28, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4690

29-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్”
(లేదా...)
“మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

54 కామెంట్‌లు:

  1. కం:
    వానగురిసి జేరె బురద
    మీనపు గర్భమునఁ, బెక్కు మేకలు పుట్టెన్-
    తానీనగ మేక యొకటి!
    కూనల గొని మేక తాను కోనను జేరెన్.

    రిప్లయితొలగించండి
  2. మేను గగుర్పొడవ జరుగు
    నా నవ కనుకట్టు విద్యనచ్చెరువొందన్
    కానగ వింతల నడుమన
    మీనపు గర్భమున బెక్కు మేకలు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    మీనమదె జన్మరాశిగ
    మౌనిక వర్ధిల్ల మగని మమతన్, గనఁ జి
    త్రాననె మేషమున సుతల
    "మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్"

    ఉత్పలమాల
    మేనక జన్మరాశియన మీనము భర్తయె తిర్మలన్ మనన్
    దానొక విప్రుడై వెఱచి దాట కుటుంబ నియంత్రణమ్ము చి
    త్రాననె మేషరాశినిని తట్టెడు బిడ్డలు పుట్టనందురే
    "మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్"

    రిప్లయితొలగించండి
  4. మానుగసృష్ట్యాదినియట
    మీనాకారుడుహరియును మెప్పుగపుట్టెన్
    తానదిబ్రహ్మాండంబుగ
    మీనపుగర్భమునపెక్కుమేకలుబుట్టెన్

    రిప్లయితొలగించండి
  5. పూనికతోడను గొల్లలు
    వానా కాలంబునందు పదుగురువకటై
    మానవ! శ్రమపడగా గ్రా
    మీనపు గర్భమున బెక్కు మేకలుపుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పదుగురు నొకటై" అనండి. 'గ్రామీణపు' అనడం సాధువు కదా?

      తొలగించండి
  6. మానుగవిష్ణుడంతటను మీనపుటాకృతియందమొప్పగా
    ఆనకజీవరాశులను నాదరమొప్పగ నావికుండునై

    తానుగరక్షజేసెనటధర్మమువేదమునిల్ప బ్రహ్మయై

    మీనపుగర్భమందుపలుమేకలుబుట్టెనుకొండకోనలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'మీనపు టాకృతి నందమొప్పగా' అని కదా ఉండాలి?

      తొలగించండి
  7. కానరె నామహిమ యనుచు
    మానుగ మాంత్రికుడొకండు మహిమను జూపన్
    మేనులు గగు ర్పొ డంగా
    మీనపు గర్భమున బెక్కు మేకలు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  8. మానసమలసి నిదురగొన
    నానాడు కలగొ నువేళ నరుదగు వింతన్
    నేనవలోకించితి నొక
    మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  9. ఉ.

    చేనుని కంచె మేయుటను చిత్రపు నానుడి చద్దిమూటగన్
    వీనుల విందు బాసలను వింతగ నేతలు రాజకీయమున్
    *మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్*
    నేను వినంగ లేను గద నిత్యమసంగతమైన మాటలన్.

    రిప్లయితొలగించండి
  10. డా బల్లూరి ఉమాదేవి


    మీనములె పుట్టునెప్పుడు
    *“మీనపు గర్భమునఁ, బెక్కు మేకలు పుట్టెన్”*
    చేనున కట్టిన మేకకు
    చానలు తిలకించుచుండజవముగనచ్చో


    .

    రిప్లయితొలగించండి
  11. మీనము మేషము మింటను
    కానంబడుచుండు గాదె కన్నుల యెదుటన్
    మీనముఁ మేషము కవయగ
    మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్

    మీనము మేషమున్ గనగ మేలగు రాశులు రాశిచక్రమున్
    మీనము మెచ్చెమేషమును మిన్నక యుండిన మేకవైఖరిన్
    మీనపు రాశి భామినికి మేషము తోడుతఁ బెండ్లిచేయగా
    మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్

    రిప్లయితొలగించండి

  12. సూనులది మేషమనుచు వ
    రాననదియె మీనరాశి ప్రశ్రయ మందున్
    చాననెగతాళి జేసిరి
    మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్



    చేనుకు సారమిచ్చునని సేద్యము లాభకర మ్మటంచు నా
    కోనల మాటునున్న నొక కొండ్రను మేకల మందనిల్ప నా
    స్థానము నందు చూలుగల ఛాగులు పిల్లల నీనె నంత యౌ
    మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్.

    (ఔమీనము...అగిసెలు పండుపొలము)

    రిప్లయితొలగించండి
  13. జాణతనంబుగ నొక్కడు
    మీనపు చిత్తరువుగీసి మేకల మందన్
    దానియుదరమున గూర్చఁగ
    మీనపు గర్భమునఁ బెక్కుమేకలుపుట్టెన్

    రిప్లయితొలగించండి
  14. కానగనింద్ర జాలమున కన్పడు వన్నియు వింతలే మరో
    మానవ సృష్టి యౌచునసమాన విధంబున జేయు కొండలూ
    కోనలు వేదికందు సమకూరు ధనంబులు నిట్టి రీతినే
    మీనపు గర్భమందు పలు మేకలు పుట్టెను కొండకోనలన్

    రిప్లయితొలగించండి
  15. తానొక చిత్రకారుడు సతంబు వినూత్న విచారణమ్ముతో
    జాణతనమ్ముజూపి కడు చక్కని చిత్తరువుల్ సృజించు నా
    మానసమందు నెక్కొనిన మానితమైన తలంపు చిత్రమై
    మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్

    రిప్లయితొలగించండి
  16. మానినులు భరణి అశ్విని
    కానుకగా కృత్తిక కలుగగ రేవతికిన్
    ఆ నక్షత్రములనరయ
    మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్

    అశ్వని , భరణి, కృత్తిక నక్షత్రములు - మేష రాశి
    రేవతి నక్షత్రము - మీన రాశి

    రిప్లయితొలగించండి
  17. కం॥ తానొక చిత్రము గీయగ
    కానఁగ నధునాతనమగు కళ యనిఁ దెలిపిన్
    గనఁబడె చిత్రముగ నిటుల
    మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్

    ఉ॥ తానొక చిత్రమున్ మిగుల తాల్మిని గీయగ నవ్య రీతిగన్
    మానక శ్రద్ధనుంచుచును మారఁగ నట్టుల రూపురేఖలున్
    కానక నేదియెద్ది యని గాంచిన తోడను దోఁచె నిట్టులన్
    మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్

    Modern Art అండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కందంలో "దెలిపెన్/దెలుపన్" అనండి.

      తొలగించండి
    2. అలాగేనండి. ధన్యవాదములు. ఆస్పత్రిలో ఒక క్రమాలంకారము తట్టిందండి. చూసి తప్పొప్పులు తెలిపితే కృతజ్ఞుడనండి

      క్రమాలంకారము
      ఉ॥ కానఁగఁ బూర్వభారతము గమ్మని విందను రూపుదిద్దదా
      మానవ జన్మమిచ్చటను మాదిరి పెక్కుకు మేయటంచిలన్
      గూనలు పుట్టునెవ్వి కనఁ క్రూర మృగమ్ములు నండునెచ్చటన్
      మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్

      తూర్పు భారతపు విందు మీనపు విందు
      మనిషి జన్మ సంతరించుకొనేది గర్భమందు
      పెక్కుకు మాదిరి (సామ్యము) పలు
      మేయని బుట్టెను కూనలేవి మేకలు పుట్టెను
      క్రూరమృగములుండే చోటు కొండకోనలు.

      (ఆరోగ్యము బాగోలేక ఫోర్టీస్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తట్టినదండి)

      తొలగించండి
  18. కం:వాన పెరిగె గుడ్లు కలిగె
    మీనపు గర్భమున,పెక్కు మేకలు పుట్టెన్
    మానకు చేపల బెంచుట
    మానకు జీవముల పెంపు మామా యికపై
    (మేకలని జీవాలు అంటారు.ఈ రెండు పనులు మానకు మామా!అని భార్య భర్త తో అన్నట్టు. )

    రిప్లయితొలగించండి
  19. 2)ఉ:వానలు బాగుగా గురిసె,బల్ శ్రమ లొందుచు బెంచుకొంటి మీ
    మీనములన్ ,శ్రమల్ బడుచు మేకల గాయగ,సంతు గల్గె గా
    మీనపు గర్భ మందు ,బలు మేకలు పుట్టెను కొండకోనలన్
    నేనును నీవు కష్టపడి నీతిగ నున్న ఫలమ్ము దక్కెగా!

    రిప్లయితొలగించండి
  20. మానవ సంక్షయ మిత్తఱి
    నే నే మని చెప్ప నేర్తు నిశ్చయ మయ్యెం
    గానఁగ దుశ్శకునమ్ములు
    మీనపు గర్భమునఁ బెక్కు మేఁకలు పుట్టెన్


    మానవ కోటి కీయఁగ నమంద ముదమ్ము నమేయ మేష సం
    తానము వృద్ధి సెందగను ధారుణి లోనఁ గడింది సంత తా
    నూనముగా నరణ్యముల నుచ్ఛమునన్ గురు శుక్రు లుండఁగా
    మీనపు గర్భమందుఁ బలు మేఁకలు వుట్టెను గొండ కోనలన్

    [మీనపు గర్భము = మీన రాశి యంతరము]

    రిప్లయితొలగించండి
  21. కానగ నయ్యెను గలలో
    మీనపు గర్భమునఁబెక్కు మేకలు పుట్టెన్
    జానెడు జానెడుగ మిగుల
    యానందంబొందె మనసు నయ్యది చూడన్

    రిప్లయితొలగించండి
  22. మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్
    ఔనా! మేకలన్ గనెన? యూదర మాటలు బల్కు టేలనో
    గానగ రాని వింతలను గానఁగఁజేయుచు నుంటిరే కదా
    మీనము గర్భమందలరు మీనపు గ్రుడ్లులె ,కాదు మేకలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం, యతిదోషం. సవరించండి.

      తొలగించండి