6, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4935

7-11-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్”

(లేదా...)

“జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్”

12 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      అనయము శిష్టులఁ గావఁగ
      దనుజుల దండింపఁగ నవతారము లెత్తన్
      మునిజనవందితునకు దు
      ర్జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్

      మత్తేభవిక్రీడితము
      వినుతుల్ సేయఁగ శిష్టులున్ శరణమన్ విశ్వాస మేపారఁగన్
      దనుజానీకముఁ గూల్చఁగన్ దిగుచుఁ దా దండించు రూపమ్మునన్
      మునిసంఘంబులు భక్తితోఁ గొలుచు నంభోజాక్షు సర్వేశు దు
      ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్

      తొలగించండి
  2. జనులకు నండగ నిల్చియు
    మునుకొని కాపాడ దలచి భూరి మగటి మిన్
    ఘన హిత కారి యు నౌ దు
    ర్జ న నాశ కునకు నొ నర్త్రు సన్నుతు లెపు డున్

    రిప్లయితొలగించండి
  3. అనరు గలిగించు చుండగ
    మనకేమని విడువకుండ మరుసటి దినమే
    ఘనముగ శిక్షించెడి కు
    జన , నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్

    రిప్లయితొలగించండి
  4. పనిగొనిరక్కసుడంతట
    తనయునిబెట్టగనిడుములు ధరణినిగావన్
    తునియలు జేసిన యైదు
    రాజు నాశమునకు నొనర్తు సన్నుతులెపుడున్

    రిప్లయితొలగించండి
  5. తునియలుజేసినయాదు
    ర్జననాశకునకునొనర్తుసన్నుతులెపుడున్

    రిప్లయితొలగించండి
  6. చెనఁటుల దుర్మార్గంబునుఁ
    జెనకుచు సజ్జనుల రక్ష సేయుచు నెలమిన్
    జనహితమును గోరెడు దు
    ర్జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్

    రిప్లయితొలగించండి
  7. జనముల్బాంధవులంచుమానసములోజాతంపుభీతిన్వడిన్
    పెనుశోకంబున పార్థుడంతటను గాంభీర్యంబునే వీడును
    తనియన్జేసెగకృష్ణుడాతఱిని నిత్యంబేదిలేదంచు, దు
    ర్జన విధ్వంసకుకు డైన వానికి నమస్కారమ్ములందించెదన్

    రిప్లయితొలగించండి
  8. చెనఁటుల్ సల్ఫెడు దుష్కృతమ్ములెపుడున్ జెండాడుచున్ ధీరుడై
    జన బాహుళ్యఁపు రక్షనంచితముగా సల్పంగ సంసిద్ధుడై
    జెనకన్ దుర్మతులన్ వ్యధార్తులకు సంక్షేమంబు గల్పింప దు
    ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్

    రిప్లయితొలగించండి

  9. ముని యాగము రక్షింపగ
    దనుజుల దునుమాడి సతము ధర్మమ్మును ధా
    త్రినిలుప ధర్మవిరోధ కు
    జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్”*


    మనుజుండై ధర బుట్టి ధర్మమును సమ్మానించెడిన్ వాడెయై
    జనకుండాడిన మాటకోసమయి రాజ్యమ్మున్ విడద్రోచుచున్
    వనవాసమ్మున ధర్మదూరులగు కవ్యాదుండ్రె యైనట్టి దు
    ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్.

    రిప్లయితొలగించండి
  10. తన గళముననిల్పి గరము
    జనహితమును గోరు వాడు శంకరుడేగా
    వినయంబుతోడ నే కం
    జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్

    తనదేహంబుననర్థభాగమిడెగా దాక్షాయనీమాతకున్
    జనసంక్షేమముకై కలాకులము నాస్వాదించె నిర్భీతిగా
    తనపై వాడిశరంబులన్ విడువగా దండింపగానెంచి కం
    జన విధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్

    [కంజనుడు = మన్మథుడు]

    రిప్లయితొలగించండి