21, నవంబర్ 2024, గురువారం

సమస్య - 4949

22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్”

17 కామెంట్‌లు:

  1. వర్ణనజేయుచుశంభున
    పర్ణయుతపమాచరించె వందితవృద్ధున్
    నిర్ణయమాయది వింతగ
    జీర్ణవయస్కుమనువాడ చిన్నదికోరెన్

    రిప్లయితొలగించండి
  2. అర్ణవపు తీరమందున
    పౌర్ణమి రేయిని గనెనొక పన్నను బ్రాతిన్ ,
    స్వర్ణము కలిగిన వాడని
    జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    నిర్ణయమై చక్రి వలన
    పూర్ణేందు వదన సుభద్ర 'మునిఁ' బోలఁగ నా
    కర్ణించి కిరీటిగ నా
    ' జీర్ణవయస్కు' మనువాడఁ జిన్నది కోరెన్

    ఉత్పలమాల
    పూర్ణశశాంక బింబమను మోమున పార్థుడు మౌనివేషమై
    నిర్ణయమౌచు జక్రి మది నిండ సుభద్రను సేవకెంచ నా
    కర్ణితయౌచు బావయని కమ్మనియూహల దేలియాడి యా
    జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్!

    రిప్లయితొలగించండి

  4. వర్ణమదేదయినను నా
    నిర్ణయమది మారబోదని వచించుచు నా
    కర్ణాటకుని సుతుడాతడు
    జీర్ణవయస్కు, మనువాడఁ జిన్నది కోరెన్.


    స్వర్ణవిరాజమానమగు సద్గుణసంపద గల్గినట్టి యా
    పూర్ణిమ నాటి చందువలె మోహనరూపము నందు వెల్గుచున్
    గర్ణుని మించి దాతయయి కష్టమటెంచక ప్రోదిసేయగా
    జీర్ణవయస్కునిం, గనిన చిన్నది కోరె వివాహమాడగన్.

    రిప్లయితొలగించండి
  5. పౌర్ణమినాడు కనుంగొని
    నిర్ణయమున్ వెలువరించె నిస్సంశయమే
    స్వర్ణమణిహార మహిమన్
    జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్

    నిర్ణయమేగదా మగువ నిశ్చల చిత్తము వెల్వరింపగా
    పౌర్ణమినాడు కాంచినది పండిన చక్కని కుంతలంబులున్
    స్వర్ణవిభూషణమ్ముల వశమ్మయి డెందము తొందరింపగా
    జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్

    రిప్లయితొలగించండి
  6. అర్ణవమాయెను బ్రతుకే
    తూర్ణముగా వయసుపెరిగి తొయ్యలి కింకన్
    నిర్ణయముగాక పెండిలి
    జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్

    రిప్లయితొలగించండి
  7. అర్ణవమాయె యవ్వనమునన్నులమిన్నకదేమి హేతువో
    జీర్ణము గాదొడంగినది జీవితమంతయు బెండ్లి గాకనే
    నిర్ణయముం గొనెన్ తుదకు నిస్పృహ నిండిన మానసంబుతో
    జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్

    రిప్లయితొలగించండి
  8. కం:కర్ణములు చెవిటి ,వన్నము
    జీర్ణించదని బెజవాడ చిన్నది వదలెన్
    వర్ణించి యతని సంపద
    జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
    (బెజవాడ అనే ఊరు ఉన్నట్టే మనువాడ అనే ఊరు ఉంది.బెజవాడ చిన్నది ఒప్పుకో లేదు.మనువాడ చిన్నది ఒప్పుకింది.)

    రిప్లయితొలగించండి
  9. ఉ:కర్ణములందు,కన్నులను,కాళ్లను శక్తియె లేక పెండ్లి కై
    నిర్ణయ మేది లేని సుతునిన్ గని కుందెడు ధర్మ బద్ధుడౌ
    జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడగన్
    పూర్ణమి చంద్రు బోలు ముఖమున్ గల యాతని పుత్రరత్నమున్.
    ( ఆ ముదుసలి కొడుకు పెళ్లి కోసం పడుతున్న బాధ చూసి ఆ చిన్నది అతని కొడుకుని పెళ్లి చేసుకోవా లనుకుంది.)

    రిప్లయితొలగించండి
  10. వర్ణము నలుపై యుండగ
    కర్ణములు విని కిడి లోప కారణ మైనన్
    నిర్ణయము దెలిపె నావిడ
    జీర్ణ వయ స్కు మనువాడ జిన్నది కోరెన్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. కం॥ స్వర్ణము సంపద తాహతు
      నిర్ణయ మెంచఁగఁ జెలియలు నేఁడు తలపరే
      పూర్ణముగఁ గల్ల పలుకఁగ
      జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్

      ఉ॥ స్వర్ణము పట్టువస్త్రములు వాటికి తోడుగ వస్తు సంపదల్
      వర్ణము నందచందములు ప్రజ్ఞయు జీతము నాస్తిపాస్తులున్
      నిర్ణయమెంచఁ గావలయు నేడఁని తెల్సిన నెట్లు పల్కెదన్
      జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడఁగన్

      వర్ణము రంగు ఛాయ అండి కులము కాదు

      తప్పుగా పెట్టిన అరసున్న తీసివేసానండి అంతే

      తొలగించండి
  12. స్వర్ణముపైమోజుకలిగి
    వర్ణము వేరయినచింతపడకవనితతా
    నిర్ణయముగొని ధనికుడౌ
    జీర్ణవయస్కు మనువాడ చిన్నది గోరెన్


    రిప్లయితొలగించండి
  13. వర్ణింపఁ గలమె దుఃఖము
    కర్ణములన్ సోఁక భర్త గమనం బకటా
    తూర్ణము మరణం, బొల్లక
    జీర్ణ వయస్కు మనువాడఁ, జిన్నది కోరెన్


    అర్ణవ సన్నిభంపు ధృతి నంగన వూని మనమ్ము నందు ను
    త్తీర్ణ నిజాపదుత్కరుని దేవునిఁ జక్కఁగ విశ్వసించి సం
    పూర్ణ మనోరథమ్మునను భూరి తపో బల దివ్య దక్షతం
    జీర్ణ వయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడఁగన్

    [చీర్ణ వయస్కుఁడు= సంపాదింపఁ బడిన వయస్సు కలవాఁడు]

    రిప్లయితొలగించండి
  14. వర్ణముతక్కువైనదరి పైకమతోడను,నింటనెంతయో
    స్వర్ణము కూడనున్నదట భార్యగ నున్ననునెల్ల స్వంతమౌ
    నిర్ణయ మొప్పుగాగొనుచునిత్యముహాయిగ నుండనెంచుచున్
    *జీర్ణవయస్కునింగనిన చిన్నది కోరె వివాహమాడగన్*


    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వర్ణమ్మది యేదైనను
    స్వర్ణాభరణములు, పెక్కు సంపద కలిగెన్
    నిర్ణయమున్ మారదనుచు
    జీర్ణ వయస్కు మనువాడఁ జిన్నది కోరెన్.

    రిప్లయితొలగించండి