31, డిసెంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 34

అత డెవరు?
చం.
మనసిజు మామ మామ యభిమాన మడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టి పట్టిఁ బొడిజేసిన శూరుని తండ్రిఁ గన్నుగాఁ
గొనిన సురాధినాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
1. మన్మథుని మామ ..............................
2. అతని మామ .............................
3. అతని గర్వం అణచినవాడు .....................................
4. అతని మామ .................................
5. అతని కొడుకు ..............................
6. అతని శత్రువు ................................
7. అతని కుమారుడు .........................
8. అతని పుత్రుడు ..............................
9. అతని భార్య ...................................
10. ఆమె మేనమామ ........................................
11. అతనిని చంపిన వీరుడు ..................................
12. అతని కొడుకు ..................................
13. అతనిని చంపిన శూరుడు ................................
14. అతని తండ్రి ...................................
15. అతనిని కన్నుగా పొందిన దేవుడు .........................................
16. అతని కుమారుడు ...............................
అతని ఆయువు మీకు కలగాలని ఆశీస్సు.
పరిష్కారం చెప్పండి.
మనవి -
ప్రహేళికకు సంబంధించిన మీ సమాధానాలను, వ్యాఖ్యలను, సందేహాలను క్రింది వ్యాఖ్యల పెట్టెలో పెట్టకుండా నేరుగా నా మెయిల్ కు పోస్ట్ చేయండి. సమాధానం వెంటనే ప్రకటిస్తే మిగిలిన వారికి ఆఅసక్తి లేకుండ పోతుంది.
నా ఇ-మెయిల్
shankarkandi@gmail.com

1 కామెంట్‌:

  1. జి. మైథిలీ రాం గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
    మీ సమాధానం 100% సరియైనది. అభినందనలు.

    రిప్లయితొలగించండి