3, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4932

4-11-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా”

(లేదా...)

“రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై”

(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో)

25 కామెంట్‌లు:

  1. కందం
    నీమముగ విద్య నేర్చుము
    సేమమ్మును బడయుమయ్య! శ్రీకరమనెడున్
    నోములె సరి, మోహుని సు
    త్రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా!

    ఉత్పలమాల
    నీమము దప్పకుండ మహనీయుల గాథలనెంచి విద్యలన్
    సేమము నొందగన్ బడసి శ్రీకరమంచను శాస్త్ర ప్రోక్తమౌ
    నోములె నోముమయ్యరొ! వినోదముకైనను మోహచిత్త సు
    త్రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై!

    రిప్లయితొలగించండి
  2. తామసవర్తనదొలగును
    రామునిచరితమును చదువ, రాదు కుమారా
    భూమిని కీర్తిని సుఖమును
    నీమములేకనునడవడి నిజమిదియగుగా

    రిప్లయితొలగించండి

  3. ఏమని చెప్పను నేనొక
    పామరుడను కాన నాకు పఠియింపగ రా
    దేమాత్రమ్ము నిజమ్మిది
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా



    క్షేమము గూర్చునంచు నది సిద్ధి నొసంగునటంచు దానినిన్
    నేమముగా దలంచి ప్రతి నిత్యము నిన్ బఠియించు మంచు నా
    స్వామియె చెప్పనేమి బడి ఛాయలకేగని నీకు గాంచగా
    రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై.

    రిప్లయితొలగించండి
  4. రాముడనగ యాజానకి
    రాముడు మదికి తలపునకు రాగనె , వినియా
    నామము కలిగిన యొక్కొక
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా

    రిప్లయితొలగించండి
  5. కామము గన్నుల గప్పగ
    భామల భామల పొందు లను గోరు
    పాపాత్ము o డై
    నీమము బాటించ ని పో
    రాముని చరిత మును జదువ రాదు కుమారా!

    రిప్లయితొలగించండి
  6. రాముని చరిత్ర చదివిన
    రాముని ధర్మము గుణగణ లక్ష్యము నీదౌ
    రాముని తత్వంబరయక
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా

    రాముని సచ్చరిత్ర జనులందరి డెందములందు నిల్చినన్
    రాముని తత్త్వమే జనుల లక్ష్యము కాగలదంద్రు విజ్ఞులే
    రాముని యందునన్ బొడము లక్షణముల్ గ్రహియింపకున్నచో
    రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై

    రిప్లయితొలగించండి
  7. కోమలిఁ జంప నేరమని కూరిమిఁ జూపెదవూరకిట్టులన్
    కోమలి కాదు, పాపపథ ఘోర నిశాచర దుష్ట తాటకీ
    భామను జంపుకార్యమిది, పల్కెదవిట్టుల యేలఁ జూడుమా
    రామ! చరిత్రమున్, జదువరాదు కుమార! శుభాభిలాషివై!!

    చదువరాదు = పలకరాదు

    రిప్లయితొలగించండి
  8. కం॥ రాముని నడవడి యలవడ
    రాముని చరితఁ జదువఁ దగు రావణుఁ గనుచున్
    నేమము మరచి పరఁగుటకు
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా

    ఉ॥ రామచరిత్రమున్ జదివి రమ్యత నొందుచు సద్గుణమ్ములన్
    నేమము నిష్ఠఁ బొందఁగను నీతినిఁ బాయక సంచరించఁగన్
    బ్రేమము మీర భవ్యమగుఁ బ్రేరణ రావణుఁ గాంచి పొందఁగన్
    రామ చరిత్రమున్ జదువ రాదు కుమార శుభాభిలాషివై

    అంతేకదండి రావణుని ప్రేరణ పొందితే తుదకు నాశమే!

    రిప్లయితొలగించండి
  9. కం:ప్రేమన్ మతముల నెంచక
    నామెను పెండ్లాడితి వయ!ఆ బైబిల్ నే
    ఆమె చదువ విందును , నే
    రాముని చరితమునుఁ జదువ, రాదు కుమారా”
    (ఆమె బైబిల్ చదివితే నేను వింటా కానీ కానీ నేను రామాయణ చదువుతుంటే ఆమె వినటానికి రాదు.)

    రిప్లయితొలగించండి
  10. రాముని చరితము వినఁబో
    రామియె తొలఁగును మనసుకు రహిసమగూర్చున్
    నీమములను పాటింపక
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా

    రిప్లయితొలగించండి
  11. ఉ:రాముని ధర్మమున్ దెలుప రమ్యత నొప్పెడు నారు కాండలే,
    ప్రేమయె లేక జానకిని వీడుట,శంబుకునిన్ వధించుటన్
    నా మతి మెచ్చదోయి,యిట నవ్యులు నుత్తర కాండ మెచ్చ రా
    రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై”
    (రామాయణం లో ఆరు కాండలే సవ్యమని,ఉత్తరకాండ ప్రక్షిప్త మని,అది రాముని పాత్రకి విరుద్ధ మని కొందరి అభిప్రాయం. కాబట్టి ప్రవచనం లో అది చెప్ప వద్దని తండ్రి కొడుక్కి చెపుతున్నట్లు.)

    రిప్లయితొలగించండి
  12. రాముఁడు ధర్మమూర్తి యకలంక చరిత్రుఁడు జీవకోటికిన్
    రాముని నామమంత్రమొక రక్షణఁ గూర్చెడు సాధనమ్ము పో
    రాములఁ బారదోలు రఘురాముని సత్కథ యల్పబుద్ధితో
    రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై

    రిప్లయితొలగించండి
  13. వాట్సప్ సమూహంలో సమీక్షించిన పూరణలను (సమయాభావం చేత) ఇక్కడ సమీక్షించలేదు. గమనించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  14. సౌమిత్రిఁ గూడకుండఁగ
    రాముఁడు నిదురింపఁ డెప్డు భ్రాతృ ప్రియుఁడై
    యేమఱకు లక్ష్మణ వినా
    రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా


    ఆ మనుజేంద్ర పుత్రుని మహాత్ముని లీల లమానుషమ్ములే
    పామరుఁ డైన నత్యధిక పండితుఁ డైనను లోక మాత యా
    భూమిజ గాథ నే పురుష పుంగవు తోడ నగౌరవమ్ముగా
    రామ చరిత్రముం జదువ రాదు కుమార శుభాభిలాషివై

    రిప్లయితొలగించండి
  15. బాములు దొలగును దప్పక
    రాముని చరితమునుఁ జదువ,, రాదు కుమారా
    గోముగ నుండెడు జాబిలి
    వ్యోమముఁదావిడిచియెపుడు భూతలమునకున్

    రిప్లయితొలగించండి
  16. రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై
    యేమని బల్కుచుంటిరయ! యిట్లుగ ద్రోహముఁజేయ
    పాడియే?
    నేమముఁదప్పకుండగను నిష్ఠను,శ్రద్ధను కర్మసాక్షిగా
    రాముని గాధలున్జదువ రంజిలుదప్పక మానసంబులున్

    రిప్లయితొలగించండి