24, డిసెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 178

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్.

42 కామెంట్‌లు:

  1. 01)
    ________________________________

    జడు డొకడు కలడు జగతిని
    కుడి ఎడమల తీరెరుగని, - కుర్ర ! నడచునా
    తడు తన మది దోచినటుల
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్.
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. గొడవెందుకు?అడుగేయకు,
    మడుగులు గట్టెను అడుసుల మయమై వీధుల్!
    వెడలకు మావల యీవల,
    గొడుగెందుకు ? కుంభవృష్టి గురిసెడి వేళన్!!!

    (ఆవల ,ఈవల = బయటకు ,లోపటికి )

    రిప్లయితొలగించండి
  3. భారత యుధ్ధములో భీముడిని జూచి దుర్యోధనుని స్వగతము :

    మడుగున మునకలు వేసిన
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్
    తడి యవగ నిండ మునిగితి
    తడవేటికి రమ్ము భీమ తప్పునె వ్రాతన్!!!

    రిప్లయితొలగించండి
  4. బడబడ మనుచూ ఉరుములు
    కడుభీకరధ్వనులగూడి కాంతులు గొలిపే
    జడివానల మెరుపులలో
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్

    రిప్లయితొలగించండి
  5. ఒడలుంజూపెడితారకు
    బడికెళ్లుచునాటలాడుబాలలకున్నూ
    మడిదున్నుదున్నపోతుకు-
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

    రిప్లయితొలగించండి
  6. మిడిమేళపు దొర యొక్కడు
    కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్
    నడిరేయి గండి పడెనట
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నరసింహ మూర్తి గారి పూరణ సూపర్ .
    ఊక దంపుడు గారి పూరణకు హాట్స్ ఆఫ్.(మడిదున్ను దున్నపోతుకు గొడుగెందుకు? బాగుంది )

    రిప్లయితొలగించండి
  8. అడిగెనె అరకొర సాయము,
    బుడిబుడి దీర్ఘములు రైతు పొగిలెడి వేళన్?
    తుడువక కన్నీరున్ ఆ
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

    రిప్లయితొలగించండి
  9. శ్రీకృష్ణుడిని వ్రేపల్లెకు కొనిపొమ్మని వసుదేవునితో దేవకి :

    వెడలెదవా వ్రేపల్లెకు
    తడవేలను నీకు రక్ష తనయుడు గాడా !
    పడగెత్తు శిష్ట దుష్టుల
    గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!!!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ మంద పీతాంబర్ గారూ ధన్యవాదములు. ఊకదంపుడు గారు దున్నపోతుపై వర్షము కురిపించినందుకు నేను కూడా మీ వలె సంతోషించాను. మిస్సన్నగారూ సమయానుకూలముగా బ్రహ్మాండమైన పూరణ. 'తుడువక ఆ కన్నీరున్ ' అంటే బాగుంటుందేమో ననిపిస్తుంది,తాతలకు దగ్గులు నేర్పే వృత్తిలో ఉన్నాను కాబట్టి !

    రిప్లయితొలగించండి
  11. నడిరాతిరి బాలుని గొని
    వడివడిగా యమున దాటు వసుదేవునిపై
    పడగల నూనగ శేషుడు -
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్?

    రిప్లయితొలగించండి
  12. అడిగెద చెప్పుము చెలియా!
    గొడు గెందుకు? కుంభవృష్టి గురిసెడి వేళన్
    తడవకయుండుట కొఱకే.
    అడిగితె? మన కంది శంకరయ్యను పోలెన్!

    రిప్లయితొలగించండి
  13. నరసింహ మూర్తి గారూ! ధన్యవాదాలు. మంచి సూచన చేశారు. మనవడా! శతమానం భవతి. అయినా యెంత లోకువ కాకపోతే, జుట్టు తెల్లబడింది గదా అని తాత అంటారా? ఇంకా అరవై దాటలేదు.అయ్!

    రిప్లయితొలగించండి
  14. తడిసిన వనితను గని
    వడివడిగా అడుగు లేయ వరిమడులందున్ !
    పడగలవు అడుగు తడబడి
    గొడు గెందుకు ? కుంభవృష్టి గురిసెడు వేళన్ !

    రిప్లయితొలగించండి
  15. అడిగినదేతడవనుచును
    గడగడమని పద్యవృష్టి విడువక కురియన్
    తడవగ కోరే మనసుకు
    గొడుగెందుకు కుంభ వృష్టి గురిసెడి వేళన్ !

    రిప్లయితొలగించండి
  16. " నడిరేయి దాటి పోయెను
    అడగనిదే వరమీయదు యలివేల్ మంగమ్మైనన్
    తడియగ వలపుల జడి
    గొడుగెందుకు కుంభ వృష్టి గురిసెడి వేళన్

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్నగారూ వయస్సులో మీరు యువకులు సార్, పద్యాల ధార అమోఘము.ఉపమానము తప్పయింది,అంతే! నేను నాట్యాచార్యుడునయితే హంసకు నడకలనే వాడిని, సంగీత జ్ఞానముంటే కోకిలకు పాటలనే వాడిని,గురువర్యులు శంకరయ్య గారి వలె భాషాజ్ఞానముంటే చిలుకకు మాటలు నేర్పడమనే వాడిని. నేను కూడా 1967 లో వసంతకిశోర్ గారి లాగే ఎస్.ఎస్.ఎల్.సి.పూర్తి చేసాను. 1968 లో పి.యు.సి లో వదిలివేసిన తెలుగు.రాని ఆంగ్లములో యిక్కడ వారితో మాట్లాడటము ( దానికి సంతోషమే తప్ప యెంతమాత్రము విచారము లేదు ) రాని తెలుగుతో పద్యాలు వ్రాయడము,చేస్తున్నాను.డా. ఆచార్య ఫణీంద్ర గారికి శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి కృతజ్ఞతలు. మంచి పూరణలు చేసారు. శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ బాగుంది.శ్రీ ఫణి ప్రసన్నగారు చాలా మంచి పద్యము చెప్పారు. వర్షానికి కొంచెము విడత వచ్చిందేమో గాని వసంత కిశోరమనే అంబుదము దారిలో ఉంది.

    రిప్లయితొలగించండి
  18. కవి
    కోవిదుల
    కందరికీ
    కేకిసలు.
    _________________________________________
    02)

    కడు, రయమున ,కేలను , గిరి
    నిడుకొని , రేపల్లెను , కడు - నిడుముల బారిన్
    పడకుండగ , గాపాడిన
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    _________________________________________

    రిప్లయితొలగించండి
  19. మూర్తిగారూ!
    మంచి మాటలు చెప్పారు !

    ముత్యముల వలె
    మెరయు చున్నవి
    అందరి పూరణలూ.

    మరైతే
    మీరూ,నేనూ
    సహోధ్యాయుల(class mates)
    మన్నమాట.
    ఇన్నాళ్ళూ చెప్పారు గారేం?
    చాలా సంతోషం.

    నేను కూడా తెలుగునే గాకుండా
    పి.యు.సి ని కూడా మధ్య లోనే వదలి
    పాలిటెక్నిక్ మరియు బి. ఇ చేసి
    ఇంజనీరు గా స్థిరపడుటవలన
    ఇన్నాళ్ళూ తెలుగుతో సంపర్కం లేకుండా పోయింది.

    ఇదిగో ఇన్నాళ్ళకు ఈ విధంగా.
    అంతా శంకర కృప.
    శంకరాభరణం దయ.

    రిప్లయితొలగించండి
  20. _________________________________
    03)
    జడివాన కురియు చున్నను
    వడి వడిగా , స్కూటరెక్కి - వనితల వెంటన్
    బడు , కడు ,పోకిరి గాండ్రకు
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    __________________________________

    రిప్లయితొలగించండి
  21. ____________________________________
    04)
    కుడుచుట కేమియు నోచక

    కడుపున , కాల్జేతులెట్టి - కడు దీనముగా

    నడివీధి , నుండు వారికి
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    ___________________________________
    (వారికి కుడుపు కావలె గాని గొడుగు కాదు)
    ___________________________________

    రిప్లయితొలగించండి
  22. _______________________________________
    05)
    ఎడ మొగము , పెడమొగము గను
    విడివిడిగా పండుకున్న - వెలదిన్ , గడు , ప్రే
    ముడి లాలించవలె నిలన్
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    ___________________________________
    (సఖ్యత కావలె గాని)
    ____________________________________

    రిప్లయితొలగించండి
  23. ____________________________________
    06)
    గడగడ గడగడ లాడగ
    తడబడ క్రీడియు , రథియును! - తా , వీడెను భీ
    ష్ముడు , వాడి , వేడి , యంబుల!
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  24. _____________________________________
    07)
    పడతిని కనుగొన కొనకొని
    గడబిడ పడకను హనుమడు - కడువడి వెలువడి
    కడలిని గడచెడు తరి,తరి
    గొడు గెందుకు , కుంభవృష్టి - గురిసెడి వేళన్.
    _____________________________________
    (తరి = వేగము, సమయము)
    _____________________________________

    రిప్లయితొలగించండి
  25. నరసింహ మూర్తిగారూ మీరు బహుముఖ ప్రజ్ఞా శాలురు.ఏమైనా చేయగలరు. నేనుకూడా మీకు లాగానే ఆంగ్లం లో పూరు,తెలుగులో వీకు.
    ఫణీంద్ర,రామకృష్ణారావు గార్ల పద్యాలు అమోఘం.
    రాజేశ్వరి గారి పద్యాలు క్రమంగా పదును తేలుతున్నాయి.
    వాసంత శిశువు కేర్ కేర్ మని విరామం లేకుండా ఆలాపిస్తోంది కోయిలలాగా.
    పీతంబార్,హరి గార్ల పద్యాలు సరేసరి. కమనీయం.
    క్రొత్త మిత్రుడు నిరంజన్గారి పద్యాలు బాగుంటున్నాయి.

    రిప్లయితొలగించండి
  26. డా.ఆచార్య ఫణీoద్ర గారికి నమస్కారం మీ పూరణ గొప్పగా,ఉత్తమంగా ఉంది .
    శ్రీ చింతా రామకృష్ణా రావు లాంటి పండితుల పూరణలు మాలాంటి ఔత్సాహికులకు మార్గ దర్శకాలౌతాయి .పండితులకు నమస్కారం
    శ్రీ వసంత కిషోర్ గారు పూరణల కుంభ వృష్టినే కురిపించారు .తడిసి ముద్దై పోయాను గొడుగు లేక .నమస్కారం .

    రిప్లయితొలగించండి
  27. పైన చేసిన నాపూరణను మెచ్చని మా అమ్మాయి రేవతి "రాముని ఔదార్యం" వ్యక్తమయేలాగ పూరణ చేయమనడంతో ఈ క్రింది విధంగా పూరించడం జరిగింది.

    మడమనుతిప్పని రఘుపతి
    అడిగినవరమిచ్చుచుండ అసలొద్దనుదే?
    మడి ఎండిపోవుచుండగ
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్?

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్న గారి పూరణ నేడు రైతు పడుతున్న కష్టాలకు అద్దం పడుతుంది .వారి పూరణలు నాకు స్పూర్తి దాయకాలు వారికి నా ప్రణామాలు .వారు నాకు అన్నగారు .ఒకరకంగా తమ్ములు గూడా.

    రిప్లయితొలగించండి
  29. పీతాంబార్ గారూ మీ సోదరాభిమానానికి బహు ధన్యవాదాలు.మీ మాటలు మణుల మూటలు. మీ బ్లాగు,మీ చిరు కవితలూ భేష్.

    రిప్లయితొలగించండి
  30. మూర్తిగారికీ
    మిస్సన్న మహాశయులకూ
    పీతాంబర ధరునికీ
    ధన్యవాదములు.

    మీ ప్రోత్సాహమే నాతో
    వడి వడిగా
    అడుగులు
    వేసేలా చేస్తోంది.

    మిత్రులందరి పూరణలూ
    అద్భుతముగా
    అలరారుచున్నవి.

    అందరికీ
    ఈ బుడుతడి
    కేకిసలు.

    రిప్లయితొలగించండి
  31. బుడి బుడిని యడుగు లిడుచును
    వడి వడిగా పాఱు శిశువు వాసంతమునై
    విడివడక కవిత జల్లెనె!
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!!!!!!!

    రిప్లయితొలగించండి
  32. విష్ణువుకు సముద్రుడు మామ
    మరియు అల్లుడు కూడానట.
    అందుకే విష్ణువును
    " మామమామ "
    అంటారట.

    మిస్సన్న మహాశయులు
    పీతాంబర ధరునికి
    అన్న మరియు తమ్ముడు
    కూడా ఔతారంట.
    ఎట్లాగో మరి ???

    ఇదేదో కొంగ్రొత్త సమస్యలా ఉంది.

    " తమ్మునికి నన్న వరుసకు - తమ్ము డాయె."

    రిప్లయితొలగించండి
  33. ఈ సమస్యను ఇలా పూరించ వచ్చా???
    పెద్దలు చెప్పాలి.

    రామునికి తమ్ము డైనట్టి - లక్ష్మ ణుండు

    ధరణి ప్రభవించె గాదొకొ - ద్వాపరమున

    అన్నగా బలరాముడై - అచ్యుతునకు
    తమ్మునికి నన్న వరుసకు - తమ్ము డాయె

    రిప్లయితొలగించండి
  34. కవి మిత్రు లందరికీ శత సహస్ర వందనాలు.
    నిన్న రోజంతా హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని "ఇ తెలుగు" సభ్యులతో సరదాగా గడిపాను. "తురుపుముక్క" కోడీహళ్ళి మురళీమోహన్ గారూ, "చదువరి" గారూ. "హాస్యం-లాస్యం" ఫణిప్రసన్న కుమార్ గారూ, మరి కొందరు బ్లాగు మిత్రులను కలిసికొనడం ఆనందాన్ని కలిగించింది. మళ్ళీ ఈ రోజు కూడా అక్కడికే వెళ్తున్నాను.
    ఇక నిన్న నా బ్లాగులో పూరణల కుంభవృష్టి కురిసింది. నిన్న ఇంట్లోనే ఉండి అందరి పూరణలను ఎప్పటి కప్పుడు వ్యాఖ్యానిస్తే బాగుండు ననిపించింది. కాని ఊళ్ళో లేకపోవడం వల్ల అవకాశం దొరకలేదు.
    నిన్న పూరణలు పంపిన వసంత్ కిశోర్ గారు, మంద పీతాంబర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, డి. నిరంజన్ కుమార్ గారు, "ఊకదంపుడు" గారు, హరి గారు, మిస్సన్న గారు, డా. ఆచార్య ఫణీంద్ర గారు, చింతా రామకృష్ణారావు గారు, రాజేశ్వరి నేదునూరి గారు, ఫణిప్రసన్న కుమార్ గారు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    మీ మీ పూరణలను పరస్పరం విశ్లేషిస్తూ, అభినందించడం నాకు ఆనందదాయకం. నాకు వ్యాఖ్యానించే శ్రమ తప్పిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి.

    రిప్లయితొలగించండి
  35. శంకరయ్య గారూ,
    నా ఈ పూరణ రెండు రోజుల క్రిందటే పంపేను కాని, పంపటంలో పొరపాటు వలన పోస్ట్ ఆవ లేదు.
    అందుకే, మళ్ళీ పంపుతున్నాను,

    కడు పేద బ్రతుకు నీడ్చుచు
    గుడి వాకిట కాళ్ళు జాపి కూర్చుని యుండన్
    తడియుట కేమున్నది యిక
    గొడుగెందుకు కుంభవృష్టి కురియుచు నుండన్

    విద్యాసాగర్

    రిప్లయితొలగించండి
  36. అర్జునుడు అగ్నిదేవునితో (ఖాండవ వనదహనము వేళ):

    హడలకు, గాండీవమునన్
    వడిగల బాణములు వంద వందల తోడన్
    తొడిగెద శరఛత్రము నిక...
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్

    రిప్లయితొలగించండి
  37. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. అడుగకనే విడువకనే
    వడిగా రాముని కరుణయె వందలు వేలన్
    వడగళ్ళుగ వ్రాలునెడల
    గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్

    రిప్లయితొలగించండి