17, డిసెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 171

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

41 కామెంట్‌లు:

 1. గురువుగారూ డా.విష్ణు నందన్ గారి శ్లోకం శంకరాభరణానికి శీర్షికగా చేయడం పుత్తడికి తావి అబ్బినట్లుగా ఉంది. జటాజూటంపై వెలిగే శంకరాభరణమైన చంద్ర వంకలా ప్రకాశిస్తోంది.

  రిప్లయితొలగించండి
 2. తానధికారము నుండగ
  ఏనాడూ కానలేదు ఈయన రైతున్
  కానగ రైతులపై అభి
  మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 3. మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.

  హరి గారూ,
  మంచి పూరణ నందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. తానుండు నన్ని తావుల
  కానంబడు దైవ మనిన ఘను ప్రహ్లాదున్
  తానై బ్రోవడె హరి! అను-
  మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 5. మరియొక పూరణ
  ============

  తానై దోచెను కోట్లను
  నేనేమీ యెరుగ నంచు నేరము దాచెన్
  ఆ నంగనాచి! ఛీ! ఛీ!
  మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్!

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, డిసెంబర్ 17, 2010 3:56:00 PM

  వైకుంఠ ఏకాదశి సందర్భం గా అందరికీ శుభాకాంక్షలు - బాలు మంత్రిప్రగడ

  రిప్లయితొలగించండి
 8. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 9. (+ve) దానమ్మే చేయు ,సురా
  పానమ్మే మానుమంచు పలికెడు వాడున్,
  ద్యానమ్మే కోరు,దురభి
  మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్ !!!


  (-ve) ప్రాణమ్మే తీయ నెఱుగు,
  గానమ్మే సేయు నెపుడు,గౌరవ మంత్రిన్!
  పానమ్మే నా పథమను,
  మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్ !!!

  రిప్లయితొలగించండి
 10. శ్రీ పతులు , శ్రీ సుతులు

  శ్రీ నుతులు , శ్రీ మతులు

  సకల శ్రీ శ్రీ యుతులు

  అందరికీ నా శ్రీ శ్రీ లు

  జనక సమానులు

  జనని సమానులు

  సోదర సమానులు

  సఖులు సకలురు

  నన్నాశీర్వదింత్రుగాక!

  రిప్లయితొలగించండి
 11. నేనీ బ్లాగుకు

  నూతన శిశువును

  గావుత

  అందరి

  ఆమోదముతో,

  ఇందడుగిడు

  చుంటిని

  నన్నాదుకొని

  చేదుకొన గలరని

  ఆశించు చుంటిని

  రిప్లయితొలగించండి
 12. మంద పీతాంబర ధరా!
  మీ పూరణలు బహు భావ
  గర్భితములై యొప్పుచున్నవి
  ఆ గర్భిత భావము లేవో
  అర్థము కాకునికి
  అడుగుచు నుంటి
  (+), (-) ల సారమేమో
  తెలియగోరుచుంటి

  ప్రాణము ----------
  - తీయుట నెరుగునా ?
  - తియ్యను అనునా ?
  - తీయన(తీపి)అని ఎరుగునా ?

  గానము - ఏ మా గానము
  -వేణు గానమా
  -వేలం గానమా
  -తెలంగాణమా
  -తరుణీ గానమా
  -తరుణ గానమా
  -లలనా గారమా
  -లంచాగానమా

  రిప్లయితొలగించండి
 13. విష్ణు వర్ధన నామ ధేయా !

  మీ పూరణ లనన్య సామాన్యములు

  మహా మహోద్భుతములు

  అని నే ననిన

  దినకరుడిని దివిటీతో

  చూపుటే యగును !

  రిప్లయితొలగించండి
 14. శంకర గురువరా !

  మీ
  సహిష్ణు
  సహాయ
  సహకార
  సలహాలకు
  నమోవాకాలు !


  మానున భగవానుని,కను

  గొనినను,గొలవని దనుజుడు - గొనకొని గూలెన్

  శ్రీ నారాయణునం దభి

  మానమ్మే లేనివాఁడు - మాన్యుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోరా,
  కవి మిత్రుల ఆశీస్సులు, ప్రోత్సాహం మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ వ్యాఖ్యలపై వారి ప్రతిస్పందనను నిరీక్షిద్దాం.

  రిప్లయితొలగించండి
 16. వసంత కిశోరా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు. అన్నట్టు ... మీరు కాకినాడ వాస్తవ్యులా?

  రిప్లయితొలగించండి
 17. మంద పీతాంబర్ గారూ,
  పాజిటివ్, నెగెటివ్ భావాలతో మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. 02)
  తానే సర్వం సకలం

  తానే సత్యాతి సత్య - మని హరి హరునిన్

  గానము జేసిన బాలుడు

  మానమ్మే లేనివాఁడు - మాన్యుం డయ్యెన్.

  [బాలుడు = ప్రహ్లాదుడు]
  [మానము = గర్వము ]

  రిప్లయితొలగించండి
 19. Sreenidhiyai taanunDiyu
  daanamunaku cheayi jaape danujula patikin
  heenamo,deenamo naDuguTa
  maanammea leani vaaDu maanyunDayyen !!

  రిప్లయితొలగించండి
 20. guruvu garu manninchandi. Newyork nagaramulo unaanu. naaku lekhini sahakarinchaka povadamu valana angla lipilo phonu dvaaraa pampistunnaanu. mitrula puranalu chaalaa bagnnaayi

  రిప్లయితొలగించండి
 21. 03)
  కూనై వచ్చిన శ్రీహరి

  మేను పుడమిపై, అశేష - మై సర్వవ్యా

  పన మొందెన్ గద ! ఔరా !

  మానమ్మే లేనివాఁడు - మాన్యుం డయ్యెన్.  [మానము = కొలత]

  రిప్లయితొలగించండి
 22. ఔను! శంకర స్వామీ!

  నిన్న మొన్నటి వరకూ కాకినాడనే.
  ఇంజినీరుగా చేసి పదవీ విరమణ పొందాను అక్కణ్ణే.
  ప్రస్తుతం తణుకు(ప.గో జిల్లా)లో స్థిర నివాసం.

  రిప్లయితొలగించండి
 23. ఔనా!!!!!!!!!!!!!
  నిజమేనా!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  అయ్యో మూర్తి గారూ!
  నేను నిన్ననే పుట్టిన శిశువు నండీ !బాబూ!

  మీ అభినందనకు
  నా ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 24. వసంత కిషోర్ శిశువు కదా! చిలిపి తనం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మనబ్లాగుకు సందడే సందడి!

  రిప్లయితొలగించండి
 25. శ్రీ వసంత కిషోర్ గారి ఆగమనాన్ని సవినయంతో,సహృదయంతో,సాదర పూర్వకంగా స్వాగతిస్తున్నాను.

  శిశువు వసంత కిశోరుని,
  వశమైతిమి జూడ,యశము వడసిన వాడే,
  శిశువుగ దలుపగ,మాకును
  వశమగుటయు లేదు, మధుర వాక్కులు వింటెన్ !


  స్వామీ కార్యాన్ని,స్వకార్యాన్ని చక్కదిద్దుకోవడం కొరకు ,గౌరవ మంత్రుల చుట్టు చేరి,వారి నామాన్నేగానం చేస్తూ నిత్యం వారినే భజిస్తూ ,అన్నీ రకాల పానాల్నిసేవిస్తూ ,అవసరమైతే,అవసరమైన వారి
  ప్రాణాలను సైతం తీయగల ప్రబుద్దుల్ని నేడు మనం చూస్తున్నాం కద.వారినే ఆశ్రయించి ,మాన్యులుగా నెంచితమ తమ పనుల్ని సాదించు కొంటున్న ప్రజలను చూస్తున్నాం .యీ భావన పరిది లోదే నా పూరణ .
  పూరణలు పోస్ట్ చేసేటప్పుడు అలా పాజిటివ్ , నెగెటివ్ గుర్తులను పూరణల ముందుంచాలని అనిపించింది .యిది పాజిటివ్ భావనతో చేసిన పూరణ అని, యిది నెగెటివ్ భావనతో చేసిన పూరణ యని తెలుపడానికి అలా పెట్టాను అంతకు మించిన విశేష మేమి లేదు .

  మీ స్పందనకు ధన్య వాదములు.మీకు నమస్కారములు.

  రిప్లయితొలగించండి
 26. నన్ను
  ఆప్యాయంగా
  అక్కున జేర్చుకొని
  ఆదరించిన
  సరస
  సద్గుణ
  సంపన్నులు
  అందరికీ
  పేరు పేరునా
  వందనములు.

  రిప్లయితొలగించండి
 27. వసంత్ కిశోర్ గారూ,
  మీ పేరు చూసి మీరు యువకులనుకున్నా. నాలాగే పదవీ విరమణ పొందినవారేనా? సంతోషం.
  మీ మూడు పద్యాలను వివరంగా విశ్లేషిస్తూ ఒక వ్యాఖ్యను ఉదయం టైపు చేసి పోస్ట్ చేయబోగా "పవర్ కట్"! ఇప్పుడు మళ్ళీ అంత వివరంగా వ్యాఖ్య రాసే టైము లేదు.
  మీ మొదటి పద్యం రెండవ పాదంలో ప్రాసాక్షరానికి ముందు లఘువుంది. మిగిలిన పాదాల్లో గురువుంది. కంద పద్యం మొదటి పాదాన్ని లఘు గురువులలో దేనితో ప్రారంభిస్తామో మిగిలిన పాదాలను దానితోనే ప్రారంభించాలని నియమం.
  మీ రెండవ పద్యం రెండవ పాదంలో యతి తప్పింది.
  మూడవ పద్యం మూడవ పాదంలో మొదటి పద్యంలో చేసిన పొరపాటే చేసారు.
  పొద్దున వాటిని సవరించే ప్రయత్నంలోనే పవరు కట్టయింది.

  రిప్లయితొలగించండి
 28. శంకరార్యా!
  మీ
  సూచనలకు బహుథా
  ధన్యవాదములు.
  నేను నిజంగానే చందంలో బహు పసివాణ్ణి.
  ఏనాడో (1967, SSLC )చదుకున్న చదువు.

  తీరికలేని లేని ఉద్యోగంతో
  ఆరాటమే గాని ,ఇదిగో ఇప్పుదే పోరాటంమొదలుపెట్టాను.
  మిస్సన్న మహాశయులు శలవిచ్చినట్లు

  ఏదో మీబ్లాగులో ఏవో పిచ్చి రాతలు పెట్టి
  నేనూ పద్యము వ్రాయగలనని చంకలు గుద్దుకుంటూ
  పసితనం నుండీ ఉన్న కసిని తీర్చుకొని

  ఈ చివరి రోజుల్లో ఆత్మ సంతృప్తిని పొందుతున్నాను.
  మీకు బహుథా బహుథా ధన్యవాదములు.
  కందంలో పాద్యాద్యక్షరాలు గురులఘువులలో నేదో ఒకటే ఉండాలన్న నియమం
  నిజంగా నాకు తెలియదు.యతిమైత్రి గురించి అసలే తెలియదు.
  పద్యాన్ని చదివి అర్థం చేసుకొనే నేర్పూ లేదు.
  కాన నా కు తగిన site ను సూచించిన మని మనవి.
  మీకు మరోసారి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, డిసెంబర్ 19, 2010 8:10:00 AM

  పెద్దలు వసంత కిషోర్ గారూ,
  చంధస్సు రివిజన్ పాఠాలకి వేరే బ్లాగు దేనికి?
  ఆ భారం శంకరయ్య మాష్టారు మీదే వేసేద్దాం.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 30. కిషోర్ గారూ తగిన బ్లాగు సూచించమని మీ భావమైతే ఈ బ్లాగుకు మించిన బ్లాగు లేదు. గురువుగారు చెప్పే పాఠాలతో మన పోరాటం లో బాగా పదును తేర వచ్చును.గురువుగారు సహృదయులు. మంచి ఓర్మి గలవారు.

  రిప్లయితొలగించండి
 31. @vasant kishore

  te.wikipedia.org లో కందం, యతి, ప్రాస, చందస్సు పేజీలు చూడండి. చాలా వివరంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 32. చందో వనాంతరమున
  అఙ్ఞానాంధకారమున
  అలమటించుచున్న
  నాకు , దీపమును
  దెచ్చిమార్గమును
  జూపుచున్న

  సరస హృదయులు
  అందరూ! వందనములు.

  రిప్లయితొలగించండి
 33. మిత్రులు నచికేత్ గారికి
  మరొకసారి ధన్యవాదములు.
  మీ సూచన చొప్పున
  వికీ పీడియాను
  పరిశీలించి
  తప్పులు తగ్గించుకోగలుగుతున్నాను.

  రిప్లయితొలగించండి
 34. చేనులు పండగ నిలలో
  వానలు కురిపింప జేయు వరుణుడి తోడౌ
  భానుని శక్తిపయిన నను
  మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 35. మేనున కవచము చెవులన్
  కానగ కుండలము లన్ని కర్ణుని వోలెన్
  దానము చేయుట కిల కొల
  మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్

  రిప్లయితొలగించండి
 36. ఊనుచు జంద్యము వోట్లకు
  పూనికతో బొట్టు బెట్టి ముసిముసి నగవున్
  సోనియ పుత్రుండని యభి
  మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్

  రిప్లయితొలగించండి