12, డిసెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 167

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వాపు వాపె కాని బలుపు కాదు.
దీనిని పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

 1. షేరు మార్కెటేమొ శిఖరాగ్ర మెక్కెనే,
  ఇళ్ళ ధరలు జూడ కళ్ళు చెదిరె!
  రోజు కూలి వాడి రోజులో మార్పేది?
  వాపు వాపె కాని బలుపు కాదు!!

  రిప్లయితొలగించండి
 2. చూపు కేమొ చాల ఏపుగా నున్నాడు,
  చేతలందు తగిన చేవలేదు.
  పనిని చెబితె తిక్క,తినడానికేలెక్క,
  వాపు వాపె గాని బలుపు గాదు !

  రిప్లయితొలగించండి
 3. మాప టేళ మామ మంచెకాడకు బిలిచె
  రేపు మాపు రేపు మాపు బలికె
  మనువు మాట నడుగ మారుపలుకడదేమి ?
  వాపు వాపె గాని బలుపు కాదు !

  రిప్లయితొలగించండి
 4. తనువు భార మైన ధరణి మోయు టెటుల
  క్రొవ్వు మీఱ మేను గుణము కాదు
  బరువు పెరుగ టదియు బలహీను డగుటయే
  వాపు వాపె గాని బలుపు కాదు !!!

  రిప్లయితొలగించండి
 5. నచికేత్ గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీరు చెప్పిన విషయానికి, సమస్యకు పొత్తు కుదరలేదేమో అనిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ ........................
  మా బావగారు మిట్టపెల్లి సాంబయ్య గారు చెప్పిన భావానికి నా పద్యరూపం .....
  అగ్రరాజ్య మనుచు నమెరికా దేశమ్ము
  ముందుకు కొనసాగి బోర్ల బడగ
  నతల కుతల మయ్యె నార్థిక మాంద్యాన
  వాపు వాపె గాని బలుపు కాదు.

  రిప్లయితొలగించండి
 7. ఆ.వె. పెరిగె జీత మనుచు మురిసి పోవుదవీవు
  పెరిగి నట్టి ధరలు విరిచె దాని
  కొంప ముంచె జూడు కొనుగోలు శక్తిని
  వాపు వాపె కాని బలుపు కాదు.

  రిప్లయితొలగించండి