26, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4688

27-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు”
(లేదా...)
“గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్”
(డా॥ వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

48 కామెంట్‌లు:

 1. మందబుద్ధులకెంతయొ మంచి జరుగు
  పలుకు బడియున్న చాలును ఫలము దొరకు
  మేధ గలిగిన వాడికి మిగులు చేదు
  “గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు”  రిప్లయితొలగించండి
 2. పలుకుబడిపైస లుండన బనికిరాని
  తెలివి హీనులకే దక్కు దేశమందు
  గౌరవమునేడు, సుజనుల గానరెవరు
  గంధ రహిత సుమ్మల గౌరవింత్రు.

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  సద్గుణము పరిమళముగ సంఘమందు
  మన్ననన్గొని రాణింత్రు మనుజులెపుడు
  ప్రీతి భగవదర్చనకు భరింపరాని
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

  ఉత్పలమాల
  సంధిత సద్గుణాళిఁగని సంఘమునందున గౌరవించుటల్
  బంధురమౌను! మానవుఁడు వాసిగడించును నుత్తముండుగన్
  బొందిన తావితో ప్రభుని పూజకు నొప్పెడివంచుఁదెచ్చు దు
  ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  రిప్లయితొలగించండి
 4. మంచి మర్యాద తెలిసిన మానవులను
  చుల్క నగ జూచు సంఘమ్ము చోద్య ముగను
  పై న మెరుగులు గాంచియు ప్రజలు మెచ్చి
  గంధ రహిత సుమమ్ముల గౌర వింత్రు

  రిప్లయితొలగించండి
 5. కాలమెంతయొమారెనుగనుడునేడు
  పైమెరుగులకెజనులిల భ్రమను పడుచు
  మంచియలవాట్లనేల్లయు మరుగు పరచి
  గంధరహితసుమమ్ములగౌరవింత్రు


  బంధమువీడనాడుచునుపాతయురోతని యీసడించుచున్
  నంధులవోలెనేదియునునాదరమొప్పగగారవించకన్
  కొందరుమందులై సతము గొప్పలుచెప్పుట జూచుచుండగా
  గంధములేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

  రిప్లయితొలగించండి
 6. ముదితలకు దమ సిగలోన ముడుచుకొనగ
  పరిమళమునిడు పూవులు వలయుగాని
  మూడుకనుల వానికి నిత్య పూజసేయ
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

  రిప్లయితొలగించండి
 7. మంచియన్నది గతముగ మాఱిపోయె
  పనికి మాలిన వారికి పదవులిచ్చి
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు
  కలియుగమ్మున నివ్విధి కాననగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొందరి కందుచుండుగద కోరిన రీతిని భోగభాగ్యముల్
   నిందితులైనగాని తమ నేర్పరిమాటల మేళనమ్ముతో
   చిందులువేయువారలకు చిక్కును గాంచగ పెత్తనమ్మిలన్
   గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. ఉ.

  బంధుర హస్తముల్ తగుల వస్త్ర శరీరములన్ దృఢమ్ముగన్
  దంధనమౌ మనుష్యకృత దైనిక హారములన్ ధరించెడిన్
  కంధరమందు మాలలను కాంతము విద్యుత కందముల్ సభన్
  *గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్.*

  రిప్లయితొలగించండి
 9. అందలమునెక్కు అసమర్ధులైనవారు
  అందచందముల్గల్గగ నవనిలోన
  మందమతుల చందమ్మిది మహిని నేడు
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

  రిప్లయితొలగించండి
 10. ఇందుని యందచందములు ఇంపగురూపము గల్గియుండగన్
  మందుని గొల్తురెల్లరును మాన్యుడనంచును మాటిమాటికిన్
  అంధులు లోకులీ జగతినందున సత్యము గానలేరుగా
  గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  రిప్లయితొలగించండి
 11. అందరి మేలుకోరుకొను నాప్తునివోలె చరించు పోఁడిమిన్
  డెందమునందు నిశ్చలత ఠేవణమూను విపత్తులందునన్
  బందువువోలె నాదుకొని బాయక పేదలఁగాఁచు నట్టిదు
  ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  రిప్లయితొలగించండి
 12. తే॥ దంధన కపటము భువిని ధర్మమైన
  బంధనము బాధ్యతలిలను బాధవెట్ట
  బంధురము నందమైనను బ్రజలెలమిని
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

  ఉ॥ అంధుల లోకమందునను న్యాయము నప్పదు మూర్ఖులైనచో
  దంధన రాజకీయమున ధర్మము చేయ నటంచు నొప్పఁగన్
  బంధురమౌచు నందము నిబద్ధత నెంచని చోటఁ జక్కనౌ
  గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  (పైమెఱుగులకే పెద్ద పీట యని అండి)

  రిప్లయితొలగించండి
 13. ఉ:బంధము లందు మున్ గుచును,బంధము లన్ విడు డంచు శ్రీ యశో
  బంధము లందు జిక్కుకొను పండితు లొందగ గౌరవమ్ములన్
  బంధము వీడి ముక్తులగు వారికి శ్రీ యశముల్ లభించునే
  గంధము లేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

  రిప్లయితొలగించండి
 14. 1)తే.గీ:మల్లె,సంపెంగ పూవులు మరులు గొలుపు
  వాని స్థానమ్ము జంటల పడక గదులు
  దైవపూజాదులందు మందారముఖ్య
  గంధరహితసుమమ్ముల గౌరవింత్రు

  రిప్లయితొలగించండి
 15. చదువు సంధ్యలు లేకున్న చట్ట సభలఁ
  దానె మొనగాడ నంచును దర్పమలరి
  కారు కూతలు కూసిన కస్సుమనక
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

  రిప్లయితొలగించండి
 16. గంధసుమంబుల్పుట్టు జతగానిడు నందముఁ గొమ్మకన్నుకు
  న్బంధము వేయు పెండ్లి కడ బారెడు కాగితం తోరణంబులు
  న్కంధరమందు వేణులను కాంతలు కాగిత పూలఁదాల్చు నే
  గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. 'కాగితం' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 17. బంధురమైన భావమున బంధు జనంబులఁజూ డఁగోరుచున్
  బంధముఁ జిక్కనౌ నటుల బాధ్యత తోడను సాయ మొందుచోన్
  గంధర మందునన్ కనక కాంతుల మాల వేయ దు
  ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

  రిప్లయితొలగించండి

  రిప్లయితొలగించండి
 18. అందరి తలలో నాలుకయట్లు మెలఁగి
  యార్తులను శక్తికొలదిగ నాదుకొనెడు
  విమలచరితులై యశమున వెలుఁగు కలుష
  గంధరహిత సుమమ్ములగౌరవింత్రు

  రిప్లయితొలగించండి
 19. నర సు రాసుర గంధర్వ నాగ కిన్న
  రాప్సరో గణ యక్ష విహంగ రాజు
  లరయఁ బదునాల్గు లోకము లందు నెలమిఁ
  గంధ రహిత సుమమ్ముల గౌరవింత్రు

  [కంధము = మేఘము; సుమము = ఆకాశము]


  అంధులు గూడ సంఘమున నర్హులు మన్నన లంద నెంచఁ గా
  మాంధు లనర్హు లందఁగ నిహమ్మున గౌరవ మించు కేనియున్
  గంధము లేని పుష్పములుఁ గంజ దళాక్షుని యర్చ కొప్పు దు
  ర్గంధము లేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

  రిప్లయితొలగించండి

 20. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  ధనము కలిగిన వారల దరికి చేరి
  దుష్టులైనను వారినే యిష్టపడుచు
  గుణము లేకున్న ధనమును గుంజవచ్చు
  ననెడు నాశతోడను మెచ్చుకొనుచు నుంద్రు
  గంధ రహిత సుమమ్ముల గౌరవింత్రు.

  రిప్లయితొలగించండి
 21. మందమతులగుచు జనులు మద్యమునకు
  బానిసలుగ మారుచు దేశ ప్రగతి మరచి
  గర్హ్యులకునధికారమ్ము కట్టబెట్ట
  గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు.


  ఇందునిభాస్య కైశికము నింపుగ దాల్చగ నైన సచ్చిదా
  నందము జేరి కొల్చు తరుణమ్మున నైనను ధర్మరక్ష కా
  స్కందము గీర్తిశేషులగు గండరగండ సమాధి నైనను దు
  ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్.


  మందులు లోకులై యుచిత మాదక ద్రవ్యము మద్య మాంసముల్
  పొందుటె లక్ష్యమై చెలగి మూఢులు వేశ్యలు వీధులందునన్
  చిందులు వేయువారలనె శ్రేష్ఠులుగా గెలిపించు కాలమున్
  గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్ .

  రిప్లయితొలగించండి