10, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4672

11-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్”
(లేదా...)
“వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్”
(కళ్యాణ్ చక్రవర్తి గారు మాకు కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం చేయిస్తూ ఇచ్చిన సమస్య. వారికి ధన్యవాదాలతో...)

29 కామెంట్‌లు:

  1. పంకజవదనముగలిగిన
    శంకరుపత్నినిశుభకరసన్నుతగాత్రిన్
    జంకకగొలువగసుదతులు
    శంకరుడేతెంచెగనగసన్నుతగాత్రిన్

    రిప్లయితొలగించండి
  2. మచ్చన్కంఠమునందునుంచితమితోమౌనంపుదైవంబునై
    మెచ్తన్లోకముశంభుడైతనరెనామీనాక్షిసాయంబుతో
    మచ్చంగంటిలనోములోమెఱయతామాఘమ్ముమాసంబులో
    వచ్చెన్శంకరుఁడంబతోఁగనగ సంపల్లక్ష్మినిన్వేడుకన్

    రిప్లయితొలగించండి
  3. శంక విడుముమ హరికనుజ
    సంకీర్తన చేయు లక్ష్మి శంకరు చెల్లే
    యింకను నచ్చెరువెందుకు
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్

    రిప్లయితొలగించండి

  4. పంకజ నాభుని భృగుఋషి
    యంకమ్మున తన్నె ననుచు నలుగగ నా తా
    టంకిని యోదార్చ దలచి
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్.



    నిచ్చంబా హరిభుక్కు భూషణముగా నీకంఠమున్ దాల్చగా
    బొచ్చెన్ బట్టుకు తిర్గువాడవని యామోదింపలే దమ్మయే
    యిచ్చున్ గోరిన సంపదల్ రమయటంచిల్లాలు పోరాడగా
    వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    అంకితమై గురుఁ గొల్చెడు
    వంకను కళ్యాణచక్రవర్తియె నమరన్
    కింకరునిగ కంది కులపు
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్

    శార్దూలవిక్రీడితము
    శార్దూలవిక్రీడితము
    సచ్ఛీలంబున శిష్యకోటిగురువై సాహిత్య దిగ్దర్శనం
    బచ్చంబీయఁగ, చక్రవర్తియను కొల్హాపూరు శిష్యుండుఁ దా
    స్వచ్ఛంబౌ గురుభక్తి సేవలిడ నిచ్ఛన్, కంది వంశాత్ముఁడై
    వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్


    రిప్లయితొలగించండి
  6. పంకజ లోచన ద న సతి
    శంకను విడనాడి కోరె శంకరు నాపై
    పొంకపు భక్తిగ న య్యె డ
    శంకరు డేతె o చె గనగ సంపల్ల క్ష్మి న్

    రిప్లయితొలగించండి
  7. పంకజ నాభుని భృగువే
    బింకముతోతన్నగ సిరి విష్ణుని వీడెన్
    వేంకటపతి దర్శనమని
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్

    రిప్లయితొలగించండి
  8. పంకజలోచన అవనిజ
    సంకటములు బాపఁ నరితి సందిట జేర్చన్
    లంకారాజ్యాధిప నా
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్

    రిప్లయితొలగించండి
  9. పంకజనాభుని సతియగు
    సంకటహారిణి జలధిజ సవురును విని తా
    గొంకక కొల్హాపూరుకు
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్

    రిప్లయితొలగించండి
  10. మెచ్చన్ సింధుజ వైభవంబు దివిజుల్ మేలంచు కొల్హాపురిన్
    యిచ్చన్ జూడగ నెంచి యీశ్వరునితో నీశాని రారమ్మనెన్
    సొచ్చెంబౌ కుతుకంబు ముప్పిరిగొనన్ జూడంగ కొల్హాపురిన్,
    వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ పొంకముగఁ దీర్థ యాత్రలు
    బింకము తోడ నొనరించ విధిగా భక్తిన్
    సంకట హరణమనిఁ దలచి
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్షిన్

    శా॥ ఇచ్చన్ బూనుచుఁ గంది శంకరుఁడు తానెంచెన్ మనశ్శాంతికై
    వెచ్చమ్మున్ దలదాల్చి చేరి సఖులన్ బ్రేమమ్ముతో నత్తరిన్
    ముచ్చట్లన్ గని తీర్థయాత్రలను సమ్మోహమ్మునే కాంచుచున్
    వచ్చెన్ శంకరుఁడంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్

    రిప్లయితొలగించండి
  12. అంకము నిడ కొల్హాపుర
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ
    సంపల్లక్ష్మిన్
    వంకలుబెట్టక పూజలు
    కుంకుమతోఁజేయరండి గోపికలారా!

    రిప్లయితొలగించండి
  13. ఇచ్చంగొల్వగ నెల్లవేళలనునే యేకాగ్ర చిత్తంబుతో
    వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్
    మెచ్చెన్ డెందము రెండు రెట్లుగ నికన్ మీనాక్షి యున్ రాకతో
    స్వచ్ఛంబౌమది నిల్పిచేయుదునుబూజాకార్యముల్ శ్రద్ధతోన్

    రిప్లయితొలగించండి
  14. పంకజ నయనను లక్ష్మినిఁ
    గొంకక సంపన్ను రాలిఁ గొనినన్ సతిగా
    నంకిలి లేక తన సఖుఁడు
    శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్


    తెచ్చెన్ భాగ్యము విష్ణు శంకరులు సందేహింప కింతైననున్
    విచ్చేయంగను భూతలమ్మునకు సంప్రీతిన్ విశేషంబుగా
    వచ్చెన్ శ్రీసతి వెంట రాగ వడి నా వైకుంఠుఁడే యద్రికిన్
    వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్

    రిప్లయితొలగించండి