19-11-2024 (వారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్”(లేదా...)“క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్”(ఛందోగోపన సమస్య. సూరం శ్రీనివాసులు గారి తిరుపతి అష్టావధానంలో బోరెల్లి హర్ష ఇచ్చినది)
కందంవినతిన్ జేయఁగ శిష్టులు,గొనసాగుచు రాక్షసాలి ఘోరము లెంచన్,దునుమన్ హరిలో చెలరేగిన క్రూరత నిండగ బ్రజ క్షేమంబందున్మత్తేభవిక్రీడితమువినతిన్ జేయఁగ సాధు సత్తములు నిర్వేదాన రక్షింపఁగన్గొనసాగన్ దురితాలి కృత్యములవే ఘోరాతి ఘోరమ్ముగన్దునుమన్ శ్రీహరి సిద్ధమై భువిదిగన్, దుష్టాత్ములున్ జుట్ట, రేగినదౌ క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
సంక్రందననందనుడటవిక్రమమునుఁజూపకుండ వేదనతోడన్వక్రమునౌమాటపలికెనక్రూరతనిండగ ప్రజ క్షేమంబందున్
సరికాదందును వినుమాపరిపాలకులెప్పుడునభి పన్నులె యన్నన్ గరుణింపక శిక్షలలో చిరు క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్.పరిశీలించి వచించుచుంటినిది నాభావంబు నాలించుమాసరికాదందును దోషకారి పయినన్ సౌహార్దమున్ జూపుటేపరిపాలించెడు భూపతుల్ మిగుల కోపంబందు శిక్షింపగా చిరు క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్.
వినుచున్నమ్రతబాధలన్ప్రజల నిర్వేదంబుతాఁజూపకన్కనగానభ్యుదయంబువేగముగనాకాంక్షన్ శుభారంభుడైకినుకన్జూపక కుందకన్నృపుడు తాగేహంపుసభ్యుండునైచెనకన్క్రూరత, నిండగాప్రజలకున్ క్షేమంబుసాధ్యంబగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ ఆక్రోశముతోఁ నుగ్రుల వక్రంపు విధముల సరళిఁ బసిగట్టి సదావిక్రాంతులుగను దునుముటకే క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్(అఖండ యతి తప్పలేదండి)మ॥ కనుచున్ దుష్టుల నుగ్రవాదులనిలన్ జ్ఞానమ్ముతోఁ బాలకుల్వినుచున్ సర్వుల కష్టనష్టములు సంవేదమ్ముకై సర్వదాజనులన్ గావఁగ నుగ్రవాదులు నశించంగన్ మహోద్యుక్తులైకినుకా క్రూరత నిండగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్కినుక క్రోధము సంవేదము సుఖదుఃఖాలను తెలిసికొనుట నిఘంటువు సహాయమండిమొదట శార్దూలమనుకున్నానండి పిదప జంధ్యాల సుబ్బులక్ష్మి గారు ఫోన్ చేయగా మ॥ శా॥ కవలలే కనుక మ॥ లో ప్రాసాక్షరమునకు వెసులు బాటుంటుందని మారినానండి
కందము మొదటి పదము ఆక్రోశముతో తరువాతనున్న ఁ అవసరము లేదండి పొరపాటు
ఇడుమల నొసగెడి దుష్టులకెడ క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్నడయాడెదరన సత్యమె ,చెడుకార్యము లేదినమున జెలరేగవుగా
అక్రూరత్వపు విభుడేసక్రమమగువిధి జనులకు సంశ్రయమిడగానక్రమముల నెపుడున్ ద్రుం చే క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్పరిపాలించు మహత్తులోఁ బ్రజలకే ప్రాధాన్యతన్ గూర్చుచున్బరిరక్షింతురు హద్దులన్ బ్రభువులే ప్రాబల్యమున్ జూపుచున్గరుణన్ వీడి మహీక్షితుండు ఖలులన్ ఖండించు చిత్తంబు సుస్థిరమై క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
శార్దూలము:కారుణ్యంబది యేలకో రిపులపై! క్ష్మాభృత్తు చౌహాను పృద్వీరాజ్ యుద్ధమునందు గెల్చియు క్షమా భిక్షన్ ప్రసాదించడేఘోరీకిన్! మరి వెన్క వాడు కనులన్ గ్రుచ్చెన్ గదా! శాత్రవుల్సేరం గ్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్!!
దనుజుల్ రెచ్చిలి లోకకంటకులుగా దారాడ నుర్వీస్థలిన్మనుజుల్ క్లేశములందుచిక్కుకొని సమ్మానమ్ము గోల్పోవగన్తనశూరత్వము జూపి వీరవరుఁడుద్ఘాటింప దౌష్ట్యంబు హెచ్చినదౌ క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
దనుజ గుణము చెలరేగఁగమనుజులలో మానవతయె మాయంబగుగామనుజుల మనమున నశియించిన క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
కం:మును లై శాంతి యనక, దుర్జనులౌ నీ తీవ్రవాద రాక్షసుల వడిన్దునుమగ మన సైనిక పన్ క్తిని క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
మ:ఘన మౌనీంద్రులు, మీ యహల్య పరునిన్ కామించె నం చెంచి చెయ్యన శాపమ్ము నొసంగ పాడియె ?యనూహ్యమ్మైన దోషాన చిక్కిన నన్నున్ క్షమియించి శాపపు విముక్తిన్ జూపరే? మౌని పంక్తిని నక్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్(మహర్షి యైన గౌతముడు తనను శపించగా మౌనులకి ఇంత క్రూరత్వమా?మీరు అక్రూరులు గా ఉంటే ప్రజలకు క్షేమం. నాకు శాపవిముక్తి చెప్పండి అని అహల్య ప్రార్థించింది.)
సక్రమ పధ్ధతి ని గలిగి విక్రమ మున జెడును జంపు వీరుండ గు చున్ వక్రపు బుద్ధిని మాన్పుట కే క్రూర త నిండగ ప్రజకు క్షే మం బందు న్
జనులకు నబ్బునె సౌఖ్యము మనముల కెట్లబ్బు శాంతి మాత్సర్యమునన్ ఘన శాంతి, సమసి యా వెలసిన క్రూరత, నిండఁగఁ బ్రజ క్షేమం బందున్ కృత సత్కార్య ముదాత్ము లై వినుత సంతృప్తాత్ములై సన్నుతోన్నత విద్యాధిక కీర్తిమంతు లయి నానా వర్ణ సన్మార్గులై సతతం బింపుగ ధర్మ తత్పరులునై శాంతాత్ములై వర్తిలన్ క్షితి నక్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యం బగున్
కందం
రిప్లయితొలగించండివినతిన్ జేయఁగ శిష్టులు,
గొనసాగుచు రాక్షసాలి ఘోరము లెంచన్,
దునుమన్ హరిలో చెలరే
గిన క్రూరత నిండగ బ్రజ క్షేమంబందున్
మత్తేభవిక్రీడితము
వినతిన్ జేయఁగ సాధు సత్తములు నిర్వేదాన రక్షింపఁగన్
గొనసాగన్ దురితాలి కృత్యములవే ఘోరాతి ఘోరమ్ముగన్
దునుమన్ శ్రీహరి సిద్ధమై భువిదిగన్, దుష్టాత్ములున్ జుట్ట, రే
గినదౌ క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
సంక్రందననందనుడట
రిప్లయితొలగించండివిక్రమమునుఁజూపకుండ వేదనతోడన్
వక్రమునౌమాటపలికె
నక్రూరతనిండగ ప్రజ క్షేమంబందున్
రిప్లయితొలగించండిసరికాదందును వినుమా
పరిపాలకులెప్పుడునభి పన్నులె యన్నన్
గరుణింపక శిక్షలలో
చిరు క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్.
పరిశీలించి వచించుచుంటినిది నాభావంబు నాలించుమా
సరికాదందును దోషకారి పయినన్ సౌహార్దమున్ జూపుటే
పరిపాలించెడు భూపతుల్ మిగుల కోపంబందు శిక్షింపగా
చిరు క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్.
వినుచున్నమ్రతబాధలన్ప్రజల నిర్వేదంబుతాఁజూపకన్
రిప్లయితొలగించండికనగానభ్యుదయంబువేగముగనాకాంక్షన్ శుభారంభుడై
కినుకన్జూపక కుందకన్నృపుడు తాగేహంపుసభ్యుండునై
చెనకన్క్రూరత, నిండగాప్రజలకున్ క్షేమంబుసాధ్యంబగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ ఆక్రోశముతోఁ నుగ్రుల
తొలగించండివక్రంపు విధముల సరళిఁ బసిగట్టి సదా
విక్రాంతులుగను దునుముట
కే క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
(అఖండ యతి తప్పలేదండి)
మ॥ కనుచున్ దుష్టుల నుగ్రవాదులనిలన్ జ్ఞానమ్ముతోఁ బాలకుల్
వినుచున్ సర్వుల కష్టనష్టములు సంవేదమ్ముకై సర్వదా
జనులన్ గావఁగ నుగ్రవాదులు నశించంగన్ మహోద్యుక్తులై
కినుకా క్రూరత నిండగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
కినుక క్రోధము సంవేదము సుఖదుఃఖాలను తెలిసికొనుట నిఘంటువు సహాయమండి
మొదట శార్దూలమనుకున్నానండి పిదప జంధ్యాల సుబ్బులక్ష్మి గారు ఫోన్ చేయగా మ॥ శా॥ కవలలే కనుక మ॥ లో ప్రాసాక్షరమునకు వెసులు బాటుంటుందని మారినానండి
కందము మొదటి పదము ఆక్రోశముతో తరువాతనున్న ఁ అవసరము లేదండి పొరపాటు
తొలగించండిఇడుమల నొసగెడి దుష్టుల
రిప్లయితొలగించండికెడ క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
నడయాడెదరన సత్యమె ,
చెడుకార్యము లేదినమున జెలరేగవుగా
అక్రూరత్వపు విభుడే
రిప్లయితొలగించండిసక్రమమగువిధి జనులకు సంశ్రయమిడగా
నక్రమముల నెపుడున్ ద్రుం
చే క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
పరిపాలించు మహత్తులోఁ బ్రజలకే ప్రాధాన్యతన్ గూర్చుచున్
బరిరక్షింతురు హద్దులన్ బ్రభువులే ప్రాబల్యమున్ జూపుచున్
గరుణన్ వీడి మహీక్షితుండు ఖలులన్ ఖండించు చిత్తంబు సు
స్థిరమై క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
శార్దూలము:
రిప్లయితొలగించండికారుణ్యంబది యేలకో రిపులపై! క్ష్మాభృత్తు చౌహాను పృ
ద్వీరాజ్ యుద్ధమునందు గెల్చియు క్షమా భిక్షన్ ప్రసాదించడే
ఘోరీకిన్! మరి వెన్క వాడు కనులన్ గ్రుచ్చెన్ గదా! శాత్రవుల్
సేరం గ్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్!!
దనుజుల్ రెచ్చిలి లోకకంటకులుగా దారాడ నుర్వీస్థలిన్
రిప్లయితొలగించండిమనుజుల్ క్లేశములందుచిక్కుకొని సమ్మానమ్ము గోల్పోవగన్
తనశూరత్వము జూపి వీరవరుఁడుద్ఘాటింప దౌష్ట్యంబు హె
చ్చినదౌ క్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
దనుజ గుణము చెలరేగఁగ
రిప్లయితొలగించండిమనుజులలో మానవతయె మాయంబగుగా
మనుజుల మనమున నశియిం
చిన క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
కం:మును లై శాంతి యనక, దు
రిప్లయితొలగించండిర్జనులౌ నీ తీవ్రవాద రాక్షసుల వడిన్
దునుమగ మన సైనిక పన్
క్తిని క్రూరత నిండఁగఁ బ్రజ క్షేమంబందున్
మ:ఘన మౌనీంద్రులు, మీ యహల్య పరునిన్ కామించె నం చెంచి చె
రిప్లయితొలగించండియ్యన శాపమ్ము నొసంగ పాడియె ?యనూహ్యమ్మైన దోషాన చి
క్కిన నన్నున్ క్షమియించి శాపపు విముక్తిన్ జూపరే? మౌని పం
క్తిని నక్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యంబగున్
(మహర్షి యైన గౌతముడు తనను శపించగా మౌనులకి ఇంత క్రూరత్వమా?మీరు అక్రూరులు గా ఉంటే ప్రజలకు క్షేమం. నాకు శాపవిముక్తి చెప్పండి అని అహల్య ప్రార్థించింది.)
సక్రమ పధ్ధతి ని గలిగి
రిప్లయితొలగించండివిక్రమ మున జెడును జంపు వీరుండ గు చున్
వక్రపు బుద్ధిని మాన్పుట
కే క్రూర త నిండగ ప్రజకు క్షే మం బందు న్
జనులకు నబ్బునె సౌఖ్యము
రిప్లయితొలగించండిమనముల కెట్లబ్బు శాంతి మాత్సర్యమునన్
ఘన శాంతి, సమసి యా వెల
సిన క్రూరత, నిండఁగఁ బ్రజ క్షేమం బందున్
కృత సత్కార్య ముదాత్ము లై వినుత సంతృప్తాత్ములై సన్నుతో
న్నత విద్యాధిక కీర్తిమంతు లయి నానా వర్ణ సన్మార్గులై
సతతం బింపుగ ధర్మ తత్పరులునై శాంతాత్ములై వర్తిలన్
క్షితి నక్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యం బగున్