2-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్”(లేదా...)“సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్”
కందందంపతులు సుగుణముల మదినింప సదాచారములకు నెలవను రీతిన్సొంపుగ సంతుకు సుకృతపుసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఉత్పలమాలదంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
సంపదల గోరి పాపపుకుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ యింపగు సత్కృప యనెడిన్ సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనేసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు సంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్ఇంపుగ నెల్లసమయముల నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్
వంపులు లేని వర్తనయు వంకలు జూపని కార్యదక్షతన్బెంపు వహింప నేర్పున ల భించిన దానిని గాచువైనమున్ నింపి మనమ్ము నందు కమ నీయత నెక్కొన రమ్య సౌహృదీసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్!
-సంపాద్యమెల్లపుడొదవ పెంపొందింపంగ కట్టు ప్రేయస్సులకైకొంపల గూల్చక చేర్చినసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ భక్తిని గుండెలనింపిన మనుజుండు మున్గు నిశ్చల భక్తిన్బెంపొందు పారమార్థికసంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ఇంపుగ చిత్తమందు పరమేశునిపై తగు భక్తితో తపోసంపద లభ్యమౌ నటుల చక్కని యత్నము తోడ జ్ఞానమున్బెంపు వహించు మార్గమున వేదము యోగములట్టి షట్క్రియాసంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
కందం
రిప్లయితొలగించండిదంపతులు సుగుణముల మది
నింప సదాచారములకు నెలవను రీతిన్
సొంపుగ సంతుకు సుకృతపు
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఉత్పలమాల
దంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్
నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్
సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్
రిప్లయితొలగించండిసంపదల గోరి పాపపు
కుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ
యింపగు సత్కృప యనెడిన్
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.
సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా
సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే
యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనే
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.
చెంపలు పగులు నధర్మపు
రిప్లయితొలగించండిసంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్
ఇంపుగ నెల్లసమయముల
నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్
వంపులు లేని వర్తనయు
రిప్లయితొలగించండివంకలు జూపని కార్యదక్షతన్
బెంపు వహింప నేర్పున ల
భించిన దానిని గాచువైనమున్
నింపి మనమ్ము నందు కమ
నీయత నెక్కొన రమ్య సౌహృదీ
సంపద లెక్కువైనపుడె
సద్గతి నందెద రెల్ల మానవుల్!
-
రిప్లయితొలగించండిసంపాద్యమెల్లపుడొదవ
పెంపొందింపంగ కట్టు ప్రేయస్సులకై
కొంపల గూల్చక చేర్చిన
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ భక్తిని గుండెల
రిప్లయితొలగించండినింపిన మనుజుండు మున్గు నిశ్చల భక్తిన్
బెంపొందు పారమార్థిక
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్
ఇంపుగ చిత్తమందు పరమేశునిపై తగు భక్తితో తపో
సంపద లభ్యమౌ నటుల చక్కని యత్నము తోడ జ్ఞానమున్
బెంపు వహించు మార్గమున వేదము యోగములట్టి షట్క్రియా
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్