22, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4684

23-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్”
(లేదా...)
“భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీనరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. కం:
    ధైర్యముతో కృషి జేయుచు,
    కార్యాచరణమును నేర్చి కష్టపడుచు ని
    ర్వీర్యుడగు భర్తకు బదులు
    భార్యయెభర్తగను మారె భాగ్యము గలుగన్.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యుని రోగము కతమున
    చౌర్యము సలుపుటకు వచ్చు చౌరునె దురుటన్
    శౌర్యము జూపుట కయి యా
    భార్యయె భర్తగను మారె , భాగ్యము గలుగన్

    రిప్లయితొలగించండి
  3. ధైర్యంబెంచిన దేవిగ
    కార్యలయమందునుండెకాంచగధనమున్
    ఆర్య గ బుద్ధిని చూపుచు
    భార్యయెభర్తగనుమారెభాగ్యముగలుగన్

    రిప్లయితొలగించండి
  4. ఆర్యగవిద్యలందు నవహంగులగాంచెడి వాణియౌగదా
    కార్యముగేహమందుగన కాంతుడునుండగమోదమందుచున్
    వార్యముగానివేళలనుభావమునున్నతమైనదానిగా
    భార్యయెభర్తయైనపుడు ప్రాప్తమగున్గదభాగ్యయోగముల్

    రిప్లయితొలగించండి

  5. ఆర్యుడు వృద్ధుండై ని
    ర్వీర్యుండైన పతి బదులు భీరువె మిగులన్
    ధైర్యమున బాధ్యతను గొని
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్.


    ధైర్యము గూడగట్టుకుని తన్వి సుభద్ర వచించెనన్నతో
    శౌర్యము లోనమేటియు వసంతుని బోలిన యందగాడతం
    డార్యుడు దేవకీ సుతునకాప్తుడు పార్థునకింతి కృష్ణయున్
    భార్యయె, భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యావర్తమునందున
    భార్యాభర్తల నడుమున బంధముఁ గననా
    శ్చర్యము సహజము తెగువరి
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్

    కార్యము లంగవించు సతి కన్గొన జాలును భోగభాగ్యముల్
    శౌర్యము లేనిభర్త కిక శాంతిని గూర్చగ నెంచియున్నదౌ
    భార్యకు కార్యనిర్వహణ బాధ్యత పైబడఁ భర్త దాసుడై
    భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్

    రిప్లయితొలగించండి
  7. శౌర్యము గల్గిన వేళను
    ధైర్యముగా పురుష వేష ధారణ తోడన్
    క్రౌర్యము గ మసలు చుండగ
    భార్య యె భర్తగను మారె భాగ్యము గలుగన్

    రిప్లయితొలగించండి
  8. కార్యఁపు నిర్వహణమ్మున
    ధైర్యముగా నిలచి భర్త తనువును విడువన్
    స్థైర్యము సడలక గీమున
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్

    రిప్లయితొలగించండి
  9. శౌర్యముజూపి యుద్ధమున శత్రువులన్ దునుమాడి యోధుడై
    కార్యము నిర్వహించి తన కాయము వీడఁగ వీరపత్నియే
    స్థైర్యముఁ బూని బిడ్డలనుదంచిత దీక్ష వహించె సాకగన్
    భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్

    రిప్లయితొలగించండి
  10. కం:ఆర్యా! ఒక కావ్యమ్మున
    భార్యకె శృంగారసుఖము బహుళ మటంచున్
    భార్యగ మారెను భర్తయె
    భార్యయె భర్తగను మారె భాగ్యము కలుగన్
    (ఇలాంటి కథ ఒక ప్రబంధం లో ఉన్నది.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:శౌర్యము లేని భర్త యయి చక్కగ నాస్తిని గావ లేక ,నే
    కార్యము చేయ లేక,తన కంఠము నందున శక్తి లేక యై
    శ్వర్యము సంతస మ్మిడక బాధమిగల్చగ,కార్యశీలయై
    భార్యయె భర్త యైనపుడు ప్రాప్త మగున్ కద భాగ్య యోగముల్

    రిప్లయితొలగించండి
  12. బార్యాభర్తలిరువు రై
    శ్వైర్యములకు ప్రాకులాడి శైథిల్యమదిన్
    కార్యాకార్యమెరుంగక
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్

    రిప్లయితొలగించండి
  13. ఆర్యా! తనపతి మిక్కిలి
    శౌర్యముతోబోరి మడిసె సంగరమందున్
    ధైర్యము వీడక సాగియు
    భార్యయెభర్తగను మారె భాగ్యము గలుగన్.

    రిప్లయితొలగించండి
  14. భార్యా భర్తలిరువురు వి
    పర్యపు కేళీవిలాస పచరణ క్రీడన్
    పర్యంకముపై నాడగ
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్

    వ్యతిరేక పాత్ర పోషించే క్రీడలో పాల్గొన్నారు అనే భావంలో

    రిప్లయితొలగించండి
  15. చౌర్యముఁజేయఁగ రాగా
    భార్యయెమగనికి బదులుగ బాఱగ జేసెన్
    ధైర్యము లేమిని భర్తకు
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్”

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఆర్యాంబ శిఖండి యనఁగ
      సూర్యుం డస్త గిరి సేరఁ జోద్యమ్ముగ సౌం
      దర్య నిధి, మునుఁగ ముదమున
      భార్యయె, భర్తగను మాఱె భాగ్యము గలుగన్


      ఆర్యుల భాషణమ్ము లివి యర్థ యుతమ్ములు సమ్మతమ్ము లౌ
      దార్య గుణాభి రాముఁ డయి దార మనోరథ పూరణార్థ కైం
      కర్య మొనర్ప నిత్య కృత కర్ముఁడు, హర్షిత తృప్తచిత్త గా
      భార్యయె, భర్త యైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్య యోగముల్

      తొలగించండి
  17. ధైర్యముఁగూడబెట్టుకొని దక్షతఁ జూపని భర్త యున్నచో
    శౌర్యముఁదోడ భార్యయిక శ్రద్ధను ముందును వెన్క చూచుచున్
    గార్యముఁజక్కఁజేయునెడ గాంతునివోలెను జాగరూకతన్
    భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్”

    రిప్లయితొలగించండి
  18. క్రౌర్యముకాలసర్పమటుకాంతుడు క్యాన్సరు తోడపోవగన్
    స్థైర్యముకోలుపోవకనుచక్కగ చేయచునింటికార్యముల్
    ధైర్యము తోచరించుచునుతా ననయమ్మును సాగుధీరయౌ
    భార్యయెభర్తయైనపుడు ప్రాప్తమగున్గదభాగ్యయోగముల్.

    శౌర్యము తగ్గగ రుజచే
    స్థైర్యంబూనుచునువేగతగుపనులేల్లన్
    ధైర్యము తోడను చేయుచు
    భార్యయె భర్తగనుమారె భాగ్యముగలుగన్

    రిప్లయితొలగించండి
  19. కందం
    కార్యమ్ము సఫలమయ్యెను
    శౌర్యమ్మున నరకుఁ జంప సత్యాకృష్ణుల్
    వార్యమ్మై పతి యలుపున
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్

    ఉత్పలమాల
    కార్య ఫలమ్ము నొందెడు ప్రకారము భీతులఁ గావనెంచుచున్
    శౌర్యము తోడ నా 'నరకు' సత్యయు కృష్ణుడు గూల్చు పోరునన్
    వార్యమనంగ యాదవుడు వాలగ తేరున విక్రమించుచున్
    భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కార్యములు చేయు పతి ని
    ర్వీర్యుండై పనిని చేయలేని స్థితిఁ గనన్
    ధైర్యముగా బాధ్యతతో
    భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్.

    రిప్లయితొలగించండి