31, డిసెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 186 (సూర్యబింబ మమరె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సూర్యబింబ మమరె సుదతి నుదుట.

30 కామెంట్‌లు:

 1. తూరుపు భామకు ;

  అరుణ ఛాయ లొదుగు నందపు చెక్కిళ్ళ
  తెలి మొగిలుల పూత అలవి గాక
  కవల కొండ లొప్పు గన్నుల బొమ్మలై
  సూర్య బింబ మమరె సుదతి నుదుట !

  రిప్లయితొలగించండి
 2. డా. విష్ణునందన్ గారూ శుభోదయము. ఈ పూరణ మీరు తప్పక చేస్తారని నాకు తెలుసు. అందముగా చేసారు. అభినందనలు !

  రిప్లయితొలగించండి
 3. బొమలు రెండు గిరుల పోలికనొప్పార
  భ్రుకుటి మధ్యమందు పొడిచె నదివొ
  అరుణ తిలకమవుర అందాల ద్యుమణియై
  సూర్యబింబ మమరె సుదతి నుదుట.

  రిప్లయితొలగించండి
 4. @ గన్నవరపు మూర్తిగారు
  మీ పూరణ ఉషోదయ మనోల్లాసానుభూతి కలిగిస్తూ చక్కగా ఉంది.....ధన్యవాదాలు !!!

  రిప్లయితొలగించండి
 5. తెల్లవారె ననుచు దెలుపగ పక్షులు
  ఒళ్ళు విఱుచుకొనుచు ఒదిగి యేను
  కనులు తెఱచి చూడ కవ్వించె నా తార
  సూర్యబింబ మమరె సుదతి నుదుట !

  రిప్లయితొలగించండి
 6. పడతి ఫాలభాగ వైశాల్యమును గాంచ
  ఆకసమ్ము తానె ఆగ్రహించె
  భ్రమసె తనను వీడి భామ ముంగురులలో
  సూర్యబింబ మమరె సుదతి నుదుట!

  రిప్లయితొలగించండి
 7. గురువు గారూ,

  ఇంకో చిన్న ప్రయత్నం.

  చంద్ర బింబ మంటి చక్కటి మోమున
  పడతి పెట్టె బొట్టు, పరిజనులు దానిని
  గాంచి నంతనె పలికిరి, కడు సంతుష్టిగ -
  సూర్య బింబ మమరె సుదతి నుదుట.

  వెంకట శాస్త్రి.

  రిప్లయితొలగించండి
 8. విష్ణు నందన్ గారూ మీ పద్యం హృద్యం.
  నరసింహ మూర్తి గారూ విష్ణు నందన్ గారి అభినందనలు పొందిన మీ పద్యం బహుధా ప్రశoసార్హం.

  రిప్లయితొలగించండి
 9. దుర్గా దేవి అవతరణ;

  సురలు వేడుకొనగ పరవసించెను తల్లి
  అవతరించె నంత ఆది శక్తి
  విశ్వ తేజమమరె వెలది మోము పగిది
  చంద్ర వహ్నులమరె చక్షువులుగ
  చాన భృకుటిగయ్యె శార్ఙ్గ పినాకాలు
  కాళ రాత్రి కంటి కాటుకయ్యె
  స్థిరముగ వెలుగు సిరి తిలకము రీతిగ
  సూర్యబింబ మమరె సుదతి నుదుట
  దురిత దూర అమ్మ దుర్గమ్మ మాయమ్మ
  కరుణఁ జూపి మమ్ము కాచునెపుడు!!

  రిప్లయితొలగించండి
 10. పెళ్లి ఈడు వచ్చె పిల్ల నుదుటిపైన
  చంద్రబింబ మమరె చక్క గాను
  పెళ్లి యైన పిదప పెద్ద తనము తెల్పు
  సూర్యబింబ మమరే సుదతి నుదుట

  రిప్లయితొలగించండి
 11. కనులు మీను లగును కనుబొమల్ ధనువగున్
  కాంత మోము చంద్ర కాంతి వెలుగు
  తీర్చి దిద్దినట్టి తిలకమ్ము చూడగా
  సూర్యబింబ మమరె సుదతి నుదుట.

  రిప్లయితొలగించండి
 12. గురువు గారూ,
  నా పద్యం లో తప్పులు సవరించాను, ఒక మిత్రుడి సహాయంతో.
  చంద్ర బింబ మంటి చక్కని మోమున
  పడతి పెట్టె బొట్టు బాగు గాను
  చెలులు దాని గాంచి పలికిరి ముదమున
  'సూర్య బింబ మమరె సుదతి నుదుట.'

  ధన్యవాదాలు.

  వెంకట శాస్త్రి

  రిప్లయితొలగించండి
 13. వజ్రపుంగరమ్ము వలె నింగి రమ్యమై
  సూర్యబింబ మమరె సుదతి! నుదుట
  చేతు లడ్డుపెట్టి చిన్నగా చూడుమా
  గ్రహణ కిరణ ములను గ్లాని కలుగు.

  (వజ్రపుంగరము శిష్ట సమాసమేనా అన్న సందేహ మున్నది.
  గురువుగారే తీర్చాలి.)

  రిప్లయితొలగించండి
 14. సత్యనారాయణ గారి దుర్గావతరణ సభక్తికంగా రమ్యంగా ఉన్నది.

  రిప్లయితొలగించండి
 15. పూర్ణ చంద్ర వదన, వర్ణమ్ము పుత్తడి,
  కంచి పట్టు చీర కాంతు లీనె,
  సకల శాస్త్ర సార సంకేతమై నొప్ప,
  సూర్య బింబ మమరె సుదతి నుదుట!

  రిప్లయితొలగించండి
 16. అందరికీ వందనములు.

  సదస్యులందరి పూరణలూ
  రక్తి భక్తులను రంగరించి నట్లున్నవి.
  శుభాభి నందనలు.

  రిప్లయితొలగించండి
 17. నూతన వత్సరాగమన వేళ
  అందరికీ శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 18. ఈ సంవత్సరం చదరంగం లో ఆనంద్, షటిల్ లో సైనా జగజ్జేతలుగా నిలువగా, టెస్టు క్రికెట్టు లో ధరాధిపత్యం సాధించారు భారత ఆటగాండ్రు. షటిల్ లోనూ, క్రికెట్టు లోనూ ఇవి ఇంతకు ముందెన్నడూ ఎరుగని నూత్న శిఖరాలు.

  కలనెరుంగనట్టి ఘనకీర్తి నార్జింప
  ఆటలందు పెక్కు ఆటగాండ్రు
  దేశమాతముఖము తేజెరిల్లుటదోచె-
  సూర్యబింబ మమరె సుదతి నుదుట.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారికి,మిత్రులందఱికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.డా. విష్ణునందన్ గారికి శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదములు. నా మట్టుకు నా పద్యము కంటె మీ అభినందలు యింకా మనోజ్ఞముగా కనిపించాయి. మీ మీ పూరణలు చాలా బాగున్నాయి.శ్రీ హరి గారి పూరణ వినూత్నముగా ఉంది.శ్రీ సత్యనారాయణ గారి దుర్గా దేవి అవతరణ శ్రీ మంద పీతాంబర్ గారి పూరణలు బాగున్నాయి. ఊకదంపుడు గారు క్రీడారంగము లోనికి దిగి తమ యవ్వనము చాటుతున్నట్లు నాకనిపించింది. వెంకటశాస్త్రి గారూ, అభినందనలు. పద్య రచనకు ఉపక్రమించి నందులకు అభినందనలు. గురువుగారి వలన మనమందఱము యెన్నో విషయాలు నేర్చుకొంటాము. వసంత కిషోర్ గారూ, మీ గద్యాలు బాగుంటాయి గాని పద్యాలియ్యండి సామీ, ఆనందిస్తాము.
  గురువుగారూ మా అందఱి కొఱకు కాలము,శ్రమ వెచ్చిస్తున్నారు. మీ కంటె సహృదయులెవరు ఉంటారు? మీ బ్లాగు వలన చక్కని మిత్రులు కూడా మాకందఱికీ సమకూడారు. మీకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 20. నా పూరణ పోస్ట్ చేసి తర్వాత మిత్రుల పూరణలు చూసాను .ఇప్పుడు నా పూరణ ఇలా ఉంటే బావుండు ననిపిస్తుంది.

  పూర్ణ చంద్ర వదన, వర్ణమ్ము పుత్తడి,
  కంచి పట్టు చీర కాంతు లీనె,
  కనులు జూడ దివ్య కమలాలుగా దోప
  సూర్య బింబ మమరె సుదతి నుదుట!

  అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 21. కవి మిత్రులారా,
  మీకూ, మీ కుటుంబ సభ్యులకూ, మిత్రులకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలూ ఉదాత్తంగా, మనోహరంగా ఉన్నాయి.
  ముఖ్యంగా కవి మిత్రుల పూరణలను ప్రశంసించడం నాకు ఆనందాన్ని కలిగించింది.
  ధన్యవాదాలు.

  డా. విష్ణు నందన్ గారూ,
  ఎప్పటిలాగే మీ పూరణ ప్రబంధ కవిత వలె అలరించింది. ధన్యవాదాలు.

  హరి గారూ,
  మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.

  వెంకట శాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  "బింబము వంటి" అనడానికి వంటిని "అంటి" చేయడం గ్రామ్యం. "చంద్రబింబ మనఁగ" అంటే సరిపోతుంది.

  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ దుర్గాదేవి అవతరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  కొన్ని చిన్న చిన్న లోపాలున్నాయి. సమయాభావం వల్ల ఇప్పుడు ప్రస్తావించలేను. వీలైతే సాయంత్రం వరకు వ్యాఖ్యానిస్తాను.

  డి. నిరంజన్ కుమార్ గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  "వజ్రము+ఉంగరము" పుంప్వాదేశ, టుగాగమాలు వచ్చి "వజ్రఁపు టుంగరము" కావాలి.
  "వజ్ర బాలకమ్ము వలె" అంటే సరి. బాలకము అంటే కడియము, ఉంగరము అనే అర్థాలున్నాయి.

  మంద పీతాంబర్ గారూ,
  పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ కడు రమ్యంగా ఉంది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారూ మీ సవరణతో పద్యం దోష రహితమై రమ్యంగా తోస్తోంది.కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 23. అందరికీ
  శుభాభి నందనా
  సహిత వందనములు.
  __________________________________
  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  ఆంగ్ల ,పాలకులతొ - నగచాట్లు పడిపడి
  బద్ద శృంఖ లయిన - భరత మాత
  ముద్దు నొసట ,వెలుగు - మూడు రంగుల జెండ! (జెండా)
  సూర్యబింబ మమరె సుదతి నుదుట.
  ___________________________________

  రిప్లయితొలగించండి
 24. అభినందించిన మిత్రులకు ధన్యవాదాలు.

  శంకరయ్య గారు,
  దయ చేసి వీలు చూసుకొని నా పూరణలోని లోపాలను తెలియఁజేయండి. సరి చేసుకుంటాను. నామటుకు నాకు "చక్షువులుగ", "శార్ఙ్గ పినాకాలు" పదాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నవేమొననిపించింది..
  "సిరి తిలకము" దుష్ట సమాసము కాదుగదా?
  "దురిత దూర" పదాన్ని స్త్రీ వాచకముగా వాడ వచ్చునా?

  రిప్లయితొలగించండి
 25. జిగురు సత్యనారాయణ గారూ,
  ముఖ్యమైన లోపం సీస పద్యంలోని ఒక పాదం తప్పిపోయింది. మీరు వ్రాసింది మూడు పాదాలేనా లేక ఒక పాదాన్ని టైపు చేయడం మరిచిపోయారా?
  "భృకుటిగయ్యె" అనేది "భ్రుకుటి యయ్యె" అంటే బాగుంటుంది.
  చక్షువులుగ, శార్ఙ్గ పినాకాలు, సిరి - తిలకము గాగ ప్రయోగాల్లో లోపాలు లేవు. అవి సాధురూపాలే.

  రిప్లయితొలగించండి
 26. శంకరయ్య గారు,
  నేను వ్రాసింది ఆట వెలది ఛందస్సు. అయితే దానిని ఆట వెలది మాలికగా వ్రాశాను. సీసము కాదు. అయితే నాదొక సందేహము. మాలిక వ్రాసేటప్పుడు ఎన్ని పాదాలైనా ఉండవచ్చునా?. లేక అవి 4 గుణిజములై ఉండవలెనా?

  రిప్లయితొలగించండి
 27. పడతి యొకతె నాడు ప్రాభాత సమయాన
  స్నాన మాచరించి చక్క గాను
  పెట్టు కొనగ తాను బొట్టు గుండ్రముగను
  సూర్య బింబ మమరె సుదతి నుదుట.

  రిప్లయితొలగించండి