మనవి: డాగు=కర=మరక; ఆకొను=ఆకలి జెందు; రైలులో కట్లెట్ సాస్ అమ్మటం చూసి కొంత ఆశ్చర్య పడ్డాను; సాస్ ఒలికినప్పుడు దాని మచ్చ తుడుచు కోవటానికి ప్రక్కవాడు పడ్డపాట్లే ఈ పద్యానికి స్ఫూర్తి. సమస్య పద విభజన కూడా సహకరించింది.
మన తెలుగు యెంత మధురమో, సాధారణ సంభాషణల లోనించి రెండు ఉదాహరణలు: ౧. ఒంటి స్థంభం మేడ, ఒకటిన్నర గది చందం - ఒకడు మూడు గదులమీద మూడు అంతస్తులు వేసిన వైనం చూసి ఒకళ్ళు నాతొ అన్నమాట. ౨. వాపు బలము కాదు వట్టి బలుపె - ఇది ఆట వెలది కి రెండో పాదమో, నాల్గో పాదమో అవుతుంది కదా! మన మాటల్లోనే కవిత్వం వుందనిపించింది. వీటిల్లోంచి కొన్ని సమస్యలు పూరణ కోసం పుట్టించవచ్చనిపించింది.
రాకేందు వదన రావే
రిప్లయితొలగించండినీకా శివుడేల ఎదుట నేనుండంగాన్
పోకిరి యతినని తలపకు
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
(కపట సన్యాసి పార్వతితో)
కాకర చేదని వగచెద
రిప్లయితొలగించండివాకరమది ఎల్లవారి కారోగ్యముకున్
శాకమొ, సూపమొ కాదన
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
(మరొక పూరణ)
నూకల కూడే జాలును
రిప్లయితొలగించండిచీకటి గుడిసైన జాలు చెరగని ధనమౌ
నాకది నీతోడుండన్
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
ఏ కూర యైన మంచిదె!!!
రిప్లయితొలగించండికాకేమీ? కాని చూడగా చక్కెర యన్
భీకర రోగము కలిగిన
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
అకారాంతమయితే ఫర్వా లేదు గాని యకారము ఆదిలో యుంటే యింకా పసందు.
రిప్లయితొలగించండిచీకాకే పర దేశము
పోకుండుట పాప మయ్యె పుణ్యము గాదే
ఈ కూర యున్కి కొను యా
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ !
నిజంగా నాకు కాకర, ఆకాకర రెండూ యిష్టమే !
వాకొన పరదేశపు కూ
రిప్లయితొలగించండిడౌకటులెటు సాసులేల? డాగులు విడుచున్
చేకొన, ఆకొన యెందుల
కా కర? వేపుడె పసందు కంజదళాక్షీ!
మనవి: డాగు=కర=మరక; ఆకొను=ఆకలి జెందు;
రైలులో కట్లెట్ సాస్ అమ్మటం చూసి కొంత ఆశ్చర్య పడ్డాను; సాస్ ఒలికినప్పుడు దాని మచ్చ తుడుచు కోవటానికి ప్రక్కవాడు పడ్డపాట్లే ఈ పద్యానికి స్ఫూర్తి. సమస్య పద విభజన కూడా సహకరించింది.
మన తెలుగు యెంత మధురమో, సాధారణ సంభాషణల లోనించి రెండు ఉదాహరణలు:
రిప్లయితొలగించండి౧. ఒంటి స్థంభం మేడ, ఒకటిన్నర గది చందం - ఒకడు మూడు గదులమీద మూడు అంతస్తులు వేసిన వైనం చూసి ఒకళ్ళు నాతొ అన్నమాట.
౨. వాపు బలము కాదు వట్టి బలుపె - ఇది ఆట వెలది కి రెండో పాదమో, నాల్గో పాదమో అవుతుంది కదా!
మన మాటల్లోనే కవిత్వం వుందనిపించింది. వీటిల్లోంచి కొన్ని సమస్యలు పూరణ కోసం పుట్టించవచ్చనిపించింది.
ఏకాలము నందైనను,
రిప్లయితొలగించండిశాఖాహారమె సరియని చదివితి నెపుడో ,
గ్లూకోజు పెరుగ నీయని
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
ఏకాలము నందైనను
రిప్లయితొలగించండిశాకాహారమె సరియని చదివితి నెపుడో ,
గ్లూకోజు లెవలు పెంచని
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
(ముందటి పూరణలో పొరపాటు దొర్లింది సవరించి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను)
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
హరి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అజ్ఞాత గారూ,
సర్వ శ్రేష్ఠమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీకే కాదు, నాకుకూడ ఆ రెండూ ఇష్టమైనవి. మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.
మొన్నటి సమస్యకు మీ ఏకాక్షర పూరణ అద్భుతం. ధన్యవాదాలు.
చేకొని కారము గుడమును
రిప్లయితొలగించండిసాకారముగా నుడుకగ చక్కని రుచితో
ఆకొన జేసెడు శాకము -
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
భీకర హాలాహలమది
రిప్లయితొలగించండికాకర వేపుడె, పసందు, కంజదళాక్షీ!
శ్రీ కరు నోటికి, జూడగ
శ్రీ కంఠుడు మ్రింగి, జగతి చింతలు దీర్చేన్ !
కం. ఏ కూరంటివి చేయగ
రిప్లయితొలగించండినాకేదిష్టమొ యెరుగవె నళిన దళాక్షీ !
ఏకూరో నాకెందుకు
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ !
జనార్ధాన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కేకులు రసగొల్లాలున్
రిప్లయితొలగించండిభీకరమగు నిట్టి స్వీట్లు బెంగాలందు
న్నాకలి కోర్వక తినితిని
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
తొలగించండిఅంతగా ఖరగ్‌పూర్ లో తిన్నారా :) మిష్టి దొయి వదిలేసారే :)
జిలేబి
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
I spent 14 years in Kharagpur Faculty Hostel before I got married. Sigh!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినాకిక కాజాలు వలదు
రిప్లయితొలగించండిభీకరమైనట్టి సుగరు బెంబేల్ జేయన్
పోకిరి చూపులు విడు! నీ
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!