17, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4945

18-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ”
(లేదా...)
“గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్”

24 కామెంట్‌లు:

  1. పరుల నివాసమందు మరి పాలను వెన్నలు దొంగిలించుటల్!
    తరుణులు స్నానమాడఁ గని తప్పుగనెంచక వస్త్ర చౌర్యముల్!
    సరసములాడుటల్ హరికి సాధ్యము!చెల్లురె తక్కొరుల్! జగ
    ద్గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్!!

    రిప్లయితొలగించండి
  2. తరుగనిభక్తినిబోయఁడు
    గురుడగు ద్రోణునిప్రతిమనుకొల్చెనుమదిలో
    వరముగకోల్పడెవ్రేలిని
    గురుసరణిన్జరించుశిష్యకోటికి ముప్పే

    రిప్లయితొలగించండి
  3. కందం
    గురువై ప్రతిమగ, శిష్యుఁడు
    గురుదక్షిణ నిత్తునన్న, గొనె నంగుటమున్
    బొరలఁగ వివక్ష! భువిఁ ద
    ద్గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ!

    చంపకమాల
    గురువును బొమ్మలోఁ గనుచు కోరిన విద్యల నేకలవ్యుడున్
    మెరయఁగ నేర్చి మోదమున మెప్పొనరన్ గురుదక్షిణంబిడన్
    బరుగులు వెట్ట నంగుటము పంచుమనెన్ గద పక్షపాతి! త
    ద్గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్!

    రిప్లయితొలగించండి
  4. గురుడాతడు జగములకే
    తరుణులచీరలు తరువున దాచెను లీలన్
    గురులీలను గుఱుతించక
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ

    రిప్లయితొలగించండి

  5. పరిపక్వతలేని శిశువు
    కరిసముతో పలికెనిట్లు కష్టంబైనన్
    పరిధులు దాటగ వలదను
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ.


    పరిణతి లేని యా పడుచు వాడగు ఛాత్రుడు చెప్పె నిట్టులన్
    నిరతము దైవనామమును నిష్ఠగ చేయమటంచు తెల్పుచున్
    పరిధుల దాటబోవుటది పాపపు హేతువటంచు చెప్పెడిన్
    గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్.

    రిప్లయితొలగించండి
  6. మెరుగగు రీతిగ బడిలో
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ
    తరతమ మెంచని యాతడు
    అరుదగు జబ్బున‌ పడెనని యరసిన వేళన్

    రిప్లయితొలగించండి
  7. గురుబోధన గావలయును
    సరియగువిద్య నరయంగ ఛాత్రునికిలలో
    గురుబోధలఁవిడి గ్రుడ్డిగ
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ

    గురువుల బోధ శ్రేష్ఠము నిగూఢత నిండిన తీక్ష్ణ దృష్టికై
    తరగని విద్య పట్టుబడు తక్కొని శాస్త్రము నభ్యసించినన్
    గురువిడు బోధనల్ మరచి గ్రుడ్డిగ తామిక తర్క శూన్యులై
    గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్

    రిప్లయితొలగించండి
  8. తిరమగు విద్యా బోధన
    నిరుపమ రీతిగ సలీపెడు నిర్మల మతులై
    పరగ చు నుండగ నె ట్టు ల
    గురు సరణి జరించు శిష్య కోటికి వగ పౌ?

    రిప్లయితొలగించండి
  9. కం:గురువుల సుగుణమ్ముల నే
    ర్చిరి మీరిక సెలవు గొనుడు, చెడుగే మాలో
    దొరలిన నది గొప్ప యనుచు
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ”
    (తైత్తిరీయోపనిషత్ లోని శిక్షావల్లి లో గురువులు విద్యానంతరం శిష్యులని సాగనంపుతూ అద్భుత మైన బోధలు చేస్తారు.వాటిలో ఒకటి-నాయనా!మా జ్ఞానాన్ని ,మంచి లక్షణాలని గ్రహించండి.మా లో లోపాలు కొన్ని ఉండవచ్చు.గురువు గారే తప్పు చేస్తే మనం చెయ్య కూడదా?అని నేర్చుకో కండి అని.ఇది చాలా నిజాయతీ కల గురు బోధ.)

    రిప్లయితొలగించండి
  10. చం:గురువుల లోని జ్ఞానమును గొంచును సద్గుణ మేది యున్న నా
    చరణము లోన నుంచుటయె ఛాత్రున కొప్పును కాని లోపముల్
    గురువున గూడ నుండె, మరి కూడదె నా కడ నంచు నెంచి త
    ద్గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్”

    రిప్లయితొలగించండి
  11. కం॥ ధరనన్నియు సద్గుణములు
    నరయఁగ జనులకు పొసఁగునె యనుసరణ సదా
    పరితోషమగునె యన్నిట
    గురుసరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ

    చం॥ అరయఁగ మానవాళికిల నన్నియు మేటి గుణమ్ము లుండునే
    గురువుయు మానవుండె యగుఁ గోరుచు విద్యలు నేర్వఁగన్ జనుల్
    గురువును గౌరవించఁదగు గొప్పగ నంతియె కాని యన్నిటా
    గురుసరణిన్ జరించుటొనఁ గూర్చును దుఃఖము శిష్యకోటికిన్

    రిప్లయితొలగించండి
  12. గురువులు జ్ఞానబోధ నొనగూర్తురు ఛాత్రులకున్ వరంబుగన్
    గురుతరమైన తత్పరత గూడిన సాధనమందు నెన్నడున్
    గురువులు చేయు బోధల నిగూఢత నారయకన్ మనంబునన్
    గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్

    రిప్లయితొలగించండి
  13. ధరణీ తలమున గురువుల
    కురుతర భక్తిని మనముల నొక్కింతయు నా
    దరముం జూపక చన నలు
    గురు సరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ


    నిరతము పూజనీయులు గణింప గురూత్తము లెట్టివారికిం
    బరము లభించు మార్గమును బన్నుగఁ జూప సమర్థు లౌదురే
    సరసిజ జాత సన్నిభులు సద్గురు లిద్ధర సుంత యేని స
    ద్గురు సరణిం జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్

    రిప్లయితొలగించండి
  14. ధరణిని సతతము మేలగు
    *"గురుసరణిఁ జరించు శిష్యకోటికి ,వగపౌ”*
    గురువుల మాటలను వినక
    గరువము చూపుచును సాగ ఖలులకు నెపుడున్


    గురువన దైవమే భువిని కూరిమి తోడను నేర్పు పాఠముల్
    నర యగ శిష్యకోటికిని యంతయు నొజ్జయెయందురెల్లరున్
    మరియిటు మానసమ్ముననుమంచితలంపుననెంచ కెప్పుడే
    *“గురుసరణిన్ జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్”*

    రిప్లయితొలగించండి