తలచెన్ భళిరా పదాలను ఒకదాని స్థానములో ఒకటిగా మార్చానండి ప్రాసలో అన్నీ ల ఉంటే బాగుంటుందని. తరువాత యతి విషయము మరచిపోయాను. భ యతి ఉండిపోయినదండి. అలా పొరపాటు జరిగిందండి.
కం:తలలును,చేతులు తెగగా తల లైదు, కరంబు లారు, తను వది యొకటే” నిలచెను రావణునకు క్షణ ములలో నాశ్చర్య మొదవ మొలిచిన వాజిన్ (రావణాసురుడు యుద్ధం చేస్తుండగా అతని తలలు చేతులు తెగి ఒక సమయం లో అవి ఐదు, ఇవి ఆరు మాత్రమే ఉన్నాయి కానీ క్షణాలలో అవ్వి మళ్లీ మొలిచాయి.ఇలాంటి కథ ప్రచారం లో ఉంది.విభీషణుడు అసలు గుట్టు చెప్పే దాకా అతడు మరణించ లేదు.)
మ:చలిలో పోరెడు నట్టి వీరవరునిన్ జంపంగ,కాపాడగన్ తలలా యైదు, కరంబు లారు, తనువో, తా నొక్కటే వానికిన్ గల యస్త్రమ్ము మహాప్రణాళికల సంగ్రామమ్ము లో ధైర్యమే ఫలిత మ్మిచు నటంచు నిల్చె కడు దర్పం బొప్ప భీమాకృతిన్ (ఆ సైనికుణ్ని చంపటానికి ఉన్నవి ఐదు తలకాయలు.అనగా ఐదుగురు శత్రువులు.కాపాడటానికి ఉన్నది ఆరు చేతులు.అనగా ముగ్గురు మిత్రులు.అతడు నిరాయుధునిగా శరీరం మాత్రమే ఆయుధం గా ఉన్నాడు.ధైర్యం తో యుద్ధం లో నిలిచాడు.)
సలహాలిడుట కయిదుగురు
రిప్లయితొలగించండితల పండినవారు , మరొక తంత్రములారున్
కలిసి పనిజేయు ప్రభుతకు
దల లైదు కరంబు లారు తను వది యొకటే
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండికలిగినది సరిపడక యా
కలికి నుదరమొక్కటైన కాంక్షయె మీరన్
పలువురి గేలిన్ వానికి
"తల లైదు కరంబు లారు తను వది యొకటే!"
మత్తేభవిక్రీడితము
కలిమిన్ గల్గియు దోచ లోకులను కాంక్షాపూరితుండౌచు నా
కలికిన్ హద్దులు లేక కుక్షి యొకటై! క్రాలంగ వే వేలుగన్
పలు నోళ్లందునఁ బేరు నానెననగన్ వక్రోక్తిఁ గీర్తించుచున్
తలలా యైదు కరంబు లారు తనువో తా నొక్కటే వానికిన్!
బలిమిన్భూమియునాదిభూతములు నాభారంబుశీర్షంబులై
రిప్లయితొలగించండికులుకున్జూపునుగంగకున్సతికి చేకూర్చున్శుభంబర్థమై
కలిమిన్లేదుగనాగులేనగలునక్కాటిన్జటన్ధారియై
తలలాయైదుకరంబులారుగనగా తన్వొక్కటేవానికిన్
శుభోదయం గోవర్ధన్ గారూ!
తొలగించండి'జటాధారియై' అనండి.
నక్కాటిన్సతంబొంటరే
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండితొలినాట వర్ణి గీచెను
కలనముతో చిత్రమొకటి స్కందుండనుచున్
దెలియక, దానిని గాంచగ
తల లైదు కరంబు లారు తను వది యొకటే.
ఇలవేల్పంచును బాలకుండొకడు తానిష్టంబుగా చక్కనౌ
ఫలకమ్మందున వేసిదాచుకొనె నా పంచాననున్ బొమ్మనే
తొలిచిత్రంబని ప్రేర్మితోడ, కనన్ దోషంబు లే దానిలో
తలలా యైదు కరంబు లారు గనఁగాఁ దన్వొక్కటే వానికిన్.
ఖలుడా దైత్యుడు రావణాసురుడు పోగాలంబుఁ జేరంగ శ్రీ
రిప్లయితొలగించండినిలయన్ సీతను దొంగిలింప, మరి వానిన్ సంహరింపంగఁ గో
సల రాజేంద్రుడు త్రెంప చేతులు తలల్ సంగ్రామ మధ్యంబునన్
తలలా యైదు కరంబు లారు గనఁగాఁ దన్వొక్కటే వానికిన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికందంలో 'కన్గొనినన్ + ఇలలో' అన్నపుడు యడాగమం రాదు. "కన్గొనగా నిలలో" అనండి.
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపలు చలన చిత్రములరసి
కలలో భీతావహంబుగా కన్గొనగా
నిలలో కనరాదెచటన్
దల లైదు కరంబు లారు తను వది యొకటే
పలు భీతావహ చిత్రముల్గని సదా భ్రాంతమ్ము నీకేలనే
కలలో నీవు దృశించి నట్టి విధమున్ గన్పించునానెచ్చెలీ
యిలలో వాస్తవ రూపుదాల్చ గలవా యీమాడ్కి దృశ్యంబులే
తలలా యైదు కరంబు లారు తనువో తా నొక్కటే వానికిన్
కలగంటి నిదురయందున
రిప్లయితొలగించండికలలో కనుగొంటి వింత కాయఁపువానిన్
కలవెనిమిది పాదంబులు
తల లైదు కరంబు లారు తను వది యొకటే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలి కాలమ్మున వింతగ
రిప్లయితొలగించండినిలలో జనియించె శిశువు నీ శుని సృష్టి న్
తిల కించ వాని కమ రెన్
తల లైదు కరంబు లారు తను వది యొ క టే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలగంటిన్ కలలోన వింతమనిషిన్ గన్గొంటినో నేస్తమా!
రిప్లయితొలగించండిపలునేత్రంబులు మేనిపైనమరెనే పాదమ్ములన్ జూడఁగా
గలవా ప్రాణికి నాల్గు, వాలమునునే కన్గొంటి చిత్రంబుగా
తలలా యైదు కరంబు లారు గనఁగాఁ దన్వొక్కటే వానికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ మలచఁగఁ బ్రేక్షకులు తనసి
తొలగించండివలచఁగ దర్శకుఁడు చిత్రపు వైవిధ్యతకై
తలచెను ప్రతినాయకునకు
తలలైదు కరంబులారు తనువది యొకటే!
మ॥ మలచన్ బ్రేక్షక యుత్కరమ్ము ఘనసమ్మానమ్ముతోఁ జిత్రమువ్
వలచన్ జానపదమ్మటంచు భళిరా వైవిధ్య మొప్పారఁగన్
దలచెన్ స్ఫూర్తిని దుష్టనాయకునకై తానెంచి యీతీరుగన్
దలలా యైదు కరంబు లారు తనువో తానొక్కటే వానికిన్
ఉత్కరము సమూహము నిఘంటువు సహాయమండి.
తలచెన్ భళిరా పదాలను ఒకదాని స్థానములో ఒకటిగా మార్చానండి ప్రాసలో అన్నీ ల ఉంటే బాగుంటుందని. తరువాత యతి విషయము మరచిపోయాను. భ యతి ఉండిపోయినదండి. అలా పొరపాటు జరిగిందండి.
మూడవ పాదము చివర తానెంచె నీతీరుగన్ అని సవరించడమైనది
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందం రెండవ పాదంలో గణభంగం.
వృత్తంలో 'ప్రేక్షక + ఉత్కరము' అన్నపుడు గుణసంధి.
తెలతెల వాఱిన కేశ
రిప్లయితొలగించండిమ్ములవియు, వినయమ్ము మూర మోడ్చినవియుఁ, దా
నిల కూలినదియు నవిగో
తల లైదు, కరంబు లాఱు, తను వది యొకటే
అలుకం బూని కడింది డెందమున యోధాగ్రేసరుం డత్తఱిన్
బల దర్పమ్మునఁ బోర నుగ్రముగ బీభత్సంపు సంగ్రామపుం
దల మందున్ గణియింపఁ జిక్కినవి సత్యం బెంచి వీక్షింపఁగాఁ
దలలా యైదు కరంబు లాఱు తనువో తా నొక్కటే వానికిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఇల, పంచాయతనంబును
రిప్లయితొలగించండిఫలమిచ్చెడు షణ్మతములు బహు విలసిల్లన్
వెలిగెడు భరతావనికిక
తలలైదు కరంబులారు తనువది యొకటే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలియుగ మందున వింతలు
రిప్లయితొలగించండిబలువిధములగూడియుండి బ్రమదమునిచ్చున్
బళియనునట్లుగ నిదియును
తల లైదు కరంబు లారు తను వది యొకటే”
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిబళిరా యేమని చెప్పనొప్పుదును నబ్బాలున్ దగన్జూడుమా
రిప్లయితొలగించండితలలా యైదు కరంబు లారు తనువో తా నొక్కటే వానికిన్
గలయా యయ్యది సత్యమా చెపుమ యిక్కాలంపుచిత్రంబహో
యిలలో నెక్కడనైనఁజూచితెశశీ!యిట్లుండువానిన్సుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండికం:తలలును,చేతులు తెగగా
రిప్లయితొలగించండితల లైదు, కరంబు లారు, తను వది యొకటే”
నిలచెను రావణునకు క్షణ
ములలో నాశ్చర్య మొదవ మొలిచిన వాజిన్
(రావణాసురుడు యుద్ధం చేస్తుండగా అతని తలలు చేతులు తెగి ఒక సమయం లో అవి ఐదు, ఇవి ఆరు మాత్రమే ఉన్నాయి కానీ క్షణాలలో అవ్వి మళ్లీ మొలిచాయి.ఇలాంటి కథ ప్రచారం లో ఉంది.విభీషణుడు అసలు గుట్టు చెప్పే దాకా అతడు మరణించ లేదు.)
మ:చలిలో పోరెడు నట్టి వీరవరునిన్ జంపంగ,కాపాడగన్
రిప్లయితొలగించండితలలా యైదు, కరంబు లారు, తనువో, తా నొక్కటే వానికిన్
గల యస్త్రమ్ము మహాప్రణాళికల సంగ్రామమ్ము లో ధైర్యమే
ఫలిత మ్మిచు నటంచు నిల్చె కడు దర్పం బొప్ప భీమాకృతిన్
(ఆ సైనికుణ్ని చంపటానికి ఉన్నవి ఐదు తలకాయలు.అనగా ఐదుగురు శత్రువులు.కాపాడటానికి ఉన్నది ఆరు చేతులు.అనగా ముగ్గురు మిత్రులు.అతడు నిరాయుధునిగా శరీరం మాత్రమే ఆయుధం గా ఉన్నాడు.ధైర్యం తో యుద్ధం లో నిలిచాడు.)