27, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4955

28-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్”
(లేదా...)
“రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్”

4 కామెంట్‌లు:

  1. నెమ్మనమున శంభుదలచి
    సమ్మతి లోఁజూచిపరము సాధనతోడన్
    బమ్మనుదాటి నిరాకా
    కమ్మును గొనియాడిరిమునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    నమ్ముచు సృష్టి ఘనత నీ
    మమ్ముగ తపమాచరించి యధిదేవునికై
    సమ్మతి కారకునధికా
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    శార్దూలవిక్రీడితము
    నమ్మంగన్ఘన సృష్టి పోకడలనే ధన్యాత్ములై భక్తి నీ
    మమ్ముల్ ధ్యాన తపాల నిష్ఠ 'పరమాత్మ'న్ జూచు సంకల్పమై
    నెమ్మిన్శోధన సత్యముల్ దెలిసి సందేశాదులన్ 'సాధికా
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్'

    రిప్లయితొలగించండి
  3. రమ్మును త్రాగిస శిష్యుడు
    దమ్ము కికురువెట్టి నట్టి తరుణము నందున్
    గమ్మున పట్టినతని బీ
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్

    రిప్లయితొలగించండి

  4. ఇమ్మహినేలు నృపుడు ప
    త్రమ్ములతో తాపసులకు దావము నను తా
    నిమ్ముగ కట్టించు కుటీ
    రమ్మునుఁ గొనియాడిరి మునిరాజులు నెమ్మిన్.


    సమ్మానింతు మునీంద్రులన్ సతము నిస్వార్థమ్ము తో లోక క్షే
    మమ్మున్ గోరెడి వారలంచు నృపుడా మాన్యుండు నిర్మించెనే
    యిమ్మౌ వాసము తానరణ్యమున ప్రత్యేకమ్ముగా నాకుటీ
    రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్.

    రిప్లయితొలగించండి