23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4685

24-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్”
(లేదా...)
“పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

 1. పలు శాస్త్రం బుల పరిణితి
  కలిగినవారై వరమున కైతలుఁజెప్పన్
  పులకలురేగగ జనులకు
  పులులు కరులు భూర్జపత్రములపై నిలచెన్

  రిప్లయితొలగించండి
 2. పలువర్ణములలవోకగ
  కలుపుచుబడిలోనబాలికలుచేరియటన్
  కలములతోచిత్రించిన
  *"పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్”*

  రిప్లయితొలగించండి
 3. కలతల్రేగినపండితోత్తములు తాగ్రంథంబులన్జూడగా
  పలుశాస్త్రంబుల పారమంటిరటధీమంతుల్పరాన్వేషులై
  బలుపున్జూపిరి కావ్యరాజముల తాభావంబుగర్జింపగా
  పులులేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందగానిల్చెనే

  రిప్లయితొలగించండి

 4. కులుకుల కురిపించెడి భా
  మల చిత్రమ్ములనె కాదు మదిదోచెడి ప్రా
  ణుల బొమ్మలు వేయగ నవి
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్.


  శిలలన్ జెక్కుచు నందమైన ప్రతిమల్ శిల్పుండ్రు సృష్టించిన
  ట్లిల వర్ణాటుడు జంతుజాలముల యాలేఖ్యమ్ము లన్ గీయగా
  చెలికాండ్రెల్ల నుతించి పల్కిరిటులన్ చిత్రాలనే గాంచినన్
  పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే.

  రిప్లయితొలగించండి
 5. తలచన్చాలునుగుండెఝల్లనును ప్రేతంబట్లువెంటాడగా
  జలమున్ రాలునుకన్నులందువడినాసంద్రమ్మువోలెన్గదా
  కలలోనైనను గాంచినం త భయమున్ కల్గించురీతిన్నటన్
  పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే”*

  రిప్లయితొలగించండి
 6. అలనాడు కాగితమనగ
  తెలియనపుడు చిత్తరువుల దీటుగ గీయన్
  వలనుగ లిఖించు చుండగ
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్

  రిప్లయితొలగించండి
 7. పలుపద్యములను సుకవులు
  పలువిధ వృత్తములయందు వ్రాయగ సరవిన్
  మలయజములు చంపకములు
  పులులు కరులు భూర్జపత్రములపైనిలిచెన్

  (పులులు కరులు - శార్దూలములు, మత్తేభములు)

  రిప్లయితొలగించండి
 8. మ.

  తెలుపౌ బియ్యముపైన చెక్కిరి కదా తీరైన శిల్పాలుగా
  సులువౌ రీతిని జంతువుల్ కణికపై సొక్కంగ బింబమ్మునన్
  కలతల్ క్లేశములేల పత్రమున నాకాంక్షించు దార్ఢ్యమ్ముతో
  *పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే!*

  రిప్లయితొలగించండి
 9. అలనాడే రచియించిరి
  మలికితమేలేని విధిని మత్తేభములన్
  విలసిత శార్దూలములన్
  బులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్

  అలనాడే కవులే రచించిరిగదా యత్యంత ధీశక్తితో
  కలమూ కాగితమున్ గనుంగొనని యాకాలంబులో హాయిగా
  చలితంబౌ బహు పద్యముల్ విరివిగా శార్దూల మత్తేభముల్
  పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే

  రిప్లయితొలగించండి
 10. విలసిత రమ్యపు భావపు
  పొ లుపగు పద్యముల నల్లి పొందు పరచగా
  చెలువపు రీతిగ నయ్యవి
  పులులు కరులు భూర్జు పత్రముల పై నిలిచె న్

  రిప్లయితొలగించండి
 11. కందం
  తలపుల స్వార్థమెగయ కొం
  డలు, గుట్టలు పిండిఁ జేసి నాశమునెంచన్
  నెలవులు లేక నశించుచు
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్!

  మత్తేభవిక్రీడితము
  ఇలకీ దారుణ దుస్థితుల్ మునులు దామీక్షించి యందించిరో!
  తిలకింపన్ గనరాక వన్యమృగముల్ ద్రెంచంగ కాంతారముల్
  వెలయింపన్ కవిశేఖరుల్ నడకలన్! విన్యాస మాత్రంబుగన్
  పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే!!

  రిప్లయితొలగించండి
 12. అలఘుండాతడనేక కావ్యములలో నత్యంత హృద్యంబుగా
  పలువృత్తంబులయందు పద్యముల నిర్వక్రంబుగా వ్రాయ ను
  త్పలముల్ చంపకముల్ మనోజ్ఞమగు మందాక్రాంతముల్ స్రగ్ధరల్
  పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే

  రిప్లయితొలగించండి
 13. కం:పలు జంతువుల నుడులతో
  విలసిల్లెడు పంచతంత్ర విలసత్ కథలే
  నిలచెను తాళ ప్రతులుగ
  పులులు కరులు భూర్జపత్రముల పై నిలచెన్
  (కాగితాలు లేని కాలం లో అవి తాళపత్రాల పైనే ఉన్నాయి కదా!)

  రిప్లయితొలగించండి
 14. Rectified poem
  (2)మ:కలువల్ ,చంపక మాలలున్ ,వెలదులున్ ,కమ్రమ్ముగా కైతలన్
  విలసిల్లంగ గభీరమౌ నడకలన్ వేంచేసి దర్పమ్ముతో
  పులు లేనుంగులు భూర్జపత్రముల పై పొల్పొందగా నిల్చె నే
  పలు వైవిధ్యము లున్న నాటి కవితల్ భాగ్యమ్ములే నేటికిన్.
  (ఉత్పలమాల చంపకమాలలు,ఆటవెలదుల సౌందర్యము ఉండగా,మత్తేభశార్దూలాల దర్పం కూడా ఉన్నది.)

  రిప్లయితొలగించండి
 15. అలవోకముగను రచనను
  లలితపు పదగుంభనముగ లహరిని వోలెన్
  బలుకఁగ మదికిని సొగసై
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్

  రిప్లయితొలగించండి
 16. అలవోకగ నత్తఱి వా
  కిలి రోగ నిదానములు నికృష్టమ్ములు దో
  మలు నీగలుఁ బోల్పఁగ నయి
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్


  చెలరేఁగంగ భయంకరమ్ము లయి యక్షీణంబ గాండ్రింపులుం
  విలయాభీల సుఘోర ఘీంకృతు లెదల్ భేదిల్ల వేర్వేఱ నా
  వల నిం కీవల వింత భూతలమునన్ వాతోద్ధతిన్ రాలఁగాఁ
  బులు లేనుంగులు భూర్జ పత్రములపైఁ బొల్పొందఁగా నిల్చెనే

  రిప్లయితొలగించండి
 17. లలితంబొప్పగఁ బ్రాణి కోటినటయాహ్లాదంబొప్పగాశిల్పి దా
  శిలలన్ గన్గొని జక్కనౌ విధము వేచెక్కన్ గన్విందు జేయంగనౌ
  బులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే
  దలపన్ జీవము గల్గెనే యనిరి మాతాతల్ సూచి యాచిత్రముల్

  రిప్లయితొలగించండి
 18. పలు కావ్యంబులు సక్కని
  విలసిత చిత్రములు పెక్కు విజ్ఞులవలనన్
  పలువిధ పక్షులు చెట్టులు
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్

  రిప్లయితొలగించండి
 19. కలిమియె బలమ్మనెడు వా
  రలు మందిని కోలువడి కళవళ పడుచు డ
  స్సులు మానిన జనులిట్లనుఁ
  బులులు కరులు భూర్జ పత్రములపై నిలిచెన్

  రిప్లయితొలగించండి
 20. కం॥ కలల కెల్లలఁ గనమే!
  కలతఁ బడ చిత్రమైన కలలను గనమా!
  యలసి పరుండఁగఁ గలలో
  పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్

  మ॥ ఇలలోఁ గాంచని వెన్నియో కలలలో నేర్పడ్డ మోదంబగున్!
  గలలే పెన్నిధి యంచుఁ దెల్పెను గదా కైతన్ గవిశ్శ్రేష్ఠుఁడే
  కలలన్ గాంచము హద్దులేవియును సాక్షాత్కారమౌచున్ గలన్
  బులులేనుంగులు భూర్జ పత్రములపై పెల్పొందఁ గా నిల్చెనే

  రిప్లయితొలగించండి