11, నవంబర్ 2024, సోమవారం

సమస్య - 4940

12-11-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు”

(లేదా...)

“చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్”

21 కామెంట్‌లు:

  1. చూడమన్మథుడాతఁడుసొబగు నందు
    నీతినేర్వడుకోతియై నిప్పుఁద్రొక్కు
    నిగమశర్మకుభ్రాతయౌ నిక్కమిదియ
    చక్కఁదనమబ్బుగాని ప్రశస్తిరాదు

    రిప్లయితొలగించండి
  2. తల్లిదండ్రులనుండి యందము సుతులకు
    జన్యు కారణణమున వచ్చు సహజముగనె
    వారిరీతి జీవితమును బన్నకున్న
    జక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు

    రిప్లయితొలగించండి
  3. చక్కగపద్యమందమరు ఛందమలంకృతి వృత్తిరీతులున్
    పెక్కుసమాసముల్గనగభేషనిపించుపదంబులున్వడిన్
    ఎక్కదుభావమెప్పగిది యేవిధిఁజూచినమానసంబుకున్
    చక్కఁదనంబుదక్కిన ప్రశస్తిరవంతయురాదు చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... మెప్పగిది నేవిధి" అనండి. 'మానసంబునకున్' అనడం సాధువు.

      తొలగించండి
  4. తేటగీతి
    తండ్రి రూపాన పుట్టిన ధన్యునైన
    నందగాడంచు చూతురు నవనిజనులు
    నే పరోపకారమ్మును చూపఁడనఁగ
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు!

    ఉత్పలమాల
    నిక్కగ తండ్రిరూపమది నిర్మలమై తనకందినంతటన్
    చుక్కలలోని చంద్రుఁడని చూతురు గాని పరోపకారిగా
    నెక్కడ నొక్కటైన స్మరణీయగుణమ్మది లేదులేదనన్
    చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్!

    రిప్లయితొలగించండి

  5. పరుల సొమ్మును దిగమ్రింగు స్వార్థపరులు
    కూడ బెట్టిన సొమ్ముతో కులుక దలచి
    దళపపు నగల జేయించి దాల్చి నంత
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు.


    చక్కగ శాస్త్రముల్ చదివి స్కందుడ వైన యశమ్ము, భోగమం
    దెక్కువ కాంక్షగల్గి ధనమిద్ధర హెచ్చుగ బొంది దానితో
    నక్కర లేని రత్నవర పాభరణమ్ముల దాల్చి నంతటన్
    జక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  6. రూప మందున మదనుని రూపు డ గుచు
    గుణము న o దున మెప్పుకు కొదు వ యగుచు
    మసలు వానిని జూచుచు మనుజు లనిరి
    చక్క దన మబ్బు గాని ప్రశస్తి రాదు

    రిప్లయితొలగించండి
  7. మిక్కుటంబగు కోరిక సొక్కుచుండ
    కలువకంటి వరూధిని గౌగిటన్ ద
    రించ మాయాప్రవరుడు తలంచెనిట్లు
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు

    మిక్కుటమైన కాముకత మేరువునే దలపించుచుండగా
    చక్కనిదౌ వరూధినిని జజ్జర మాటునఁ బొంద సిద్ధమై
    గ్రక్కున నివ్విధిన్ దలచె కాపటియౌ ప్రవరుండు నాత్మలో
    చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్

    రిప్లయితొలగించండి
  8. ముక్కును మూతియున్ నుదురు మోమున చక్కగ లేక యుండినన్
    చక్కగఁ జేయ వచ్చు ఘన శస్త్రచికిత్సల తోడ రూపమున్
    పక్కున నవ్వరే నటన భావము వ్యక్తము కాక యుండినన్
    చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్!!

    రిప్లయితొలగించండి
  9. వాక్కు లందు సుంతయు మృదుత్వమ్ము లేని
    యందగాని కెన్నఁగ విశ్వ మందు మంచి
    వాసన యొకింత లేని పుష్పమ్ము పగిది
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు


    ఎక్కడ నైన విశ్వమున నింతుల కాభరణమ్ము శాంతమే
    చక్కఁగ సద్గుణమ్ము లవి చామకు నక్కట లేకయున్నచో
    వెక్కస మై వెలంది కిల వేద్యమ కాంచన భూషణమ్ములం
    జక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఆత్మసౌందర్యమునుమించి యవనియందు
    లేదుమరియొండు నందము లేమలకును
    మోముపై పెక్కు పూతలు పులుముకొనిన
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు

    రిప్లయితొలగించండి
  12. చక్కనిచుక్క రూపమున చానకు సాటిగరారు యప్సరల్
    మిక్కుటమైన భాగ్యమును మేలగు జీవనశైలి యబ్బగన్
    పెక్కురిపైన మచ్చరము పెంపువహించినదీ కతంబునన్
    చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్

    రిప్లయితొలగించండి
  13. తల్లి దండ్రుల రూపంబు తనయులందు
    ప్రస్ఫుటంబుగఁ గనిపించు బంధమగుట
    మంచి గుణములు వచ్చుట సంశయంబు
    చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు”

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ముఖముపై రంగుల నలది మోజు తీర
    నగలతోడ శరీరము నంత నింప
    చక్కదన మబ్బు గాని ప్రశస్తి రాదు
    వినయమును మగువకు మంచి మనసు లేక.

    రిప్లయితొలగించండి