25, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4687

26-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”
(లేదా...)
“ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే”

40 కామెంట్‌లు:


  1. “ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”

    కం:
    ధర్మాధర్మ విచక్షణ
    మర్మమెరిగి నడచుకొను కుమరునకు విధిచే
    దుర్మార్గుడె పిత యైనన్
    “ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”

    రిప్లయితొలగించండి
  2. నిర్మలచిత్తుడుగాకను
    ధర్మవిరుద్ధమ్మెయగునుతండ్రికిమ్రొక్కన్
    అర్మిలిజూపుచుమనసున
    కర్మలజేసినఫలితముగానగవచ్చున్

    రిప్లయితొలగించండి
  3. ధర్మము తప్పిన కార్యము
    ధర్మవిరుద్ధమ్మె యగును; తండ్రికి మ్రొక్కన్
    ధర్మము కాదని నుడువగ
    ధర్మవిరుద్ధమ్మె యగును తప్పనిసరిగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
      "నిక్కముగా నిల.." అనండి.

      తొలగించండి
    3. నిర్మలచిత్తమే తెలుపు నిక్కముగా నిల ధర్మసూక్ష్మమున్
      మర్మము సంగ్రహించని సమాజమునందున తాను భాగమై
      కర్మకు తండ్రినే విడుచు కర్కశ మార్గమునెంచుకొన్నచో
      ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే

      తొలగించండి
  4. మర్మముమానసంబునిడిమైకొనిప్రేమనటించువాడునై
    కర్మలభక్తిభావమునుకాంచగలోకమనంతకాముడై
    నిర్మలచిత్తమున్విడిచి నీచపుకార్యముజేయువాడుగా
    ధర్మవిరుద్ధమౌనుగ తండ్రికిసాగిలమ్రొక్కపుత్రుడే

    రిప్లయితొలగించండి
  5. కందం
    కూర్మిని విద్యాబుద్ధులు
    మర్మములెఱిగించి పెంచ మహనీయుండై
    యోర్మివిడి సత్రముననిడి
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్!

    ఉత్పలమాల
    కూర్మిని బాధ్యతల్ నెఱపి గొప్పగ విద్యల నేర్పి పెంచియున్
    మర్మములెన్నొ దెల్పియు సమాజమునందున స్థాయిఁ గూర్చఁగా
    నోర్మిని వీడి యాశ్రమమునొప్పునటంచును నుంచ నిర్దయన్
    ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే!


    రిప్లయితొలగించండి
  6. ధర్మ పథo బును జూపుచు
    నిర్మల హృదయమ్ము తోడ నేర్పుచు విధులన్
    నర్మిలి తో పెంచ నెటు ల
    ధర్మ విరు ద్ధ మ్మె యగును తండ్రికి మ్రొ క్కన్?

    రిప్లయితొలగించండి
  7. మర్మమ్మెరిగిన వారికి
    ఘర్మజలమునోడ్చు తండ్రి ఘనదృశ్యుండే
    ఖర్మయె కలికాలమ్మున
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
  8. నిర్మల మతితో యతియై
    కర్మలనెల్లయునువీడికడునిష్టుండై
    ధర్మపథానచనునరుకు
    *“ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”*




    రిప్లయితొలగించండి
  9. శర్మ వికలాగుడయినను
    బర్మా ధనమతనివద్ద పారిన దనుచున్
    మర్మము మగ వివహ మొనర్చ
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
  10. అర్మిలిఁ బెంచిన తండ్రిని
    వర్మమునీయక ముదిమిని వదిలిన సుతుఁడే
    కర్మఠునిగ నటియించుచు
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
  11. ఘర్మమునోడ్చి రేఁబవలు గాసిలి పెంచిన తల్లిదండ్రులన్
    వర్మమునీక వృద్ధులని వారల జూడక నాశ్రయమ్ములన్
    కర్మకు వీడి నిర్దయగ కర్మఠునట్లుగ లోకభీతితో
    ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే

    రిప్లయితొలగించండి
  12. పేర్మిని బెంచియు సక్కగ
    కర్మను నేర్పించి బ్రతుకు గమ్యము జూపా
    నిర్మలుని కన్నమిడకను
    ధర్మ విరుద్ధంబెయగును దండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బెంచుచు జక్కగ... గమ్యము జూపెన్.. మిడకయె" అనండి.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. కం॥ నిర్మల మమకారముఁ గని
      ధర్మ పథము వీడకఁ జని తండ్రి పెనుచఁగన్
      గర్మము నెంచని తనయుఁడు
      ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

      ఉ॥ నిర్మల నిష్టతో సుతుని నిత్యము ప్రేమను బంచి యిచ్చుచున్
      ధర్మ పథంబు వీడకను ధాత్రినిఁ బెంచఁగఁ దల్లిదండ్రులున్
      గర్మము వీడి వర్తిలుచుఁ గాంచక వృద్ధులఁ దల్లిదండ్రులన్
      ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే

      తొలగించండి
  14. పేర్మిని పెంచి పెద్దగ వివేకుని
    చేసియు బ్రత్కుదోవకై
    కర్మను జూపి మెచ్చిన సుకన్యతొ
    పెండిలి చేయ ధూర్తుడై
    దుర్మతి బుక్కెడన్నమును తిట్టుచు
    నిత్యము బెట్టువానికిన్
    ధర్మవిరుద్ధమౌను గద దండ్రికి
    సాగిలి మ్రొక్క బుత్రుడే

    రిప్లయితొలగించండి
  15. కం:ధర్మాత్ముని రామన్న న
    ధర్మమ్ముగ నడవి కంపు దానవు, మ్రొక్కన్
    ధర్మమె నీకును? మిక్కిలి
    ధర్మ విరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్
    (అని భరతుడు కైక తో అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  16. ఉ:కర్మఫల మ్మటంచు తన కాంతుని దౌష్ట్యమ్ములన్ భరించుచున్
    ధర్మ మటంచు బుత్రుడును దండ్రిని మార్చక యుంట జూచుచున్
    మర్మము నిట్లు జెప్పె నొక మాత "యధర్మము జేయ దండ్రి యే
    ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్క బుత్రుడే"

    రిప్లయితొలగించండి
  17. మర్మమె నేటి చదువులన
    ఘర్మముఁ జిందించి విద్యఁ గఱపు జనకుడున్
    కర్ముడనెడి చదువరులకు
    ధర్మ విరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
  18. ధర్మపు సత్కార్యములను
    నిర్మలమౌబుద్ధితోడ నెరవేర్పక నౌ
    నర్మములాడుచు మసలిన
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్

    రిప్లయితొలగించండి
  19. ఘర్మమునోడ్చి యంత్రముల కైవడి యార్జనఁజేయు తండ్రి యే
    మర్మము లేక సంతునకు మైమఱువై కఱపించు విద్యలన్
    మర్మము నేర్పునాధునికమౌ చదువుల్వినయంబునొప్పకే
    ధర్మవిరుద్ధమౌనుగద తండ్రికి సాగిలి మ్రొక్క బుత్రుడే

    రిప్లయితొలగించండి






  20. ధర్మవి రుద్ధమౌ పనులు దండిగఁజేయుచు నెల్లవేళలన్
    నర్మపు భాషణంబులను నమ్మికఁజేయుచు మోసగించుచున్
    గర్మల జోలికింజనక గామము తోడను సంచరించుటన్
    ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే

    రిప్లయితొలగించండి
  21. దుర్మతి కంసుఁ డొకింతయుఁ
    గూర్మి వహింపక నిజ జనకు నునిచెఁ జెఱలో
    ధర్మ విదూరు మతమ్మున
    ధర్మ విరుద్ధమ్మె యగును దండ్రికి మ్రొక్కన్


    నర్మము లేల పల్కఁగను న్యాయ మొకింత గణింప కక్కటా
    మర్మము విప్పి చెప్ప వలె మానుగ నన్య మొకింత యున్నచో
    ధర్మము సూపుచుం దగు విధంపుఁ బ్రమాణము వల్క నిట్టులన్
    ధర్మ విరుద్ధ మౌను గద తండ్రికి సాఁగిలి మ్రొక్కఁ బుత్రుఁడే

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కర్మాచరణము వీడుట
    ధర్మ విరుద్ధమ్మె యగును; దండ్రికి మ్రొక్కన్
    నిర్మలమగు మది తోడను
    మర్మము లేకుండ మసల మహిమాన్వితమౌ.

    రిప్లయితొలగించండి
  23. నిర్మల మనమున సతతము
    ధర్మిని పుత్రుండు కొలువ దయమానుచు తా
    నిర్మూలింపగ నెంచిన
    ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్.


    ఓర్మిని యాలకింపుమని యొజ్జలకున్ వచియించు చుంటినే
    నిర్మల చిత్తమందు ధరణీభృతు నామజపమ్ము జేసినన్
    పేర్మిని వీడి పుత్రుని మపెట్టుమడించగ నెంచు హిండుడా
    ధర్మిని తూలనాడెడి యధర్మ పరుండతగాడు, వింటిరా
    ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే.

    రిప్లయితొలగించండి