16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4678

17-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విడియమిచ్చి భార్య యడిగె వేతనమును”
(లేదా...)
“విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే”
(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)

40 కామెంట్‌లు:

 1. సాలరీ వచ్చిందాండీ ?

  అడుగులకుమడుగులనుసుతారమైన
  కైపులనడుమ నొద్దుచు కమలినట్టి
  విడియమిచ్చి భార్య యడిగె, "వేతనమును
  ప్రభుత యిచ్చెనొ యీనెల ప్రాణనాథ!"

  రిప్లయితొలగించండి
 2. పండుగ దినమునం దైనను బంగరు నగ
  పొంద దలచి త న పతితో ముచ్చట లిడి
  బూరె గారెల తొడుత బువ్వ బెట్టి ,
  విడియమిచ్చి భార్య యడిగె వేతనమును

  రిప్లయితొలగించండి
 3. సామ్యవాదంబునేర్చినజాణయొకతె
  పెండ్లియాడెను పురుషుని విలువనరసి
  నాగరీకంబు ముదరగా నవకమొప్ప
  విడియమిచ్చిభార్యయడిగె వేతనమును

  రిప్లయితొలగించండి
 4. ఒకటి యరు దెంచ పతిజేరి యూసు లాడి
  వలసిన ట్టి ప దార్థ ము ల్ వడ్డ నమున
  మురిప మొలికించు సరసాన మోదమొసగి
  విడియ మిచ్చి భార్య యడి గె వేతనమును

  రిప్లయితొలగించండి
 5. జడియరుగాదె భామలిక చాలగనేర్చిరినవ్యభావముల్
  పుడమినివింతపోకడల పొందగసంపద సామ్యపద్ధతిన్
  విడువడు బంధముల్గనగ పెచ్చుగనుండెనుబేరసారముల్
  విడియమునిచ్చి భార్యయగు వేతనమిమ్మనె జంకులేకయే

  రిప్లయితొలగించండి
 6. మధ్య తరగతి వాడగు మానవునికి
  భార్య స్వీకరించెను విత్త బాధ్యతలను
  జీతమందిన దినమున చెంతజేరి
  విడియమిచ్చి భార్య యడిగె వేతనమును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పడతియొసంగు సేవలకు వల్లభుడే ధనమీయజూపగా
   విడువక పుచ్చుకొందునని వేగిరపాటున పల్కి కూడునే
   కుడిచిన పిమ్మటన్ దరికి గోముగ చేరి సమాదరమ్ముతో
   విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. తేటగీతి
  సుతకు జంట వెదకి వచ్చి సోలఁగ పతి
  త్రాగ నీరిచ్చి వివరాలు తరచి యడిగి
  కుడువ భోనము, వరునికి కొలువనంగ,
  విడియమిచ్చి, భార్య యడిగె వేతనమును

  చంపకమాల
  కడు రుచివంతమౌ పగిది కమ్మగ జేయుదు వంటకత్తెగన్,
  వడలక నింటిలో పనుల పారక, పిల్లల పెంచెదన్ మగా! ,
  యడగను నెప్పుడున్ సెలవు నందరికౌ రవి వారమంచుఁ, దా
  విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే

  రిప్లయితొలగించండి
 8. చం.

  ఒడలను విక్రయించుకొను నొప్పెడి దుండిని నుద్ధరించెడిన్
  వడికొని పెండ్లిచేసికొనె పండితు డొక్కడు పుణ్యకర్మగా
  బిడియము నభ్యసించు సతి పేర్మిని వడ్డెన, భోజనాంతమున్
  *విడియమునిచ్చి భార్యతగు వేతనమిమ్మనె జంకు లేకయే.*

  రిప్లయితొలగించండి
 9. అడిగినదేది లేదనును, యక్కర వచ్చిన దాదుకొమ్మనన్
  తడబడకుండ జెప్పు తను దానమునీయనటంచు పత్నికిన్
  పెడసరకట్టెయైన పతి బెట్టిదమున్ దెరలించ బూనికన్
  విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే

  రిప్లయితొలగించండి
 10. భార్య గడసరి మగడేమొ బంకముచ్చు
  ముద్దుముచ్చట లెరుఁగని మొద్దువాఁడు
  వగలు బోవుచునొకనాడు మగనిముందు
  విడియమిచ్చి భార్య యడిగె వేతనమును

  రిప్లయితొలగించండి
 11. తే॥ కాల మహిమ నాప నెవరి కగును కనఁగఁ
  గోరికలకు మితి నెరగ కుంటి మయ్య
  యెదుటి వారితో సమముగ నిల్లు నిలుప
  విడియ మిచ్చి భార్య యడిగె వేతనమును

  చం॥ బిడియము లేని స్పర్ధను వివేకము శూన్యము గాఁగ నేఁడిటుల్
  నడవడి మారి జీవితపు నావకు గమ్యము వస్తు సంపదల్
  బడయుట యౌచు మానవులు వర్తిలు చుండుటఁ జూడఁగాఁ దగున్
  విడియము నిచ్చి భార్య తగు వేతన మిమ్మనె జంకు లేకయే

  ఇప్పుడిది సర్వ సాధారణ విషయమే కదండి. కాకపోతే తాంబూలము వేసుకొనే యలవాటు అంతరించిందండి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరొక చిన్న హాస్య పూరణ యండి

   తే॥ మగువ పాకము విలువలు మగడు గనును
   బుద్ధిగఁ దినుచు మెచ్చఁగఁ గ్రుద్ధురాలు
   గాదను నిజము నెరుగుచు గారవించ
   విడియ మిచ్చి భార్య యడిగె వేతనమును

   తొలగించండి
  2. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


 12. పలు రకమ్ముల వంటలు వండి వార్చి
  యన్ని పనులను చేసెడు యాలి నెపుడు
  మనిషి గాకూడచూడ ని మగని కచట
  విడియ మిచ్చి భార్య యడిగె వేతనమును

  రిప్లయితొలగించండి


 13. (1)తే.గీ:పెంకె తన మున్న భర్త తో వేగి వేగి,
  మంచి తనమున నతనిని మార్చ దలచి
  విడియ మిచ్చి భార్య యడిగె "వేతనమును
  తగుల బెట్టక యొక్కింత దాచు" మనుచు

  (2)చం:"మడి" యని,"పూజ యున్న" దని మాపటి దాక వరమ్ము నీక "ని
  ప్పుడు తమ నేర్పు జూపు"డని ముద్దుగ రాత్రిన కోర్కె బెంచుచున్
  విడియము నిచ్చి భార్య "తగు వేతన మి"మ్మనె ,"జంకు లేకయే
  యడుగుట నాకు నచ్చె"నని యామెకు చుంబన మిచ్చె భర్తయున్.

  (3)చం:బుడ బుడ టీలు త్రాగు,నొక పూటయు పువ్వులు తెచ్చి కొప్పు నుం
  చడు,సిగరెట్లు త్రాగు,నిక చాలదు జీత మటన్న సుంత విన్
  పడ,దిక యిల్లు తాను గడపన్ తగు సొమ్మును గుంజు కోర్కె తో
  విడియము నిచ్చి భార్య తగు వేతన మిమ్మనె జంకు లేకయే.
  (ఆమె తనకి జీతం అడగ లేదు.భర్త యొక్క జీతమే తన చేతికి ఇచ్చేది చాలటం లేదని అడిగింది)

  రిప్లయితొలగించండి
 14. భోజనమ్మును భుజియించి ముదము తోడ
  నడ్డి వాల్చిన భర్తకు నయము మీర
  విడియమిచ్చి, భార్య యడిగె వేతనమును
  నందు కొంటివె? మఱిలేద? యార్య! చెపుమ

  రిప్లయితొలగించండి
 15. అంగనా మణుల మతు లెఱుంగఁ దరమె
  మాసపు మొదటి దిన మంచు మది నెఱింగి
  గోముగఁ బతి దేవుఁ గదిసి కులుకు లొలుక
  విడియ మిచ్చి భార్య యడిగె వేతనమును


  పడతులఁ దల్ప నల్ప లని భావ్యము గా దిల నిశ్చయమ్ముగా
  నొడయునిఁ గాంచి యత్తఱిఁ దలోదరి పుత్ర నిమిత్త మింపుగాఁ
  దడయక కూర్చి సద్గురువు దక్షిణ నుంచి యరంటి పండ్లతో
  విడియము నిచ్చి భార్య తగు వేతన మిమ్మనె జంకు లేకయే

  రిప్లయితొలగించండి
 16. పడుకొనియుండుపెన్మిటికి బంగరు చేతుల ముద్ద పెట్టి యున్
  విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే
  పడతిని జూసియాతఁడును బాహువు నందున జిక్కఁజేసి వే
  విడతలగౌగలించెను సపేర్మిని ముద్దులువెట్టె ప్రీతి తోన్

  రిప్లయితొలగించండి

 17. పతిని లంచగొండి యనుచు పదుగురనగ
  మార్చవలయు నని దలచి మగువ తాను
  సుద్దు లెన్నియొ చెప్పుచు చోద్యముగను
  విడియమిచ్చి భార్య యడిగె వేతనమును.  ఒడయడు లంచగొండియని యూరక జేయడు నెట్టి కార్యమున్
  దొడవ యటంచు బంధువులు దూరగ వానిని మార్చ నెంచుచున్
  ముడుపులు లేక నేపనిని ముట్టనటంచును మంకు పట్టుతో
  విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే.

  రిప్లయితొలగించండి
 18. లేప నార్థమ్ము నింపుగ రేపు మాపు
  వనిత వాంఛించి వియ్యాల వారి కంత
  బదులు నని యిట్లు మే మన్య వసతు లందు
  విడియ మిచ్చి భార్య యడిగె వే తనమును
  [తనము= గంధము]

  రిప్లయితొలగించండి
 19. కుడుములువండితోడుగను కోరినతొక్కుడులడ్లు చేయుచున్
  బడలికనెల్లతావడిగబాపగనెంచుచుతెచ్చియిచ్చుచున్
  గడుసుగనవ్వి తోడనటగాంచుచుచిల్కలజుట్టుచున్వడిన్
  *విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే*”

  రిప్లయితొలగించండి

 20. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  అమితముగ చేయు పతి ఖర్చు నదుపుచేయ
  మొదటి తేదీన జీతము ముట్టినదిన
  మందు, రాత్రియందిడినట్టి విందు పిదప
  నింటి ఖర్చులకు ధనము నీయమనుచు
  విడియమిచ్చి భార్య యడిగె వేతనమును.

  రిప్లయితొలగించండి