొలగించండి
  14. సతము కావ్య రచన సలిపెడు నినుగాంచి
    మెచ్చుకొనఁగ నదియె మేలు గాని
    దోసము లెడనెడను దొరలిన వాటిని
    మెచ్చనట్టివారెమిత్రులకట!

    రిప్లయితొలగించండి
  15. ఆ॥ హితముఁ గోరుచుఁ బరిమితిఁ దెలుపుచు నుండి
    తప్పులన్ని దిద్ది తడఁబడకను
    సర్దుచుండు హితులు సఖులవనిని మిన్న
    మెచ్చనట్టి వారె మిత్రులకట

    ఉ॥ నచ్చిన నాతి రంభయని నచ్చని కన్యయె కోతియంచుఁ దా
    నిచ్చను జూపు రీతి తమ యిష్టముఁ దెల్పక వృద్ధిఁ గోరుచున్
    నచ్చినఁ దప్పులన్ని విడనాడఁగఁ జూపుచు హెచ్చరించుచున్
    మెచ్చని వారె మిత్రులు సుమీ కవితామృత మెంత పంచినన్

    రిప్లయితొలగించండి
  16. హాయినొందు మిగుల ఆలింగనము లోన
    అచ్చమైన ప్రేమ యదియె గాదె
    హెచ్చు పైకములను వెచ్చించ బహుమతి
    మెచ్చనట్టివారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి
  17. మచ్చరింప కెడఁద నచ్చ మైనట్టి భా
    వము గ్రహించి సతము సముచితముగ
    మంచి గుణము లరసి యంచితముగ వాని
    మెచ్చ నట్టి వారె మిత్రు లకట!


    ఇచ్చకు నచ్చి నట్లు వచియించెడి వారలు పెక్కు రిద్ధరన్
    నచ్చని వానిఁ గట్టెదుట నాన్పక చెప్పెడు వారిఁ గాంచమే
    కచ్చె వహించి పల్కి యిడి కాఱియ నిట్టుల సమ్మతింపఁ బో
    మెచ్చని వారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్

    [సమ్మతింపఁ బోము+ఎచ్చని; ఎచ్చు=విజృంభించు ]

    రిప్లయితొలగించండి
  18. మనిషి లోని దుష్ట మార్గముల నెపుడు
    మెచ్చనట్టివారె మిత్రులకట!
    పుణ్య కార్యములకు పూర్తిసహాయముఁ
    జేసి మంచివానిఁజేయునిలను

    రిప్లయితొలగించండి
  19. మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్
    మెచ్చిన వారుగాననుచు మీరలు మార్చుకొ నంగ యుక్తమౌ
    యచ్చున యట్లుగా వరలె యార్యులు దప్పుగ మానసంబునన్
    జొచ్చువడంగనీక యిక శుద్ధమనంబున జూడుమామమున్

    రిప్లయితొలగించండి
  20. మంచి విషయములను మహిని పంచు కొనుచు
    సహనభావమూనిచక్కగాను
    కలిసిహితముగరుపుకానిపనులుచేయ
    *మెచ్చనట్టివారె మిత్రులకట!”*

    వచ్చునుపద్యవిద్యయనుభావములేనిపదమ్ములెన్నియో
    హెచ్చుగ నెల్ల వేళలను యిమ్ముగ వాడుచు వ్రాయనెంచగన్
    నిచ్చలు వ్రాయసత్కవులునీరస దృక్కుల తోడనెప్పుడున్
    మెచ్చనివారె మిత్రులుసుమీకవితామృతమెంతపంచినన్

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ధర్మ పథము వీడి దారి తప్పిన వాని
    మంచి మార్గమునకు మలచగాను
    కోపమును నటించి కొన్ని రోజులు వాని
    మెచ్చనట్టి వారె మిత్రులకట!

    రిప్లయితొలగించండి