16, నవంబర్ 2024, శనివారం

సమస్య - 4944

17-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి”
(లేదా...)
“సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా”

12 కామెంట్‌లు:

  1. పెద్దలసభలో గనరాదు పెద్దరికము
    బుద్ది కుశలత లోపించి పోరుచుంద్రు
    కొద్ది సం యమనము లేక గుద్దులాడి
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి

    పెద్దలు కొల్వుతీరిరటఁ బెంపువహింపగ రాష్ట్ర మండలిన్
    గొద్దిగ నుందురందుగనఁ గోమలమౌ నుడికారమొప్పగా
    బుద్ధివిహీనులాయనెడు పోకడలే గమనింతురందరున్
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా

    రిప్లయితొలగించండి
  2. కల్లలను బల్కు వా రౌ చు కావరమున
    పరుల దోచేడు నీచులై పాల సులయి
    నేత లై వేదిక ల నెక్కి నీతి పాఠ
    సుద్ధులను జెప్పు పెద్దల జూచి నగిరి

    రిప్లయితొలగించండి
  3. ప్రతి దినమునందు బిలచి పలుతడవల
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి
    యర్భకులు , దలచిరవి చలుపుట
    వలననే వారి నెరకలు పండెననుచు

    రిప్లయితొలగించండి

  4. వలువ కాషాయమున్ దాల్చి పరమ సాధు
    సత్పురుషులమనుచు చెప్పి చాటు గాను
    పాపియై చరియించుచు ప్రజల కెపుడు
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి.


    వద్దని చెప్పినన్ వినక స్వాదురసమ్మదె యింపటంచు ము
    ప్పొద్దుల గ్రోలువాడు పరపుష్టల జేరుచు పొందు కోరెడిన్
    గద్దరులైన దుర్భరులు కావిదుకూలములన్ ధరించి పల్
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    గద్దెనెక్కినది మొదలు గతికి సిరుల
    చట్టమును మీరి చరియించి చతికిలబడి
    ప్రజల ఛీత్కారమున జారి పదవులూడ
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి!


    ఉత్పలమాల
    గద్దెను కాలుమోపినది కమ్మగ మ్రెక్కుటకంచు దోచెడున్
    విద్దెయు దక్క దేనికిని విజ్ఞత జూపని పందికొక్కులై
    వద్దుర మాకు వీరలని పంపిన న్యాయము ధర్మమంచు యీ
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా!

    రిప్లయితొలగించండి
  6. వద్దనె యుండె పాలనము వారిది కాదె సుమా దశాబ్దముల్!
    వద్దన గల్గువారలట వారికినుండిరె బాగుఁ జేసినన్!
    ముద్దుగ ముచ్చటల్ బలికి మోసముఁ జేయరె? నమ్మశక్యమే!!
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా!!

    రిప్లయితొలగించండి
  7. తలలు పండిన పెద్దలు తలపులందు
    పిన్నవారల కన్నను చిన్నవారు
    సంచితమ్ముగ మదినింపి సంకుచితము
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి

    రిప్లయితొలగించండి
  8. పెద్దలువారు ప్రాయమున బిల్లల పోకడ మానసంబునన్
    పెద్దగ నీతివాక్యముల ప్రేలుచునుందురు చేతలందునన్
    బుద్ధివిహీనతన్ గలిగి మూర్ఖులవోలె మెలంగుచుందురా
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా

    రిప్లయితొలగించండి
  9. తే॥వద్దనుచు మద్యపానము పరిణతిఁ గన
    ముద్దనుచు జూదము వదల మోదమనుచు
    నెద్దులకు మొద్దులకుఁ దెల్ప నేమి జరిగె
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి

    ఉ॥ వద్దన మద్యపానమును బాలనఁ జేసెడి కాలమే సఖా!
    ముద్దన మాని జూదమును మోదము నొందఁగ విందురే కనన్
    మొద్దుల కెంత తెల్పినను మోమును ద్రిప్పుచుఁ దూలనాడరే!
    సుద్దులఁ జెప్పు పెద్దలను జూచి జనుల్ పరి హాసమాడరా!

    నేటి తరములో త్రాగుట మరీ సమాన్యమైనదండి. పెద్దలు త్రావి పాడైనవారి గురించి ఎంత తెలిపినా కంఠశోషే!
    కొన్ని రోజులుగా ఊరిలో లేనందున పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి

    రిప్లయితొలగించండి
  10. పెద్దరికము వీక్షింపక వింతగాను
    హద్దు లెఱుగక బాధ్యత నరయకుండఁ
    బెద్ద వారికిఁ దగ నట్టి విధము గాను
    సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి


    మద్ది నిభంపు టంగముల మంచితనమ్మున మోసపుచ్చెడిన్
    విద్దెలఁ బట్టభద్రు లయి వీడి మనమ్ముల నెగ్గు సిగ్గులన్
    గద్దియ కై నిరంతరము కల్లలు కొల్లలు గా వచించుచున్
    సుద్దులఁ జెప్పు పెద్దలను జూచి జనుల్ పరిహాసమాడరా

    రిప్లయితొలగించండి
  11. చదువు సంధ్యలు లేకున్న సతత మిలను
    బుద్ధి వంతుల మాదిరి పుడమి యందు
    సుద్దు లం జెప్పు పెద్దలం చూచినగిరి
    మంచి చెడుల నెరింగిన మాన్యులెల్ల


    నిద్దుర మత్తు తో నెపుడు నిక్కుచు నీల్గుచు సంచరించుచున్
    పెద్దలుమేమెయంచుమరిపెత్తనమెల్లరిపైనచూపుచున్
    బుద్దులు మెండుగాతెలిపి పోవుచునెప్పుడునడ్డదారిలో
    సుద్దులఁ జెప్పు పెద్దలనుఁ జూచి జనుల్ పరిహాసమాడరా

    రిప్లయితొలగించండి