కం:కలత బడ సీత, రక్కసి నెలత యనియె హనుమ మాయ నేర్చెను గరిమన్ చెలగుచు కాయము పెంచెను నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్” (హనుమంతుడు ఏమయ్యాడో అని సీత భయపడుతుంటే త్రిజట "అతనికి భయం లేదు.అతడు గరిమా విద్య నేర్చి శరీరం పెంచాడు.అతని ముఖం ఏనుగు ముఖం లాగా కనిపించింది అని చెప్పింది. అణిమ,లఘిమ,గరిమ అనే విద్యలు హనుమంతునికి తెలుసు.)
కందం
రిప్లయితొలగించండికొలువునఁ దగు రూపములం
దలంకరణములొనరింప హనుమకు గుడిలో
వెలిగి నవరాత్రులందున
నెలఁతా! హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
చంపకమాల
తొలగించండిఅతిబలుఁడైన మారుతికినందె శరన్నవ రాత్రులందునన్
జతపడి రూపముల్ మెరసె సర్వులు మెచ్చఁగ వైభవంపు సం
యుతమగు పూనికన్ వరుస నొప్పునలంకరణంబులెంచఁగా
నతివరొ! యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్!
తెలిసియు తెలియక పిల్లలు
రిప్లయితొలగించండికలిసి నటించంగ నాటకముఁ జూడంగన్
కలగూరగంప కాదే!
నెలఁతా! హస్తిముఖ మాంజనేయున కొప్పెన్!!
జలధిని లంఘించినతని
రిప్లయితొలగించండితొలివేల్పయినట్టి వక్రతుండుని తోడన్
కలిపినొకనిగ బొడగనగ
నెలఁతా ! హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
బలిమినిహనుమంతుండును
రిప్లయితొలగించండికలిసియుభద్రతనుదెచ్చె కాంతకులంకన్
తెలియగఁజెప్పెనురాముకు
నెలంతా హస్తిముఖమాంజనేయునకొప్పున్
నెలతా
రిప్లయితొలగించండిసతతము రామ నామమును సంయమిగాగజపించువాడునై
రిప్లయితొలగించండిపతనముగానిభద్రతను పావనియయ్యెగురుండుసీతకున్
పితకునుమాతకున్సుతుడు పెద్దగనిల్చిశుభంబులీయగా
అతివరొయాంజనేయునకు హస్తి, ుఖంబమరెన్కనుంగొనన్
మతిచెడి జేసిరో కుటిల మానసమందున కుట్ర జేసిరో
రిప్లయితొలగించండిప్రతిమలు జూడగన్ వివిథ భంగిమలందున మొండమొక్కటౌ
అతుగుగఁ బెట్టు వేరు తలనాగమ శాస్త్రములాగమాగమౌ
నతివరొ! యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్!!
రిప్లయితొలగించండివలదంటివి కద నాటక
ములలోన గణేశు పాత్ర మూర్ఖత్వముతో
పలువురు మెచ్చిరి కనుమా
నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్.
ప్రతిదిన మొక్కనాటకము పట్టణమందున వేతురంచు నా
సతిపతు లిర్వురిష్టమున సాగిరి యందు నటించ నెంచి, దం
పతులను గాంచి దర్శకుడు పల్కె వినాయక పాత్ర నిచ్చి తా
నతివరొ యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్.
(భర్త పేరు ఆంజనేయులు)
కలికి మగడాంజనేయుడు
రిప్లయితొలగించండివిలక్షణముగ నటియించె విఘ్నేశ్వరుడై
తిలకించిన జనులనిరట
నెలఁతా! హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
సతియగు భామకిచ్చిరట శైలజ పాత్రను నాటకంబునన్
బతియగు యాంజనేయునకు వచ్చిన పాత్ర గణాధిపుండు దం
పతుల ప్రదర్శనన్ గనిన వాడొక డివ్విధి పల్కె భామతో
నతివరొ! యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్
కుతుకముతోడ చిత్రముల కుంచెనుబట్టి లిఖించు సుందరీ
రిప్లయితొలగించండిమతిచెడి గీయబోకుమిటు మౌఢ్యపు రీతిని పిచ్చిగీతలన్
వితతముగా నుమాపతికి బెబ్బులి వాహన మెట్టులొప్పునో
అతివరొ యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్
కలికిరొ నీయభ్యాసము
రిప్లయితొలగించండిపలుతెరగుల సాగుచుండె పరికింపంగా
నలువకు వాలంబొప్పెను
నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
కలలో గాంచిన వింతను
రిప్లయితొలగించండినలుగురి తో పంచు కొనుచు నవ్వుచు బలి కెన్
బలె బలె చిత్రంబుగ నో
నెలతా!హస్తి ముఖ మాంజ నేయున కొప్పె న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిక్రమాలంకారములో నండి
తొలగించండికం॥ వలచిన ప్రాణమొసఁగుఁ గద
నెలకొనె విఘ్నములఁ బాపు నిర్గుణు ముఖమై
సులభముగ నబ్ధి దాటుట
నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
చం॥ అతులిత ప్రీతి కాంతునకు నాసరఁ బిల్లలకిచ్చు నెవ్వరో
చతురుఁడు రామ భక్తుఁడును సంద్రము దాటెనె లంఘనమ్ముతో
సతతముఁ బాపు విఘ్నముల స్వామి ముఖమ్మును దెల్ప మంటివో
యతివరొ యాంజనేయుఁడు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్
టైపాటు సవరించానండి
కం:కలత బడ సీత, రక్కసి
రిప్లయితొలగించండినెలత యనియె హనుమ మాయ నేర్చెను గరిమన్
చెలగుచు కాయము పెంచెను
నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్”
(హనుమంతుడు ఏమయ్యాడో అని సీత భయపడుతుంటే త్రిజట "అతనికి భయం లేదు.అతడు గరిమా విద్య నేర్చి శరీరం పెంచాడు.అతని ముఖం ఏనుగు ముఖం లాగా కనిపించింది అని చెప్పింది. అణిమ,లఘిమ,గరిమ అనే విద్యలు హనుమంతునికి తెలుసు.)
చం:చతురత తోడ వేసితివొ చక్కనిదౌ నొక భావ చిత్రమున్,
రిప్లయితొలగించండిమతము నెరుంగకే తెలివి మాలిన బొమ్మను వేసినావొ,నా
మతి కది తోచ దయ్యె హనుమంతు, గజానను గల్పినావటే!
అతివరొ యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్
(కొన్ని భావచితాలు ఏదో విచిత్ర్రార్థం లో ఉంటాయి.అలా వేసావో,అసలు హిందూమతం తెలియక వేసావో కానీ ఆంజనేయుడికి ఏనుగు ముఖం పెట్టా వేమిటే!)
ఇలలోఁ గపి ముఖ్యుండు వి
రిప్లయితొలగించండిమల చరితుం డతి బలుండు మారుతి వల దీ
కలవరము కామరూపుఁడు
నెలఁతా హస్తి ముఖ మాంజనేయున కొప్పెన్
సతతము విఘ్న భంగములు సల్పుచు భక్తులఁ గాచు దేవునిన్
నతు లొనరించి గొల్వు మెద నాతిరొ తెల్పిరి యెల్ల వార లిం
గితములు చక్కఁగాను దిలకించు వినాయకుఁ బార్శ్వమందు నో
యతివరొ యాంజనేయునకు హస్తి ముఖం బమరెం గనుంగొనన్
కలగానయ్యెను జిత్రము
రిప్లయితొలగించండిబలువిధములనందగించె వాటిని జూడన్
తళతళలాడుచుఁనచ్చట
నెలఁతా!హస్తిముఖ మాంజనేయున కొప్పెన్
అతివరొ!యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్
రిప్లయితొలగించండిగతిపయ చిత్రముల్గనగ గాంతులతోడనబ్రజ్వరిల్లగా
గతులనుమార్చుభంగినిల కాలునిరూపము తేజరిల్లనౌ
యతులకుసైతమున్మదినిహర్షమునొందనలంకరించిరే