15-2-2024 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”(లేదా...)“తాళీని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్”(శతావధాని యం.వి.పట్వర్ధన్ గారికి ధన్యవాదాలతో...)
కందంకాలిని ముల్లు దిగిందనియాలియె మంచాన వంగి నాత్రుతఁ దీయన్వ్రేలాడి కొయ్యఁ జుట్టినతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్ఉత్పలమాలకాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ నయ్యాలియె చేరవచ్చి తనె యాత్రుత తోడను దీయ వంగఁగన్వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండియున్తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏తమరి సూచనల మేరకు సవరించిన పూరణలు:కందంకాలిని ముల్లు దిగిందనియాలియె మంచాన వంగి యార్తిని దీయన్వ్రేలాడి కొయ్యఁ జుట్టినతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్ఉత్పలమాలకాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ నయ్యాలియె చేరవచ్చి తనె యాత్రము తోడను దీయ వంగఁగన్వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండి యాతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
కాళముమెడలోగలిగినగోళాకారుడుశివుడునుకూడగపత్నిన్మేలములాడుచు సగమైతాళినితొలగించెభర్తతరుణియెమెచ్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేలముఁజూడషర్టుగన చెన్నుగపాంటునుదాల్చునాయమన్వేళలునవ్యమైచనగ వింతయగాదనుభావమెంచుచున్వ్రేళులనుంగరంబునట విజ్ఞాన జూపవివాహ బంధమున్తాళినిఁదీసెభర్తవనితామణి మెచ్చి ప్రేమతోడుతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'విజ్ఞత జూప' అనండి.
విజ్ఞత
కం:తాళిని గట్టెను, నలుపనికాళియనుచు పలువురు వెటకారము జేయన్కేళీ విలాసియై యెగతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”
పాళెము నందలి గుడిలోకేళికను సలిపెడి వేళ గ్రీవకు సుడియన్తాళుకొన లేక బోవగతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
మేళము లాడుచు పత్నినివేళా కోళము చేయుట గని వెలదుల నాపెన్చాలును పొండని యపు డెగతాళిని దొలగించె భర్త తరుణి యె మెచ్చ న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. "వేళాకోళ మిడగ గని" అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కేళిగృహమున రమించెడుపాళమ్మున చిక్కుపడగ ప్రాణేశుండావేళ నివీతము జిక్కినతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్.కేళి గృహమ్మునందు రతి కేళిని మున్గు రసాన్వితమ్మె యౌ పాళము నందు చిక్కుబడె భర్త నివీతము థోడనంచు నవ్వేళ తితిక్షతో కడు ప్రవీణత జూపుచు గేస్తురాలి యాతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.
ఉ.గోళపు బొబ్బ, పుండులను గూర్కొను చక్కని బోర వస్త్రమున్తాళగ లేని భార్య గని తక్షణమే ప్రతికూలమభ్రమేధూళిని రాల్చి మందునిడి ధూపము వేయగ బుద్ధిమంతుడై*తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.*.....అభ్రము = బంగారు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉత్పలమాల:తాళగజాలనీ విరహ తాపమటంచు సుభద్ర సూనుఁడేలాలనతోడనుత్తరను రంజిలఁ జేయుచు మేని భూషలన్కేళిగ నూడ్చుచున్ మదనకేళి నిరోధకమంచు హేలగాతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
వేళకు శయ్యాగృహమునతాళక తిమిరించునపుడు తమకము తోడన్కేళీ వినోద చిత్తుడుతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్తాళిని గట్టియున్న పతి తన్మయ చిత్తుడు పుష్పకేతువేతాళగ శక్యమా మదిని దాగిన కోర్కెల నాప సాధ్యమావేళకు శయ్యపై నిగుడు ప్రేయసి వెచ్చని కౌగిలింతకైతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
ధన్యవాదాలు గురూజీ 🙏
ఆలిని బిగికౌగిలిలోలాలనగా జేర్చిభర్త రంజిలు వేళన్వాలాయముగా నిలచినతాళిని దొలగించె భర్త తరుణియెమెచ్చన్
కం:తాళియె స్త్రీస్వేచ్ఛకు నెగతాళి యనెడు నవ్యభావ తతులను,సిద్ధాంతాళిని నమ్ముచు కట్టినతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
ఉ:తాళియె మంగళ మ్మనుచు,ధర్మ మటంచును,భర్త పోగ నాతాళిని ద్రెంచు రీతి గని,తద్దయు కుంది ,తెగింపు నొంది యీతాళి యనంగ స్త్రీకి నురి తాడను నూతన భావ దీప్తి తోతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమ తోడుతన్
ధన్యవాదం గురువు గారు!
కం॥ తాళక నాతప తాపమువేళకు స్నానమ్ముఁ జేయ వెడలఁగ మగనిన్తాళిని భద్రపరచుమనతాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్ ఉ॥ తాళిని దీసెభర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్దాళిని గారవించు వనితామణి తప్పని స్థానకమ్మునన్దాళికి మారుగన్ బసుపు దారముఁ గొమ్మును గట్టుకొన్నదైతాళిమితోఁ గటుంబ నిజదైన్యతఁ బాపఁగ నెంచి యత్తరిన్మరొక పూరణఉ॥ తాళిని గారవించు వనితామణు లెల్లరు నుద్యమించుచున్కాళిక లౌచు చెండుదురు కాలుని వోలెను దూలనాడుచున్హేళనఁ జేయఁ దాళినిల హేయము నియ్యది యంచు నెచ్చటన్దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్ స్థానకము పరిస్థితి (నిఘంటువు సహాయమండి)
వేళాకోళము లాడగనాలును మగలును సరసపు టాటల తోడన్ దాళియ భర్తకుఁదగులగఁదాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
వ్రేళుల నైపుణ్యమ్మున వేళాకోళమ్ము గాఁగ విపరీతముగా లీల నగ లందు నంతటఁ దాళిని దొలఁగించె భర్త తరుణియె మెచ్చన్ [వేళాకోళము = చిక్కయినది] మేళము లింపుగాఁ దనరి మిన్నును నంటఁగ మ్రోగుచుండఁగాఁదాళము లింక వాద్యములు దద్ద పురోహితుఁ డన్న యట్టి యావేళ నెడంద మిక్కుటపుఁ బేర్మి ముహూర్తము నందుఁ గట్టఁగాఁదాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగఁ బ్రేమ తోడుతన్
ఆలిని గౌగలించుతఱి యౌదలఁజుట్టిన భృంగరూపమౌతాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్ కేళి గృ హంబునందుగలకీచుకలాటలు వర్జ శక్యమే యాలును భర్తయున్మిగుల హర్షను తోడను దెల్లవార్తురే
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. బాలుండు పాలు కుడుచుచుతాళిని పట్టుకొని యాడ తగులగ గొలుసున్ తాళియె గొలుసుకు మెలిపడతాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్.
తాళియుతెగిపోగవడిగతాళగలేకటపసిండి తంతిని దానిన్ లాలనగ క్రొత్త దుంచుచుతాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్
కందం
రిప్లయితొలగించండికాలిని ముల్లు దిగిందని
యాలియె మంచాన వంగి నాత్రుతఁ దీయన్
వ్రేలాడి కొయ్యఁ జుట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
ఉత్పలమాల
కాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ న
య్యాలియె చేరవచ్చి తనె యాత్రుత తోడను దీయ వంగఁగన్
వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండియున్
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండితమరి సూచనల మేరకు సవరించిన పూరణలు:
కందం
కాలిని ముల్లు దిగిందని
యాలియె మంచాన వంగి యార్తిని దీయన్
వ్రేలాడి కొయ్యఁ జుట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
ఉత్పలమాల
కాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ న
య్యాలియె చేరవచ్చి తనె యాత్రము తోడను దీయ వంగఁగన్
వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండి యా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
కాళముమెడలోగలిగిన
రిప్లయితొలగించండిగోళాకారుడుశివుడునుకూడగపత్నిన్
మేలములాడుచు సగమై
తాళినితొలగించెభర్తతరుణియెమెచ్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేలముఁజూడషర్టుగన చెన్నుగపాంటునుదాల్చునాయమన్
రిప్లయితొలగించండివేళలునవ్యమైచనగ వింతయగాదనుభావమెంచుచున్
వ్రేళులనుంగరంబునట విజ్ఞాన జూపవివాహ బంధమున్
తాళినిఁదీసెభర్తవనితామణి మెచ్చి ప్రేమతోడుతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విజ్ఞత జూప' అనండి.
విజ్ఞత
రిప్లయితొలగించండికం:
రిప్లయితొలగించండితాళిని గట్టెను, నలుపని
కాళియనుచు పలువురు వెటకారము జేయన్
కేళీ విలాసియై యెగ
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాళెము నందలి గుడిలో
రిప్లయితొలగించండికేళికను సలిపెడి వేళ గ్రీవకు సుడియన్
తాళుకొన లేక బోవగ
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేళము లాడుచు పత్నిని
రిప్లయితొలగించండివేళా కోళము చేయుట గని వెలదుల నాపెన్
చాలును పొండని యపు డెగ
తాళిని దొలగించె భర్త తరుణి యె మెచ్చ న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "వేళాకోళ మిడగ గని" అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికేళిగృహమున రమించెడు
రిప్లయితొలగించండిపాళమ్మున చిక్కుపడగ ప్రాణేశుండా
వేళ నివీతము జిక్కిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్.
కేళి గృహమ్మునందు రతి కేళిని మున్గు రసాన్వితమ్మె యౌ
పాళము నందు చిక్కుబడె భర్త నివీతము థోడనంచు న
వ్వేళ తితిక్షతో కడు ప్రవీణత జూపుచు గేస్తురాలి యా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిగోళపు బొబ్బ, పుండులను గూర్కొను చక్కని బోర వస్త్రమున్
తాళగ లేని భార్య గని తక్షణమే ప్రతికూలమభ్రమే
ధూళిని రాల్చి మందునిడి ధూపము వేయగ బుద్ధిమంతుడై
*తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.*
.....
అభ్రము = బంగారు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండితాళగజాలనీ విరహ తాపమటంచు సుభద్ర సూనుఁడే
లాలనతోడనుత్తరను రంజిలఁ జేయుచు మేని భూషలన్
కేళిగ నూడ్చుచున్ మదనకేళి నిరోధకమంచు హేలగా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేళకు శయ్యాగృహమున
రిప్లయితొలగించండితాళక తిమిరించునపుడు తమకము తోడన్
కేళీ వినోద చిత్తుడు
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
తాళిని గట్టియున్న పతి తన్మయ చిత్తుడు పుష్పకేతువే
తాళగ శక్యమా మదిని దాగిన కోర్కెల నాప సాధ్యమా
వేళకు శయ్యపై నిగుడు ప్రేయసి వెచ్చని కౌగిలింతకై
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆలిని బిగికౌగిలిలో
రిప్లయితొలగించండిలాలనగా జేర్చిభర్త రంజిలు వేళన్
వాలాయముగా నిలచిన
తాళిని దొలగించె భర్త తరుణియెమెచ్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:తాళియె స్త్రీస్వేచ్ఛకు నెగ
రిప్లయితొలగించండితాళి యనెడు నవ్యభావ తతులను,సిద్ధాం
తాళిని నమ్ముచు కట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:తాళియె మంగళ మ్మనుచు,ధర్మ మటంచును,భర్త పోగ నా
రిప్లయితొలగించండితాళిని ద్రెంచు రీతి గని,తద్దయు కుంది ,తెగింపు నొంది యీ
తాళి యనంగ స్త్రీకి నురి తాడను నూతన భావ దీప్తి తో
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమ తోడుతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదం గురువు గారు!
రిప్లయితొలగించండికం॥ తాళక నాతప తాపము
రిప్లయితొలగించండివేళకు స్నానమ్ముఁ జేయ వెడలఁగ మగనిన్
తాళిని భద్రపరచుమన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
ఉ॥ తాళిని దీసెభర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్
దాళిని గారవించు వనితామణి తప్పని స్థానకమ్మునన్
దాళికి మారుగన్ బసుపు దారముఁ గొమ్మును గట్టుకొన్నదై
తాళిమితోఁ గటుంబ నిజదైన్యతఁ బాపఁగ నెంచి యత్తరిన్
మరొక పూరణ
ఉ॥ తాళిని గారవించు వనితామణు లెల్లరు నుద్యమించుచున్
కాళిక లౌచు చెండుదురు కాలుని వోలెను దూలనాడుచున్
హేళనఁ జేయఁ దాళినిల హేయము నియ్యది యంచు నెచ్చటన్
దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్
స్థానకము పరిస్థితి (నిఘంటువు సహాయమండి)
వేళాకోళము లాడగ
రిప్లయితొలగించండినాలును మగలును సరసపు టాటల తోడన్
దాళియ భర్తకుఁదగులగఁ
దాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్
వ్రేళుల నైపుణ్యమ్మున
రిప్లయితొలగించండివేళాకోళమ్ము గాఁగ విపరీతముగా
లీల నగ లందు నంతటఁ
దాళిని దొలఁగించె భర్త తరుణియె మెచ్చన్
[వేళాకోళము = చిక్కయినది]
మేళము లింపుగాఁ దనరి మిన్నును నంటఁగ మ్రోగుచుండఁగాఁ
దాళము లింక వాద్యములు దద్ద పురోహితుఁ డన్న యట్టి యా
వేళ నెడంద మిక్కుటపుఁ బేర్మి ముహూర్తము నందుఁ గట్టఁగాఁ
దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగఁ బ్రేమ తోడుతన్
ఆలిని గౌగలించుతఱి యౌదలఁజుట్టిన భృంగరూపమౌ
రిప్లయితొలగించండితాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
కేళి గృ హంబునందుగలకీచుకలాటలు వర్జ శక్యమే
యాలును భర్తయున్మిగుల హర్షను తోడను దెల్లవార్తురే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
బాలుండు పాలు కుడుచుచు
తాళిని పట్టుకొని యాడ తగులగ గొలుసున్
తాళియె గొలుసుకు మెలిపడ
తాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్.
తాళియుతెగిపోగవడిగ
రిప్లయితొలగించండితాళగలేకటపసిండి తంతిని దానిన్
లాలనగ క్రొత్త దుంచుచు
తాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్