మ:వశమం దుండెను శిష్య యంచు భ్రమలో పాటింపకే నీమముల్ శిశువుల్ వారని యెంచ సద్గురువు తా శీలమ్ము గోల్పోయి కా ముశరమ్మున్ భరియింప లేకయు ముగింపున్ లేని శైత్యాన నా శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై (అది శిశిరమే ఐనా ఇంకా హేమంతపు చలి తగ్గ లేదు. ఆ గురువు యొక్క ఒక శిష్యురాలు ఒక శిష్యుని తో కలిసింది.)
కందం
రిప్లయితొలగించండిదశనెరుగక విద్యార్థిగ
నిశితఁపు దృష్టి గురుసతియె నీమము దప్పన్
వశపడ సైగలు సేయు శ
శి శిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
మత్తేభవిక్రీడితము
తొలగించండిదశనేమాత్రము లెక్కఁ జేయకయె విద్యార్థుండునై మోహమై
నిశితంబౌ మరు తూపులట్లు గురుపత్నిన్ జూడఁగన్ జంద్రుఁడే
వశమై తార విచక్షనన్ మఱచి లేవన్ గన్గిలంగన్ నివే
శి శిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై!
వశమై విషయములకుతా
రిప్లయితొలగించండినాశన్ తారయుగురునకు నంతేవాసిన్
కృశయైకలిసెను గాదే
శిశిరమునకుతాళలేక శిష్యునికలసెన్
కశిపువు లకొనంగ దలచి
రిప్లయితొలగించండిప్రశస్తి నందిన వణిజుడు ప్రశితుండనుచున్
యశమును గలిగిన గురువిక
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్.
. .
యశము గలిగిన గురువతడు
ప్రశస్తి నందిన వణిజుడు ప్రశితుండనుచున్
కశిపువు లకొనంగ దలచి
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్.
.. .
యశమున్ గన్న సురేజ్యుకున్ శిశువుగా నంభోజుడే చేరగా
దశవాజిన్ గని తార వాని ముఖ సౌందర్యమ్ము నే మెచ్చుచున్
వశమయ్యెన్ గురుపత్ని, చందురుడు సంవాసమ్మునే గోరగా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై.
నిశసమయమందు గలిగెడు
రిప్లయితొలగించండిశిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
నిశాంతమున గల గురువు ,
కుశలముగ శయించుట కొక గుడ్డను గోరన్
శశి సౌందర్యము చంచలాక్షుల మనోచాంచల్య మూలంబు!తాన్
రిప్లయితొలగించండివశమున్ దప్పెను తార! దేవగురుడే వారింప నిల్వంగ కా
ము శరమ్ముల్ మరి బాధఁ బెట్ట ప్రియమై ముద్దాడు నందాల రా
శి శిరమ్మున్! భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై!!
శశి తాఁ జేరెను సురగురు
రిప్లయితొలగించండిని శాస్త్ర విజ్ఞానమరయ నిశ్చలమతియై
విశదముగద తారకయే
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
విశదంబయ్యె రసానుభూతి నిడునా ప్రేమైక కావ్యంబులో
శశితానభ్యసమొంద దేవగురువున్ శ్రద్ధాళువైకొల్వగా
శశిపైతారకుఁ బుట్టె సంతమము నిస్సందేహ కామాంధతన్
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
శశి తాఁజేరె బృహస్పతిఁ
రిప్లయితొలగించండివిశదమ్ముగ నేర్చుకొనఁగ విద్యలు, మారున్
విశిఖము తారకు నాటగ
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
శశి తాఁ జేరె బృహస్పతిన్ దెలియగా శాస్త్రంబులన్, మారునిన్
రిప్లయితొలగించండినిశితమ్మౌ విశిఖమ్ములేగురుని పత్నిందాక గాటంబుగా
శశినింగోరెను మానసమ్మున మరుల్ సమ్మూర్ఛముం గాగఁ దా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
కం॥ వశమా యవ్వన తాపపు
రిప్లయితొలగించండిదిశను మరల్చి చలి సైఁచి దీటుగ వరలన్
విశదముగఁ దెలిపె తారయె
శిశిరమునకుఁ దాళలేక శిష్యనిఁ గలిసెన్
మ॥ విశదమ్ము కద తార త్రమ్మటయు నావేశంపు వృత్తాంతమున్
వశమే యవ్వన తాపరంతు చలిలో బాధించఁగా సైఁచుచున్
దిశమళ్ళించ జనాళికెల్లరకునున్ దెల్పంగ దౌర్లభ్యమై
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
త్రమ్మట ప్రవర్తన రంతు సందడి
దౌర్లభ్యము అసాధ్యము నిఘంటువు సహాయమండి
వశమును దప్పిన గురువై
రిప్లయితొలగించండినిశలో శీతముకు వణ కి నీరస పడుచున్
కుశలత కొఱ కై వెడలియు
శిశి రమునకు దాళ లేక శిష్యుని గలి సెన్
కం:కృశియింపగ సంపదలున్
రిప్లయితొలగించండినశింప స్వాస్థ్యమ్ము గురుడు నమ్ముచు తనకున్
వశుడని యవసానమ్మను
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
(తన జీవితం లో అవసానదశ బాధలనే శిశిరాన్ని తట్టుకో లేక గురువు శిష్యుణ్ని కలిసాడు.)
నిశలందు వాడుట కయి య
రిప్లయితొలగించండినిశమ్ము కంబళ మడుగఁగ నిశ్చింతగ, స్వీ
య శరీర రక్షణమునకు
శిశిరమునకుఁ దాళ లేక, శిష్యునిఁ గలిసెన్
వశమై పైఁడికి వేఁడఁ గాంచనము సంభావించి శిష్యుండు వే
భృశ మిచ్చెన్ గురు దక్షిణం దలపయిం బెట్టంగ మొత్తమ్ము నా
వశయే భార నివారణార్థము వెసం బ్రార్థింప, గాంగేయ రా
శి శిరమ్మున్ భరియింప లేక, కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
మ:వశమం దుండెను శిష్య యంచు భ్రమలో పాటింపకే నీమముల్
రిప్లయితొలగించండిశిశువుల్ వారని యెంచ సద్గురువు తా శీలమ్ము గోల్పోయి కా
ముశరమ్మున్ భరియింప లేకయు ముగింపున్ లేని శైత్యాన నా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
(అది శిశిరమే ఐనా ఇంకా హేమంతపు చలి తగ్గ లేదు. ఆ గురువు యొక్క ఒక శిష్యురాలు ఒక శిష్యుని తో కలిసింది.)
నశియింపగ నాస్తులిలను
రిప్లయితొలగించండిశిశువుల పోషించ నెంచ చేతుల యందున్
పస యేదియు లేక గురువు
శిశిరమునకు తాళలేక శిష్యుని గలిసెన్