16-11-2024 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”(లేదా...)“చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే”
వడిగనుభోవోద్రిక్తతతడబడుమాటలవిడివడి తప్పులుదొర్లన్బడిలో పాఠముతెలియమిచెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే
కందంబడుగుల సేమము గన మాయడుగులు పడునెపుడనియెడు నభయము నిడుచున్గుడువగ ప్రభుత్వ సిరి దోచెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!మత్తేభవిక్రీడితముబడుగుల్ సేమము నొందగన్ దలఁచి నిస్వార్థాన సేవింప మాయడుగల్ నిత్యము సాగు మాటనిడగా నందింప నేతృత్వమున్గుడువన్ జూచి ప్రభుత్వ బొక్కసమునే కొంగ్రొత్త వైనాల దోచెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే!
కడు వడి హామీ లొస గుచు నడచు కొనక మాట తప్పి నైజ ము తోడ న్ దడ యక ప్రజలను వంచిo చెడు దుర్వార్త వినిన చేష్ట లుడు గరే
బెడిదమగు నాటి దినములనడిగిన వెనువెంట వచ్చి యాదుకొ నంగన్నిడుము విడె వారు మరణించెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”
కడు దీక్షతోడ తిరుమల నడుచుచు చేరంగదలచు నరుల చిరుతయే కడతేర్చ పలువురు వచించెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే. కడు జాగ్రత్తలు చెప్పినన్ వినని నిర్గ్రందుండు యంజానుడై వడిగా వాహనమొక్కటిన్ నడిపెడిన్ బాళమ్మునన్ లోయలో పడగన్ మ్రగ్గిరి నంటులెల్లరనుచున్ బాధించి దుఃఖానముంచెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే.
బుడిబుడి నడకల సంగడివిడివడి యుండిరి గడించ వెడబాటయ్యెన్కడ చూపులని తెలియ కలచెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!!
వడిగనుభోవోద్రిక్తత
రిప్లయితొలగించండితడబడుమాటలవిడివడి తప్పులుదొర్లన్
బడిలో పాఠముతెలియమి
చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే
కందం
రిప్లయితొలగించండిబడుగుల సేమము గన మా
యడుగులు పడునెపుడనియెడు నభయము నిడుచున్
గుడువగ ప్రభుత్వ సిరి దో
చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!
మత్తేభవిక్రీడితము
బడుగుల్ సేమము నొందగన్ దలఁచి నిస్వార్థాన సేవింప మా
యడుగల్ నిత్యము సాగు మాటనిడగా నందింప నేతృత్వమున్
గుడువన్ జూచి ప్రభుత్వ బొక్కసమునే కొంగ్రొత్త వైనాల దో
చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే!
కడు వడి హామీ లొస గుచు
రిప్లయితొలగించండినడచు కొనక మాట తప్పి నైజ ము తోడ న్ దడ యక ప్రజలను వంచిo
చెడు దుర్వార్త వినిన చేష్ట లుడు గరే
బెడిదమగు నాటి దినముల
రిప్లయితొలగించండినడిగిన వెనువెంట వచ్చి యాదుకొ నంగన్
నిడుము విడె వారు మరణిం
చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే”
రిప్లయితొలగించండికడు దీక్షతోడ తిరుమల
నడుచుచు చేరంగదలచు నరుల చిరుతయే
కడతేర్చ పలువురు వచిం
చెడుదుర్వార్తలను వినిన చేష్టలుడుగరే.
కడు జాగ్రత్తలు చెప్పినన్ వినని నిర్గ్రందుండు యంజానుడై
వడిగా వాహనమొక్కటిన్ నడిపెడిన్ బాళమ్మునన్ లోయలో
పడగన్ మ్రగ్గిరి నంటులెల్లరనుచున్ బాధించి దుఃఖానముం
చెడుదుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే.
బుడిబుడి నడకల సంగడి
రిప్లయితొలగించండివిడివడి యుండిరి గడించ వెడబాటయ్యెన్
కడ చూపులని తెలియ కల
చెడు దుర్వార్తలను వినిన చేష్టలుడుగరే!!