5, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4667

6-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్”
(లేదా...)
“విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో”

20 కామెంట్‌లు:

  1. అశ్వత్థపత్రమెశయ్యగ
    అశ్వారోహుడునటననునానందింపన్
    నశ్వరమైనది సృష్టిని
    విశ్వమ్మునుమ్రింగువానివిశ్రామమెటన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    విశ్వాసమ్మున నెన్నగ
    నైశ్వర్యము పెంచు కొనుటకంకితమగుచున్
    నశ్వరమనుకొనక తనువు
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్?

    శార్దూలవిక్రీడితము
    విశ్వాసమ్ముగ మేలు గూర్తుననుచున్ వెంటాడి యోట్లంది తా
    నైశ్వర్యమ్మును పెంపుఁజేసుకొనె నాహ్లాదించి పీఠాన! న
    ద్యశ్వీనమ్ముగ చావునెంచడన యుక్తాయుక్తముల్ వీడుచున్
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో?

    రిప్లయితొలగించండి
  3. అశ్వత్థంబదివృక్షపత్రముననానందించుబాలాకృతిన్
    విశ్వాకారుడునొంటివాడుగనసంవేద్యుండుశాంతుండునై
    అశ్వారోహుడునాదిపూరుషుడునుయ్యాలన్శుభారంభుడే
    విశ్వంబున్దిగమ్ర్రింగువాడెచటఁదావిశ్రాంతినిన్బొందునో

    రిప్లయితొలగించండి

  4. విశ్వాస ఘాతకా! పరు
    లైశ్వర్యముకై తపనయె యపరాధమదే
    నశ్వరమౌ నీ యునికియె !
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్.?


    విశ్వాసమ్మును చూపువారికడన్ విత్తమ్మునే దోచి నీ
    వైశ్వర్యంబు గడించినన్ జనులు నిన్నల్పుండటంచున్ సదా
    యశ్వంతమ్మును గోరుచుందురిది సత్యంబన్న కాదందువే
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో!

    రిప్లయితొలగించండి
  5. నశ్వరమగు దేహమ్మే
    శాశ్వతమను భావనమున సతతము ధరలో
    నైశ్వర్యార్జనమునకీ
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్

    రిప్లయితొలగించండి
  6. "విశ్వము" నా స్నేహితుని పేరు

    విశ్వాసముంచ జెప్పితి
    విశ్వమ్మును ; మ్రింగువాని విశ్రామ మెటన్
    అశ్వపు గురుతగు మధువును ,
    యశ్వంపు పరుగిడ జేసి యలసట గూర్చెన్

    రిప్లయితొలగించండి
  7. ఈశ్వరుడై మహి తుండై
    శాశ్వతు డై నెగడు వాడు సర్వము దానై
    న శ్వర దే హా త్ము లు గల
    విశ్వమ్మును మ్రింగు వాని విశ్రా మ మెటన్?

    రిప్లయితొలగించండి
  8. విశ్వాసము కలిగించిన
    విశ్వేశ్వరుడైననొసగు ప్రియమగు కోర్కెల్
    ఐశ్వర్యమే సకలమై
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్

    ఐశ్వరమ్ము కదా సదా జగతిలో నానంద సంధానమౌ
    విశ్వాసమ్ము కదా నిధానమగునీ విశ్వాన కౌటిల్యమై
    విశ్వంబంతయు దోచి విత్తమనగా వెఱ్ఱెత్తి వర్తించినన్
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో

    రిప్లయితొలగించండి
  9. ఐశ్వర్యమె శాశ్వతమని
    విశ్వాసము గల్గి విర్రవీగుచు నదటన్
    శాశ్వతుని హృదిని నిలపక
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్

    రిప్లయితొలగించండి
  10. ఐశ్వర్యార్జనమందు రేఁబవలు తానాసక్తినిం జూపుచున్
    విశ్వేశుంబయి నెన్నడేనిమదిలో విశ్వాసమంకించకన్
    నిశ్వాసంబును దీయు సావిఁ గనకన్ నిర్వ్యాజమౌ రీతిగా
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో

    రిప్లయితొలగించండి
  11. -

    శాశ్వతమగు పరమాత్ముడు
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్?
    నశ్వరమైన మన హృదియె!
    విశ్వాసము వలయు నతడె విధి మన కెల్లన్


    రిప్లయితొలగించండి
  12. ప్రశ్నోత్తరి

    కం:విశ్వేశుడు లయకారియె?
    విశ్వమ్మును మ్రింగు వాని విశ్రామ మెటన్?
    విశ్వమె ఈశోద్భవ మా
    విశ్వమె సర్వేశు నందు విశ్రాంతి గొనున్

    రిప్లయితొలగించండి
  13. శా:విశ్వాధిక్యము బొందు రంధి పెరుగన్ వేవేల యణ్వస్త్రముల్
    విశ్వమ్మందున నింపునట్టి నరుడా!విచ్ఛిన్న మై పోగ నీ
    విశ్వ మ్మెవ్వరు మెచ్చ నిన్ మనరు గా! ప్రేమించుమా విశ్వమున్
    విశ్వమ్మున్ దిగమ్రింగు వా డెచట దా విశ్రాంతినిన్ బొందునో!
    (అణ్వస్త్రాలతో విశ్వాన్ని నాశనం చేస్తే నాశనం చేసిన వాడికీ విశ్రాంతి ఉండదు.)

    రిప్లయితొలగించండి
  14. కం॥ ఈశ్వర కృపఁ బడయ నరుఁడు
    నశ్వరమగు జీవితమను నావ దరిఁ గనున్
    విశ్వాసమిహమునఁ గనుచు
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్

    శా॥ ఐశ్వర్యమ్ము పరంబటంచు భువిలో నాద్యంతమున్ సంపదల్
    నిశ్వాసమ్మును గూడ మాని పడయన్ నేమంబులే యెంచకన్
    బశ్వత్పాలుని విస్మరించి చనుచున్ బాపాత్ముఁడై కాంచ నా
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో

    రిప్లయితొలగించండి
  15. అశ్వర మైనది బ్రదుకని
    విశ్వాసముఁగలిగియుండి విరతికి లోనై
    యైశ్వర్యపుదాహముతో
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్

    రిప్లయితొలగించండి
  16. విశ్వంబందలి సర్వ జీవులును వేవేలంగ జీవించుచున్
    విశ్వాసంబును లేమి వైఖరి నెటన్ వెంటాడ రాకుండగా
    విశ్వాసంబున నుండ ,జీవుఁడు భువిన్ వెంపర్లతోనుండగన్
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో?

    రిప్లయితొలగించండి
  17. విశ్వ విదితమ్ము జాంబవ
    తీశ్వరు పుట్టింట నుండు నెలమిన్ ప్రక్షీ
    ణైశ్వర్యుఁడు గాఁగ వెసన్
    విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్


    ఆశ్వాసింతు సదుత్తరం బొసఁగి నీ వందంగ హర్షమ్మునే
    విశ్వేశుండు జగద్వ్రజావనుఁడు నిర్భీతిన్ మహాంభోనిధిన్
    విశ్వాత్ముండు వటచ్ఛదమ్ము పయి సంప్రీతిం బరుండుం గదా
    విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో

    రిప్లయితొలగించండి
  18. విశ్వమె తనలోనుంచిన
    విశ్వాధారుడయినట్టివిశ్వంభరుకున్
    నైశ్వర్యాదులిడుహరికి
    *"విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్”*

    కంది శంకరయ్య వద్ద 2/05/2024 09:00:00 PM

    రిప్లయితొలగించండి
  19. శా.

    విశ్వాసమ్ము దపమ్ముచేత శివుడే వీక్షించి మంత్రంబిడెన్
    విశ్వంబున్ దిలకించె గావ్యుడు వగన్ విశ్వేశ గర్భస్థుడై
    ఆశ్వాస్యమ్మునిడంగ శుక్రుడు చనెన్ హావంబు లింగమ్మునన్
    *విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో!*

    రిప్లయితొలగించండి