14, నవంబర్ 2024, గురువారం

దత్తపది - 211

15-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
మేడ - మిద్దె - గుడిసె - ఇల్లు
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. కందం
    బలమేడ దాగె నర్జున?
    వెలయించిన జ్ఞానమిద్దె? విలువిడి రణమున్
    దొలగెడుఁ గుడి సెల్లదెపుడుఁ
    దెలిసియు కంపిల్లు దేల ధీరుడవైనన్?

    రిప్లయితొలగించండి
  2. ధర్మమేడకుబోయెనోగదద్రౌపదీసతియేడ్వగా
    కర్మమిద్దెగకాంచరాజుకుకాటికేగుటకయ్యెనే
    మర్మమాగుడి, సెప్పనేర్తును మాధవుండెగచూడగా
    అర్మిలిన్ ప్రణమిల్లువారల యానమెప్పుడు వర్ధిలున్

    రిప్లయితొలగించండి

  3. *(భీముని సలహా పాటించిన పిదప ద్రౌపతి కీచకుల సంభాషణ)*


    ఇల్లుటాలువు కావైతి వీవు నన్ను
    జేర రమ్మిద్దెస కనుచు కోర కీచ
    కుండు,మనమేడ నుడవక కుదురుగ గల
    నృత్య శాలకేగుడి సెజ్జ నేర్పరిచితి.

    రిప్లయితొలగించండి

  4. *(వస్త్సాపహరణానంతరం ఆగ్రహంతో భీముడు)*


    పౌరుషమ్మేడ దాగెనొ పాండవులకు
    గొప్పగా మనమిద్దెల కుడువనేమి
    యిల్లుటాలుకీవిధమున నెగ్గుసలుప
    దొమ్మి నన్ గుడిసెదరిక దుర్మతుండ్డు.

    రిప్లయితొలగించండి
  5. తే||గీ||
    బేలు జూదమందొక "యిల్లు" వెనుక బడగ
    నోట "మే డ" గ్గర పడెనని దన యుగరమున
    "మిద్దె"నుండి రతనమును మెఱుకి యొసగె
    ధర్మరాజు సం"గుడి సె"స ధర్మమనుచు

    రిప్లయితొలగించండి
  6. మోహన మురళీ రవ[మేడ]! మోదమలర
    తన్మయత్వము చేకూర్చు తరుణ[మిద్దె]!
    సు[గుడి సె]లవడుగనిదాన సుందరాంగ!
    [ఇల్లు]డుగు మెడిదము విననేల కృష్ణ!

    రిప్లయితొలగించండి