2-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్”(లేదా...)“సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్”
కందందంపతులు సుగుణముల మదినింప సదాచారములకు నెలవను రీతిన్సొంపుగ సంతుకు సుకృతపుసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఉత్పలమాలదంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
సంపదల గోరి పాపపుకుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ యింపగు సత్కృప యనెడిన్ సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనేసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు సంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్ఇంపుగ నెల్లసమయముల నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్
కందం
రిప్లయితొలగించండిదంపతులు సుగుణముల మది
నింప సదాచారములకు నెలవను రీతిన్
సొంపుగ సంతుకు సుకృతపు
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఉత్పలమాల
దంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్
నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్
సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
రిప్లయితొలగించండిసంపదల గోరి పాపపు
కుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ
యింపగు సత్కృప యనెడిన్
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.
సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా
సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే
యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనే
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు
రిప్లయితొలగించండిసంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్
ఇంపుగ నెల్లసమయముల
నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్