31, డిసెంబర్ 2010, శుక్రవారం

చమత్కార పద్యాలు - 50

మామకు మామ ఐనవాడు
ఉ.
మామను సంహరించి, యొక మామను గర్వ మడంచి, య న్నిశా
మామను రాజుఁ జేసి, యొక మామ తనూజున కాత్మబంధువై,
మామకుఁ గన్ను లిచ్చి, సుతు మన్మథు నింతికిఁ దానె మామయై,
మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
భావం -
మామ అయిన కంసుని సంహరించి, వారధి కట్టడానికి ముందు తన మామ అయిన సముద్రుని గర్వాన్ని అణచి, నిశామామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరునిచ్చి, మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై, మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిచ్చి, కొడుకైన మన్మథుని భార్య రతీదేవికి తానే మామ అయి, తనకు లక్ష్మి నిచ్చిన మామ సముద్రునికి తన కూతురైన గంగనిచ్చి అతనికి మామ అయిన విష్ణుదేవుడు మీకు ప్రసన్నుడౌతాడు.

5 కామెంట్‌లు:

  1. నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

    రిప్లయితొలగించండి
  2. `జగ్గంపేట` మల్లిశ్రీ గారికి, `పద్మార్పిత` గారికి, `శిరాకదంబం` రావు గారికి ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారు. మీ బ్లాగ్ చాలా బాగుంది. ఇన్ని పద్యాలు సేకరించిన మీ కృషి అభినందనీయం. మీకు మా కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి