తే.గీ:అఘము భయమె యనెడు నల వివేకానందు భాషణముల వింటి బాల్య మందు నట్టి గురువు కలుగు నట్టి నా కెట్టుల భయము గూర్చు వాడె పరమగురుడు? (భయమే పాపము అంటారు వివేకానంద స్వామి అనేక మార్లు.అలాంటి గురువు ఉండగా భయం నేర్పే వాడు నాకు గురువు ఎలా అవుతాడు?)
ఉ:స్వయముగ "బ్రహ్మ తా ననెడు" సత్యమెరుంగ దలంచ సాధకుల్ భయమును దీర్చు వాడె గురువర్యుని గా యశమున్ గడించెడిన్ భయబడి లోక బాధలకు వచ్చిన యంతట పాప మందునన్ భయమును బెట్టు వాడె గురువర్యుడు గా యశమున్ గడించెడిన్ (అద్వైతం కావా లనుంకుంటే భయం పోగొట్టే వాడే గొప్ప గురువు.ఏవో లౌకిక బాధలతో వచ్చే వారి విషయం లో కాస్త పాపభీతి కలిగిస్తే చాలు.మంచి గురువే అవుతాడు.)
గతములో గురువన్న భయము భక్తి రెండూ ఉండేవి కదండి. నేటి పరిస్థితి వేరు. మాకాలములోను బయట ఆడుతున్నప్పుడు అరచి ఉపాధ్యాయులు ఇంటికి పంపిన రోజులున్నాయండి. అధ్యాపకులు బెత్తముతో వేసిన దెబ్బలు బాగా గుర్తున్నాయి.
శిక్షణమ్ము కోరు శిష్యుని మన్నించి
రిప్లయితొలగించండివిలువ పెంపు జేయు విద్యనేర్పి
వటువు వెన్నుతట్టి భయముఁ బోగొట్టి య
భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు
నియమము తప్పకుండ నను నిత్యము శిష్యులఁ దీర్చిదిద్దుచున్
తొలగించండిబ్రియమగు శిక్షణమ్మున ప్రవీణతఁ స్థైర్యము వృద్ధి చేయుచున్
నయమున బోధసల్పుచు వినాశక శక్తుల నుక్కడింప ని
ర్భయమును బెట్టువాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండినియమమునెంచెకాలుడును, నేర్పునుఁజూపుచుసృష్టిఁజేసెగా
రిప్లయితొలగించండిరయముననీతిదప్పెనహరాగములొల్కుచుమానవుండు, సం
దియముననావికుండునయిదేహవినాశముగూర్చెదైవమే
భయమునుబెట్టువాడెగురువర్యుడుగాయశమున్గడించెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొరపాటును మీరు ఇంతకు ముందు పెట్టిన పూరణలు తొలగింపబడ్డాయి. మన్నించండి. వీలైతే మళ్ళీ పోస్ట్ చేయండి.
నిన్నటి దివసమున నేర్చిన దానిపై
రిప్లయితొలగించండిప్రశ్నలకు జవాబు పలుక కున్న
తోలు తీసెదనని దురుసుగ చట్టుకు
భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిమోహమొదవ ద్రుంచి ప్రోత్సాహ మొసగుచున్
క్రీడి యుద్ధమందు గెలువఁ జూచె
కృష్ణమూర్తి మెరసి గీతామృతముతో న
భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు
చంపకమాల
దయవిడి ఘాతుకాల్ సలిపి దైన్యము సూపిన ధార్తరాష్ట్రులన్
బ్రియమగు బంధుముఖ్యులుగ వీడఁగ జూడ రణాన క్రీడియే
రయమున గీత బోధనల ప్రాజ్ఞతనింపఁగఁ జేసె శౌరి! ని
ర్భయమును బెట్టువాడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివిద్య నేర్పి మంచి విజ్ఞానమందించు
రిప్లయితొలగించండిసమయ మందు శిష్యు శ్రద్ధ పెంచ
వలసి నట్టి చర్య వైళ మె గైకొని
భయము గూర్చు వాడు పరమ గురుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియుద్ధరంగమందు నున్నగురువులను
రిప్లయితొలగించండిబంధుజనులగాంచి ఫల్గుణుండు
వీడి యస్త్రములను వేదన నొంద న
భయముఁ గూర్చువాఁడెపరమగురుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినియతిగ ఛాత్రుకున్ సతము నేస్తమువోలె సమాదరమ్మునన్
రిప్లయితొలగించండినియమము నిష్ఠలన్ గఱపి నేర్పుచు విద్యలు సత్ప్రవర్తనన్
ప్రియముగ వానికెన్నడును శ్రేయముఁగూర్చుచు కష్టమందు ని
ర్భయమును బెట్టువాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:అఘము భయమె యనెడు నల వివేకానందు
రిప్లయితొలగించండిభాషణముల వింటి బాల్య మందు
నట్టి గురువు కలుగు నట్టి నా కెట్టుల
భయము గూర్చు వాడె పరమగురుడు?
(భయమే పాపము అంటారు వివేకానంద స్వామి అనేక మార్లు.అలాంటి గురువు ఉండగా భయం నేర్పే వాడు నాకు గురువు ఎలా అవుతాడు?)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండి
రిప్లయితొలగించండిబ్రతుకు నీడ్వలేక బాధపడెడువారి
చింత లెన్నియున్న శీఘ్రముగను
చక్క దిద్దెదనని సత్యార్థియయి తాన
భయము గూర్చువాడె పరమ గురుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:స్వయముగ "బ్రహ్మ తా ననెడు" సత్యమెరుంగ దలంచ సాధకుల్
రిప్లయితొలగించండిభయమును దీర్చు వాడె గురువర్యుని గా యశమున్ గడించెడిన్
భయబడి లోక బాధలకు వచ్చిన యంతట పాప మందునన్
భయమును బెట్టు వాడె గురువర్యుడు గా యశమున్ గడించెడిన్
(అద్వైతం కావా లనుంకుంటే భయం పోగొట్టే వాడే గొప్ప గురువు.ఏవో లౌకిక బాధలతో వచ్చే వారి విషయం లో కాస్త పాపభీతి కలిగిస్తే చాలు.మంచి గురువే అవుతాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిఆ॥ భయము లేక భక్తి నియమ నిష్ఠలఁ గనిఁ
రిప్లయితొలగించండిబడయ విద్య సాధ్య పడదటంచు
నాఁడు జనులు భువిని నమ్మిన నానుడి
“భయముఁ గూర్చు వాఁడె పరమగురుఁడు”
చం॥ నయముగ విద్య రాదనుచు నమ్మిరి నాఁడు జనాళి భక్తితో
నియమము నిష్ఠ పొందుటకు నేమముఁ దప్పక నిత్య సాధనన్
నయముగఁ జేయఁ బాఠనులు నానుడి యౌచు ప్రసిద్ధిఁ గాంచెనే
“భయమును బెట్టు వాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్”
పాఠనులు విద్యార్థులు
గతములో గురువన్న భయము భక్తి రెండూ ఉండేవి కదండి. నేటి పరిస్థితి వేరు. మాకాలములోను బయట ఆడుతున్నప్పుడు అరచి ఉపాధ్యాయులు ఇంటికి పంపిన రోజులున్నాయండి. అధ్యాపకులు బెత్తముతో వేసిన దెబ్బలు బాగా గుర్తున్నాయి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి-
రిప్లయితొలగించండివ్యయముల నొనరించి పరిపరి వెదుకుచు
కనుల పడిన వారి కాళ్లకెల్ల
మ్రొక్కుటేల! చిలుకు మోయి మదిని నంద
భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం.
రిప్లయితొలగించండినయమున దల్లిదండ్రులిడు నైత్యిక బోధన బాల్యమందునన్
చయమున మంచి మిత్రుడిడు సాయము విద్యను నాటపాటలన్
రయమున పాఠశాల విధి రాజ్యము గామిడి రచ్చబండలన్
*భయమును బెట్టువాఁడె గురువర్యుడుగా యశముంగడించెడిన్!*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసకల శాస్త్రములను శ్ర్రద్ధగఁజెప్పి య
రిప్లయితొలగించండిభయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు
గురువు బ్రహ్మ చక్రి గురవె శివుఁడుగద
గురువు మించు దైవమిలను లేడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినియమముఁదప్పకుండగను నేర్పియు శాస్త్రపు సారమంత,ని
రిప్లయితొలగించండిర్భయమును బెట్టువాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్
నియతిని శిష్య కోటియును నేర్పున నేర్చుచు నొజ్జ పేరునున్
రయమున నాకసంబునకుఁబ్రాకువిధంబుగ ఁజేయుటొప్పగున్
ఇచ్చ వచ్చి నట్టు లిహ లోక మందు వి
రిప్లయితొలగించండిచ్చలవిడిని జరించి సంతతమ్ము
పాప మాచరింపఁ బరలోకమునఁ గల్గు
భయముఁ గూర్చు వాఁడె పరమ గురుఁడు
నయమును విస్మరించుచు ఘనమ్ముగ స్వీయ కృతక్రయాను వి
క్రయముల నుంచి సంతతము కైతవ మత్యధికమ్ము ధర్మ సం
క్షయ మొనరింప నిక్కముగఁ గాలుని సమ్మెట పోటు లుండు నన్
భయమును బెట్టు వాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
విద్య తోడ బ్రతుకు విలువల నందించి
మార్గ దర్శకునిగ మంచి పంచి
చెడ్డ హితుల వలన చెడుదారి పట్టగ
భయము చెప్పువాడె పరమ గురుడు.