29-11-2024 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామునితో వైరమది పరమ్మును జేర్చున్”(లేదా...)“రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్”(వాడ్రేవు వేంకట సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
కోమలిసీతనుదెచ్చెనుకామనరావణుడునంతకాంచగ వారినిసేమమునెంచెనుతనకునురామునితోవైరమది పరమ్మునుజేర్చున్
వైరిన్
పామరమున జయ విజయులుకౌమార మునీంద్ర శాపకారణులై ఈభూమిని జనించ వారికిరామునితో వైరమది పరమ్మును జేర్చున్
ప్రవచనకర్త భాష్యము:కందంఆ మాధవి సీతఁ గొనుటదామోదరుఁడిడిన వరము, ద్వారి విజయుఁడేకామి దశాస్యుడు హరియగురామునితో వైరమది పరమ్మును జేర్చున్ఉత్పలమాలభామిని సీత మాధవిగ భావనఁ జేయకె రావణాసురుండామెను దెచ్చు ద్వారి విజయాఖ్యుఁడె! శౌరి వరంపు మర్మమే!కామిగ సేమమున్ మఱచి గర్వము మీరగ పద్మనాభుఁడౌరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కుంభకర్ణుడితో రావణుడు పల్కుట:-భీమము గాగ శాపమది ప్రీతిగ జన్మలు జేసె మూడుగన్క్షేమముఁ గూర్చఁ జంపె తొలి జీవితమందు వరాహ సింహమైభామను దొంగిలించితిని బద్ద విరోధులమైతిమిచ్చటన్రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్!!
పామరు డవైన యట్టి యసామాన్యుని చేత బడుచు శరఘాతముతోనామమడుగ పుణ్యమె శ్రీరామునితో వైరమది పరమ్మును జేర్చున్.శ్యామను బుట్టు ప్రాణులిట శాశ్వతులై మనలేరు గాదుటే యా మహితాత్ము నంబకము లంతము జేయ విముక్తి దక్కదేతామరకంటియే యిలను ధర్మము నిల్పగ పుట్టినట్టి శ్రీరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.తామరకంటి నాడచట తాపసి శాపమెఱంగి జాలితో మీ మరణంబు గోరుచును మృత్యువు ద్వారవిముక్తి నివ్వగా భూమిని పుట్టెనిప్పుడు ప్రమోదము గూడును మీకు నింక శ్రీరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.
ఏమని జెప్పమనెదవోనీమమువిడి నటననైన నెగులును నెరపన్నా మాన్యుడైన తారకరామునితో వైరమది పరమ్మును జేర్చున్
దోమటిగా సీతను గొనిధీమతినే బ్రహరణమున డీకొనియున్నన్గాముకుని గమ్యమొకటేరామునితో వైరమది పరమ్మును జేర్చున్దోమటిగా నయోనిజను దొంగిలి లంకను దాచి యుంచినన్ధీమతి యైన రాఘవుని దీటుగ డీకొని బోరుసల్పినన్గాముకుడైన రావణుని గమ్యము మోక్షము సంతరించుటేరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్[ధీమతి = బుద్ధిశాలి]
తామరసాక్షుఁడైన హరి తా జనియించెను రామభద్రుగాభూమిజ సీతనెత్తుకొని పోవఁగ లంకకు రావణుండు శ్రీరాముఁడు వారిధిన్ గడఁచి రావణుఁ ద్రుంచెను స్వర్ణలంకలోరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
తామరసాక్షుఁడు శ్రీహరిరామునిగా నవతరించి రావణుఁ ద్రుంచెన్రాముడు పరమాత్ముండేరామునితో వైరమది పరమ్మును జేర్చున్
కం॥ నేమము భక్తిశ్రద్ధలుధామముఁ జేర్చఁగ రిపులుగఁ దలచుచును సదాస్వామియె వధించఁ జేరరెరామునితో వైరమది పరమ్మును జేర్చున్ఉ॥ స్వామినిఁ జేరు దారులవి సాదర భావము భక్తినిష్ఠలున్ధామముఁ జేర్చ వైరిగను దల్చుచు నిత్యము సజ్జనాళికిన్నేమము దప్పి హంసనిడ నేతయె త్రుంచఁగఁ బొందవచ్చునేరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్నేత విష్ణువు నిఘంటువు సహాయమండి. విరోధులుగా వారు చేసిన పాప కార్యములు సజ్జనులను భక్తులను హింసుచుటే కదండి!
రామ విరోధిని నింద్రుండా ముక్కంటి మఱి బ్రహ్మ యైనను గట్టానీ మహిఁ గావ నశక్యులె రామునితో వైర మది పరమ్మును జేర్చున్ [ బ్రహ్మా స్వయమ్భూశ్చతురాననో వా రుద్రస్త్రిణేత్రస్త్రిపురాన్తకో వా.ఇన్ద్రో మహేన్ద్రస్సురనాయకో వా త్రాతుం న శక్తా యుధి రామవధ్యమ్৷৷ వా.రా. 5.51.45] రాముఁడు విష్ణువే ధర నరప్రవరుండు వికుంఠవాసుఁడే ధామ సురక్షకుల్ పతిత ధర్ములు రావణ కుంభకర్ణులే నీమము తప్పఁ బుట్టి రిట నేల గణింపఁగ శాపముక్తికైరామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
తామస హరుని త లంచుచు నీమము నన్ భక్తి తోడ నిర్మల మతు లై ధీమతి వ్యాజ స్తు తి గా రాముని తో వైర మది పర మ్ము ను జేర్చున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.(రావణుడికి విభీషణుని ఉద్బోధ)నీమమును దప్పి సీతనుతామసమున దెచ్చినావు తంటాలెదురౌసామాన్యుడు కాదట శ్రీరామునితో వైరమది పరమ్మును జేర్చున్.
నేమము తప్పుచు నసురుడుతా ముని వలె వేగమెచని తరుణీ మణినేపామరుడై బంధించగరాముని తో వైరమది పరమ్మున చేర్చున్
కోమలిసీతనుదెచ్చెను
రిప్లయితొలగించండికామనరావణుడునంతకాంచగ వారిని
సేమమునెంచెనుతనకును
రామునితోవైరమది పరమ్మునుజేర్చున్
వైరిన్
రిప్లయితొలగించండిపామరమున జయ విజయులు
రిప్లయితొలగించండికౌమార మునీంద్ర శాపకారణులై ఈ
భూమిని జనించ వారికి
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
ప్రవచనకర్త భాష్యము:
రిప్లయితొలగించండికందం
ఆ మాధవి సీతఁ గొనుట
దామోదరుఁడిడిన వరము, ద్వారి విజయుఁడే
కామి దశాస్యుడు హరియగు
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
ఉత్పలమాల
భామిని సీత మాధవిగ భావనఁ జేయకె రావణాసురుం
డామెను దెచ్చు ద్వారి విజయాఖ్యుఁడె! శౌరి వరంపు మర్మమే!
కామిగ సేమమున్ మఱచి గర్వము మీరగ పద్మనాభుఁడౌ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుంభకర్ణుడితో రావణుడు పల్కుట:-
రిప్లయితొలగించండిభీమము గాగ శాపమది ప్రీతిగ జన్మలు జేసె మూడుగన్
క్షేమముఁ గూర్చఁ జంపె తొలి జీవితమందు వరాహ సింహమై
భామను దొంగిలించితిని బద్ద విరోధులమైతిమిచ్చటన్
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్!!
పామరు డవైన యట్టి య
రిప్లయితొలగించండిసామాన్యుని చేత బడుచు శరఘాతముతో
నామమడుగ పుణ్యమె శ్రీ
రామునితో వైరమది పరమ్మును జేర్చున్.
శ్యామను బుట్టు ప్రాణులిట శాశ్వతులై మనలేరు గాదుటే
యా మహితాత్ము నంబకము లంతము జేయ విముక్తి దక్కదే
తామరకంటియే యిలను ధర్మము నిల్పగ పుట్టినట్టి శ్రీ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.
తామరకంటి నాడచట తాపసి శాపమెఱంగి జాలితో
మీ మరణంబు గోరుచును మృత్యువు ద్వారవిముక్తి నివ్వగా
భూమిని పుట్టెనిప్పుడు ప్రమోదము గూడును మీకు నింక శ్రీ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.
ఏమని జెప్పమనెదవో
రిప్లయితొలగించండినీమమువిడి నటననైన నెగులును నెరపన్
నా మాన్యుడైన తారక
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
దోమటిగా సీతను గొని
రిప్లయితొలగించండిధీమతినే బ్రహరణమున డీకొనియున్నన్
గాముకుని గమ్యమొకటే
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
దోమటిగా నయోనిజను దొంగిలి లంకను దాచి యుంచినన్
ధీమతి యైన రాఘవుని దీటుగ డీకొని బోరుసల్పినన్
గాముకుడైన రావణుని గమ్యము మోక్షము సంతరించుటే
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
[ధీమతి = బుద్ధిశాలి]
తామరసాక్షుఁడైన హరి తా జనియించెను రామభద్రుగా
రిప్లయితొలగించండిభూమిజ సీతనెత్తుకొని పోవఁగ లంకకు రావణుండు శ్రీ
రాముఁడు వారిధిన్ గడఁచి రావణుఁ ద్రుంచెను స్వర్ణలంకలో
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
తామరసాక్షుఁడు శ్రీహరి
రిప్లయితొలగించండిరామునిగా నవతరించి రావణుఁ ద్రుంచెన్
రాముడు పరమాత్ముండే
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
కం॥ నేమము భక్తిశ్రద్ధలు
రిప్లయితొలగించండిధామముఁ జేర్చఁగ రిపులుగఁ దలచుచును సదా
స్వామియె వధించఁ జేరరె
రామునితో వైరమది పరమ్మును జేర్చున్
ఉ॥ స్వామినిఁ జేరు దారులవి సాదర భావము భక్తినిష్ఠలున్
ధామముఁ జేర్చ వైరిగను దల్చుచు నిత్యము సజ్జనాళికిన్
నేమము దప్పి హంసనిడ నేతయె త్రుంచఁగఁ బొందవచ్చునే
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
నేత విష్ణువు నిఘంటువు సహాయమండి.
విరోధులుగా వారు చేసిన పాప కార్యములు సజ్జనులను భక్తులను హింసుచుటే కదండి!
రామ విరోధిని నింద్రుం
రిప్లయితొలగించండిడా ముక్కంటి మఱి బ్రహ్మ యైనను గట్టా
నీ మహిఁ గావ నశక్యులె
రామునితో వైర మది పరమ్మును జేర్చున్
[ బ్రహ్మా స్వయమ్భూశ్చతురాననో వా
రుద్రస్త్రిణేత్రస్త్రిపురాన్తకో వా.
ఇన్ద్రో మహేన్ద్రస్సురనాయకో వా
త్రాతుం న శక్తా యుధి రామవధ్యమ్৷৷ వా.రా. 5.51.45]
రాముఁడు విష్ణువే ధర నరప్రవరుండు వికుంఠవాసుఁడే
ధామ సురక్షకుల్ పతిత ధర్ములు రావణ కుంభకర్ణులే
నీమము తప్పఁ బుట్టి రిట నేల గణింపఁగ శాపముక్తికై
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్
తామస హరుని త లంచుచు
రిప్లయితొలగించండినీమము నన్ భక్తి తోడ నిర్మల మతు లై
ధీమతి వ్యాజ స్తు తి గా
రాముని తో వైర మది పర మ్ము ను జేర్చున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
(రావణుడికి విభీషణుని ఉద్బోధ)
నీమమును దప్పి సీతను
తామసమున దెచ్చినావు తంటాలెదురౌ
సామాన్యుడు కాదట శ్రీ
రామునితో వైరమది పరమ్మును జేర్చున్.
నేమము తప్పుచు నసురుడు
రిప్లయితొలగించండితా ముని వలె వేగమెచని తరుణీ మణినే
పామరుడై బంధించగ
రాముని తో వైరమది పరమ్మున చేర్చున్