7, నవంబర్ 2024, గురువారం

సమస్య - 4936

8-11-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె”

(లేదా...)

“హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై”

21 కామెంట్‌లు:

  1. రామువేడిన పాటలో రసమునొలికె
    జేసి దాసుని కంపెనీ జీవముండె
    మతము లేనిది కళయయ్యె మానితముగ
    త్యాగరాజేసుపైన కీర్తనలు వ్రాసె

    రిప్లయితొలగించండి
  2. ఏసుయని పిలచినగాని యీశుడనుచు
    పిలచిననుగాని దైవమే , పేరు లోన
    యేమికలదని బాలకుడిటుల బలికె
    "త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె"

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    పేరు గన్నట్టి బాణీలు ప్రియమటంచు
    వారలు మతప్రచారమ్ము వాసిఁ గాంచ
    వీఁక పేరడీలల్లిరి! కాక యెపుడు
    త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె?

    చంపకమాల
    నుతులును గన్న రీతులవె నోళ్లను నానుట నెంచి వారలున్
    జతుల మతప్రచారమున సర్వులు మెచ్చగ పేరడీలవే
    కుతుకము మీర గూర్చిరయ! కోసలరాముని పైనఁ గాక యే
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై?

    రిప్లయితొలగించండి
  4. వితములెరుంగ లేక ఘన వేదములందున నుండెనేసనున్
    వెతకగ నేసుక్రీస్తుడు భవిష్యపురాణమునందునుండనున్
    జతనిడ బోడిగుండుకును జానువుకున్ మరి వారు పల్కరే
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై!!

    రిప్లయితొలగించండి
  5. గాన మాధుర్య మున దేలు కమ్మ నైన
    కృతులు రచియించి మిక్కిలి కీర్తి నందె
    త్యాగ రా జేసు పైన కీ ర్త నలు వ్రాసె
    ననుట నుచి తమ్ము గాదందు రార్యు లవని

    రిప్లయితొలగించండి

  6. త్యాగరాజు కీర్తనల కతడు సరయగు
    పేరడీలరచించి చెప్పెననృతమును
    సహచరునితోడ గతమందె చక్కగాను
    త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె.


    మతమును వ్యాప్తిజేసి పలు మన్నన లందు కొనంగనెంచి స్నే
    హితుడగు పేరడీ కృతులనింపుగ వ్రాసెడి వాడొకండు పూ
    ర్వతనపు పాట నొక్కటిని వ్రాయగ గాంచి వచించె నిట్టులన్
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై.

    రిప్లయితొలగించండి
  7. అతఁడు క్రైస్తవ భక్తుఁడు త్యాగరాజు
    కవితలల్లును కీర్తనల్ కథలు వ్రాయు
    యేసునాథుని పూజింప నిష్టపడుచు
    త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె

    రిప్లయితొలగించండి
  8. అతఁడొక క్రైస్తవుండు కవనంబులు వ్రాసెడు త్యాగరాజు తా
    నతులిత భక్తితో కవితలల్లుచునుండును యేసునాథుపై
    సతతము యేసు భక్తవర సంగతమందున గూడి వారికై
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసు క్రీస్తుపై

    రిప్లయితొలగించండి
  9. తే॥ త్యాగరాజు కృతుల రాగ తాళ గతులు
    మేళవించి క్రీస్తు చరిత మెఱియు నటుల
    వ్రాయఁగ నెవరొ మూర్ఖులు పలుకఁ దగును
    త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె

    చం॥ అతులిత రాగమాధురిని హాయినిఁ గూర్చును తాళబద్ధమై
    కృతులవి త్యాగరాజు వని కీర్తన లెన్నియొ క్రీస్తుపై వచిం
    చి తనియ నెవ్వరో వినుచుఁ జేసిరి మూర్ఖులు నిట్లు టిప్పణిన్
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగనేసుక్రీస్తుపై

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. తే.గీ:హిందు మతమును,కులము ద్యజించి రామ
      రాజు క్రైస్తవమున జేరి రమ్య మైన
      కృతుల మార్చుచు రామున్ త్యజించినట్టి
      త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె”
      (వాడి పేరు రామ రాజు.తన కులాన్ని,మతాన్ని,రాముణ్ని త్యజించిన త్యాగ రాజు అనేది వ్యంగ్యం.త్యాగం చేసాడు కనుక వీడొక త్యాగ రాజు.)

      తొలగించండి
  11. తే.గీ; త్రాగుబోతు రా జీరీతి వాగ సాగె
    "త్రాగి పాడెడు వాడె పో త్యాగ రాజు
    త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె
    హిందువులు రాము పేర మార్పించి నారు"
    (తాగి పాడతాడు కాబట్టి త్యాగ రాజు అని అర్థం తయారు చేసాడు.)

    రిప్లయితొలగించండి
  12. చం:సతతము రామభక్తి యొక సాధనగా గ్రహియించి యెన్నియో
    కృతులను భక్తి మార్గమున కే యొక వన్నెగ జేసి ధాత్రికిన్
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ, నేసుక్రీస్తుపై
    యతనిని వోలె వ్రాయుటకు నాత్రత జూపుచు నుంద్రు క్రైస్తవుల్.
    (ఈ మధ్య క్రైస్తవులు కర్నాటకసంగీతం లో క్రైస్తవ కీర్తనలు వ్రాయటం ప్రారంభించారు.)

    రిప్లయితొలగించండి
  13. ధీ వరేణ్యుండు సంగీత కోవిదుండు
    నప్ర మేయాంధ్ర భాషైక సుప్రసిద్ధ
    పండితుండు వాగ్గేయకారుండు నేఁటి
    త్యాగరా జేసు పైనఁ గీర్తనలు వ్రాసె


    మతముల భేద మించుకయు మానస మందుఁ దలంపకుండ నే
    గతిఁ బొగడంగ వచ్చుఁ గృతి కర్తను విత్తము కోరకుండ నేఁ
    డతులము సేసి గీతముల త్యాగము సార్థక నామధేయుఁడై
    హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై

    రిప్లయితొలగించండి
  14. బాల్య మాదిగ వ్రాసెను పాటలెన్నొ
    దాశరథి పైన స్వయముగా తన్మయతన
    *త్యాగరాజేసుపైనకీర్తనలు వ్రాసె*
    నట్టి పేరు కలిగనట్టి నర్భకుండు

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    దాశరథి పైన భక్తితత్పరత తోడ
    మున్ను పాటలు,కీర్తనలెన్నొ వ్రాసె
    త్యాగరా; జేసు పైన కీర్తనలు వ్రాసె
    చక్కగా క్రైస్తవుడు వారి శైలి లోన.

    రిప్లయితొలగించండి