13, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4675

14-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్”
(లేదా...)
“ప్రేమికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్”

38 కామెంట్‌లు:

  1. కందం
    భామినికిన్ మనసిచ్చియు
    నామెయ నా భార్యయనుచు ననుకొన వరుడున్
    లేమ మరొకరిన్ బొందఁగఁ
    బ్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్!


    చంపకమాల
    సకలము తానెగా మదియె సద్గుణరాశిగ నొప్పి ప్రేమతో
    వికసితమౌచు రేపగలు వేడ్కగ సాగెడు జీవితాన, వే
    రొకతెను దెచ్చియున్ వరుని నొప్పుమటంచును పెద్ధ లెంచ ప్రే
    మికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  2. ఏమండీయని శ్రీమతి
    గోముగ నన్నడిగె వజ్ర కుండలముల నే
    నేమని దెల్పుదు వ్యధలను
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  3. ప్రేమయు విఫలంబై నన్
    పామరు కరణి ని నొకరుడు పనవుచు మదిలో
    తామసు డై తల పో సెను
    ప్రేమికుల దినోత్సవ మని విల పింప దగున్

    రిప్లయితొలగించండి
  4. ఏమాత్రమొప్ప లేదని
    బామమునొంది యిరువురును , బంధుగ ణమునున్
    ధామమును విడిచిపెట్టెడి
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్

    రిప్లయితొలగించండి

  5. నేమము వీడుచు యువతయె
    కామోద్రేకమ్మె ప్రేమగ దలంచుచు వా
    రా మాయన బడెదరనుచు
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్.


    ముకుళిత మానసమ్ము గల మూర్ఖపు చింతన జేయు ప్రాయమం
    దు కొమరు గాంచినంత పరితోషము నందుచు పొందు కోర్కెయే
    ప్రకటిత మైన కామమది ప్రశ్రయ మంచను వారి రీతి ప్రే
    మికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  6. ప్రేమోన్మాదులు వీధులఁ
    నీమములను విడచి తిరుగఁ నిస్సిగ్గుగనా
    ప్రేమికుల తల్లిదండ్రులు
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  7. ప్రేమించని యువకునితో
    భామకు జరిపించె పెండ్లి భజరంగ్దళమే
    రామా! విపరీతముగని
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్

    తికమకనొంది జంటలను తిప్పలుపెట్టు మనోగతంబుతో
    లకుటము చేతబట్టి భజరంగ దళమ్మున కార్యకర్తలే
    ప్రకటితమైనరీతి బలవంతపు పెండ్లిని చేసినారు ప్రే
    మికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  8. ఓ బ్యాచిలరు వ్యధ :)

    ఏమని చెప్పుదు బాధను!
    భామినులెవరు దరిరారె! వయసుడిగెను నా
    కామితఫలమ్ము దొరకదె!
    ప్రేమికుల దినోత్సవమని విలపింపదగున్.

    రిప్లయితొలగించండి
  9. అకటకటా విచిత్ర మగు నాచరణమ్మిది స్వచ్ఛమైన ప్రే
    మికులెవరైన హద్దులను మీరి చరింతురె పార్కులందునన్?
    వికలమనస్కులైన తమ పెద్దలు బిడ్డల తీరుఁ జూచి ప్రే
    మికుల దినోత్సవంబని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  10. "ప్రేమికులదినోత్సవం" అనటం సరైనదేనా? అని సందేహం.
    "ప్రేమికులదినమ్మటంచు" అంటే బాగుండే దేమో!

    రిప్లయితొలగించండి
  11. కం:ప్రేమన్ నెగ్గిన వారికి
    ప్రేమిక దినమంచు జరుప వేడుక చెల్లున్
    ప్రేమించిన విఫలులకున్
    ప్రేమికుల దినోత్సవ మని విలపింప దగున్

    రిప్లయితొలగించండి
  12. చం:స్వకుల వివాహమేల?మన సంస్కృతి యేల యటంచు దల్చ బ్రే
    మికుల దినోత్సవమ్మనుచు మిక్కిలి వేడుక జేయగా దగున్
    సకలము భ్రష్ట మయ్యెనని సంస్కృతి దల్చెడు వారి కెల్ల బ్రే
    మికుల దినోత్సవమ్మని యమేయము గా విలపింపగా దగున్

    రిప్లయితొలగించండి
  13. కం॥ ప్రేమము సహజము నిత్యము
    ప్రేమికులకొక దినమనుచు వేషము వేయన్
    గామము బహిరంగ పరచి
    ప్రేమికుల దినోత్సవమని విలపింపఁగాఁ దగున్

    చం॥ ప్రకటనమేలఁ బ్రీతికిని ప్రాణుల కయ్యది నిత్యముండునే
    నకలును జేసి పశ్చిమపు నాణ్యత లేని విచిత్ర రీతులన్
    వికలముఁ జేయ సంస్కృతినిఁ బ్రేమ యటంచును బాడిగాదు ప్రే
    మికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    నిజానికి ఈమధ్య ప్రాచుర్యములోకి వచ్చిన అక్షయ తృతియ ధన త్రయోదశి లాగా పాశ్చాత్యులు వ్యాపార వృద్ధి కొరకు Valentines day, Mother’s Day Father’s Day ఇలా పెట్టుకున్నారండి. వెఱ్ఱి తలలు ఇక్కడే! అక్కడ బహుమతులివ్వడం ఆనవాయితి.

    రిప్లయితొలగించండి
  14. నీమములేకనుదిరుగుచు
    కామముకండ్లకుముసరగ కాంక్షలురేగన్
    వామాక్షులుతాముండగ
    ప్రేమికులదినోత్సవమనివిలపింపదగున్

    రిప్లయితొలగించండి
  15. సకలము శోభచూడగను శంకరుముంగిట మోకరిల్లినన్
    తికమకయేలమానవుడ, తీయనిప్రేమదిపాదమంటుడీ
    వికలమునయ్యెభావమదివిందుయొనర్చగయొక్కరోజు, ప్రే
    మిగుల దినోత్సవం బని యమేయముగా విలపింపగాఁదగున్

    రిప్లయితొలగించండి
  16. ప్రేమికులు బరితెగించుచు
    ప్రేమను వడబోయుచుండ వీధుల నడుమన్
    బామరు లన్దలపించగఁ
    బ్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  17. వికటపు చేష్టలన్దలరి వీక్షణమాత్రన యేవగింపుగా
    నొకరికి యొక్కరున్ వలువనూడగఁజేయుచుఁగామ వాంఛతో
    ముకుళితమోములైమిగులమోదమునొందుచు సంచరించు బ్రే
    మికుల దినోత్సవంబని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *మాత్రన నేవగింపుగా నొకరికి నొక్కరున్...* అనండి.

      తొలగించండి
  18. ప్రేమికుఁడు గ్రామ్యము. ప్రేమి సాధువు.
    ప్రేమి కుల దినోత్సవము సాధు వే యయిన దిట్లు విఱిచిన.


    భూమి జనులకుఁ జెలంగె న
    హో మోహ మెదలఁ గడింది యున్మత్తులు కాఁ
    బ్రేమాంధత్వమునఁ జలుపఁ
    బ్రేమి కుల దినోత్సవ మని విలపింపఁ దగున్


    వికలము లైన డెందముల వెఱ్ఱితనమ్మున మర్త్యు లక్కటా
    నికరము నీతు లాఱఁగ గణింపరు ధర్మము యౌవనస్ఫుర
    త్సకల విరుద్ధ నాగరికతా మహి మోత్థిత నిందితమ్ము ప్రే
    మి కుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
      'ప్రేమికులు' అన్న పదం సాధువు కాదని మీవల్ల తెలిసింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  19. ప్రేమకు నొకదినమేనా
    నేమిదిచిత్రముకనివినియెరుగనిరీతిన్
    ధీమాతోతిరిగితుదకు
    *“ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్”*

    రిప్లయితొలగించండి