24, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4952

25-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(లేదా...)
“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్”

5 కామెంట్‌లు:

  1. పద్యమునూఱునుసంఖ్యను
    విద్యనుజెప్పెనుసుకవియు వినగనుసొంపై
    సద్యశమిచ్చెడి కవితా
    మద్యముఁగొన దాశరథి నిన్ను మారుతిపిలిచెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఆద్యంతము నాటకమిది
    హృద్యమ్ముగ రాణకెక్కె హేలన్ పాత్రల్
    సద్యశమందిన వేడుక
    మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్

    ఉత్పలమాల
    వేద్యమనంగ రామకథ ప్రేక్షకులెల్లరు మెచ్చి కేకలన్
    హృద్యము హృద్యమంచు వినుతించిగ నాటక పాత్రధారులై
    సద్యశమందినామనుచు సంబరమందున వేడ్కఁ జేయుచున్
    మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్

    రిప్లయితొలగించండి
  3. చోద్యముగ పిల్లవాడనె
    "మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
    సద్యము శిక్షకుడు బిలచి
    ఆద్యముగ నతనికి శిక్షనందించె కసిన్

    రిప్లయితొలగించండి

  4. వేద్యులు సమ్మక్కకు నై
    వేద్యము నర్పించినట్టి ప్రియమిదీ నీ కా
    రాధ్యుడు పంపెనటంచును
    మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్.


    విద్యలు నేర్వకున్నను వివేకము తోడను నాటకమ్మునే
    సేద్యము జేయు వారలగు క్షేత్రకరుండ్రట వేయ పండితా
    రాధ్యులు మెచ్చిరంచు ముద మందుచు వేడుక జేయ గోరుచున్
    మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్.

    రిప్లయితొలగించండి