15, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4677

16-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ”
(లేదా...)
“సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే”
(ఊర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

38 కామెంట్‌లు:

  1. అంగడియందున భోగము
    అంగనతోడుగసరసము నాడకతొలగన్
    చెంగటధర్మమునిలువగ
    సంగరముననోడువాడెశౌర్యధనుండౌ

    రిప్లయితొలగించండి
  2. పొంగు పరాక్రవంతునని భూ వరు

    లెల్లను నిందసేయరే

    సంగరమందు నోడినను, శౌర్య

    ధనుండని మెచ్చుకొందురే

    సింగమువోలె శత్రులను జిందర

    వందర జేసి ధీరతన్

    భంగము పాలొనర్చికడు బాధల

    పాలొనరించు యోధునిన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కురుక్షేత్ర సంగ్రామమున శ్రీకృష్ణపరమాత్మ:

      కందం
      సింగము వలె పోరాడక
      వెంగలివలె వెన్నుఁ జూప విజయా! తగునా?
      పొంగుచు గెలిచెడు ధీరుఁడె,
      సంగరమున నోడువాఁడె శౌర్యధనుండా!

      ఉత్పలమాల
      సింగమనంగఁ బోరవలె జిద్దునఁ గెల్వగ రాజ్యమందఁగన్
      వెంగలి పోలికన్ విజయ! వెన్నిడి పాఱుదె? భీరువంచనన్
      రంగమునన్ జయాపజయ రావములుండవె? పోరి ధీరతన్
      సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 తమరి సూచనల మేరకు సవరించిన వృత్తము:

      ఉత్పలమాల
      సింగమనంగ పోరి యరి సేనల గెల్చియు రాజ్యమందకే
      వెంగలి పోలికన్ విజయ! వెన్నిడి పాఱుదె? భీరువంచనన్
      రంగమునన్ జయాపజయ రావములుండవె? పోరి ధీరతన్
      సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే!

      తొలగించండి
  4. పంగునునౌనుగాదెగనపాఱడు భోగమువెంటనెప్పుడున్
    క్రుంగునుతానుగానెపుడు కోరుచుమోక్షమునెల్లవేళలన్
    జంగముదేవరన్బలెను జానెడుపొట్టకు భిక్షమెత్తునే
    సంగరమందునోడినను శౌర్యధనుండనిమెచ్చికొందురే

    రిప్లయితొలగించండి
  5. జంగములందరు దొరకొని
    బంగరు జీవితమునెల్ల వదలు కొనమనన్
    భంగపడకుండి తానా
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ

    సంగరము = ప్రతిజ్ఞ
    ఓడు = సంకోచించు

    రిప్లయితొలగించండి

  6. గొంగ బలమెఱగి ధర్మము
    భంగమ్మొనరింప దాని పరిరక్షణకై
    క్రుంగక సాగించెడి యా
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ.


    నింగిని నిప్పులన్ చెఱగు నీరజ బంధువు వోలె తాను సా
    రంగము నందు ధర్మమును రక్షణ జేయగ నెంచి దానినిన్
    భంగమొనర్చు దుండగుల ధ్వంసము జేయగ పోరు సల్పి యా
    సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే.

    రిప్లయితొలగించండి
  7. పొంగిన నుత్సా హంబున
    రంగములో దూకి వైరి రౌద్రము గని యున్
    లొంగక ధీరత తలపడి
    సంగరమున నోడు వాడె శౌర్య ధనుండౌ!

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    రంగులు హీనమయ్యె రణ రంగమునందు సుయోధనుండటన్
    చెంగున మడ్గునందు జని జీవనమున్ గడుపంగ బాండవుల్
    భంగము జేయ, భీమ గద, బాదగ నూరువులన్ నిపాతమై
    *సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే!*

    రిప్లయితొలగించండి
  9. చెంగున సంగ్రామంబున
    పొంగులు వారఁ జెలరేగి పోరిన యెడలన్
    సింగంబని మెచ్చుకొనగ
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ

    రంగము నందు దూకి తనరారిన యోధులు వీరులేకదా
    పొంగెను దోహలమ్మనగ పోరును సల్పుట మిన్న యందురే
    చెంగున యుద్ధ రంగమున చేవను చూపిన పార్థపుత్రునిన్
    సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే

    రిప్లయితొలగించండి
  10. సంగరసీమరా జగము సంగములన్ విడనాడి జోదువై
    లొంగకు మాటుపోటులకు రోయకు కష్టములెన్ని వచ్చినన్
    రంగమునందు నొంటరిగ లక్ష్యముఁ జేరఁగ పోరుసల్పనా
    సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. ఒక హాస్య పూరణ అండి (కందము)

      కం॥ లొంగకఁ దప్పదు భార్యకు
      భంగము గాక గృహ శాంతి వరలఁగ నిదియే
      జంగమ దేవర సూత్రము
      సంగరమందు నోడువాఁడె శౌర్యధనుండౌ

      ఉ॥ నింగినిఁ దాకు శౌర్యమును నిల్పుచు నా యభిమన్యుఁడే బరిన్
      జెంగున దూకి శత్రువుల సింగము వోలెను జెండుచున్ జనెన్
      ముంగిటఁ జావు పొంచినను బోరునఁ దగ్గకఁ గీర్తిఁ బొందఁగన్
      సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే!

      తొలగించండి
  12. When tides are against you don't fight the market :)

    చెంగున మారగ మార్కెట్
    వంగి నమస్కృతిని చేసి పక్కకు తొలగన్
    టంగున నిర్ణయమున్ గొని
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. కం:బంగరు లంకను,నీ చతు
    రంగ బలములన్ గణించి యగ్రజ! యని గె
    ల్వంగల నందువె ? రాముడు
    సంగరమున నోడు వాడె ? శౌర్యధనుండౌ.

    రిప్లయితొలగించండి
  14. ఉ:సంగర మందు గెల్తు నని జాణల ముందు వచించినాడవే!
    వెంగలి వౌచు బారెదవొ! వీడకు మీ యని నింక! నీవు సే
    యంగల రీతి సేయుము, పరాక్రమ మంతయు జూపి యుత్తరా!
    సంగర మందు నోడినను శౌర్యధనుండని మెచ్చకుందురే!
    ("యుద్ధం లో గెలుస్తా నని స్త్రీల ముందు డంబాలు పలికి ఇప్పుడు పారిపోతావా?నీ పరాక్రమం చూపించి ఓడిపోయినా మెచ్చుకుంటారు" అని బృహన్నల ఉత్తరకుమారుడికి పౌరుషం కలిగిస్తున్నాడు.)

    రిప్లయితొలగించండి


  15. సింగము వలెగాండ్రించుచు
    రంగము నందున దిగుచును రాణువ తోడన్
    చెంగున దూకుచు పోరుచు
    సంగరమున నోడు వాడె శౌర్యధనుండౌ

    రిప్లయితొలగించండి
  16. (3)ఉ:బంగరు కాన్ క లిచ్చెదను,వద్దిక నాజి బృహన్నలా సము
    త్తుంగతరంగపూర్ణ మగు తోయనిథిన్ దలపించు సేనతో
    సంగర మెట్లు జేతు!కురుసైన్యపు వృద్ధులు,వీరు లెల్లరున్
    సంగర మందు నోడి, నను శౌర్యధనుండని మెచ్చుకొందురే ?
    (ఉత్తరుని యుద్ధభీతి.)

    రిప్లయితొలగించండి
  17. చెంగున రణమున దూకుచు
    భంగముతోఁబాఱిపోవు బంటుగణంబున్
    సింగము మాడ్కిని బోరుచు
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ”

    రిప్లయితొలగించండి
  18. క్రుంగక ప్రాణ భయమునఁ దొ
    లంగక రణ భూమి నుండి ప్రబలెడు పర సే
    నాంగమునకు వెన్నీయక
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ


    అంగజ తుల్య సుందరుఁడు నంతక సన్నిభ విక్రముండునుం
    బింగళ సన్నిభుండు నగు వీర్య విరా డభిమన్యు సవ్యసా
    చ్యంగజు సన్ను తాతిరథు నాజి దురాసదు వైశికమ్మునన్
    సంగర మందు నోడినను శౌర్య ధనుం డని మెచ్చుకొందురే

    రిప్లయితొలగించండి
  19. సంగములను విడనాడుము
    సంగరసీమర జగమ్ము సఫలత కొరకున్
    సంగతముగ పోరు సలిపి
    సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ

    రిప్లయితొలగించండి
  20. చెంగున దూకగన్ రణముఁజేయఁగుతూహల ముబ్బడించుటన్
    భంగము నొందినట్టిబలు వైరిగణంబులు బాఱి పోవగా
    సింగము వోలెవారినట ఛిద్రముఁజేయఁగఁబోరు సల్పగా
    సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే

    రిప్లయితొలగించండి
  21. బొంగర మట్లుతిర్గుచును పోరును చేయక మందబుద్ధితో
    వెంగలి యట్టులుండ నిను వీరుడనంగను బోరుయర్జునా
    సింగము వోలె గర్జనను చేయుచునీదగు శక్తిచూపుచున్
    *“సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే*

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సింగము వలె యభిమన్యుడు
    సంగరమున దూకి చిక్కె శాత్రవులకు తా
    క్రుంగక పోరుచు మడిసెను
    సంగరమున నోడువాడె శౌర్యధనుండౌ.

    రిప్లయితొలగించండి