అందరికీ వందనములు. __________________________________ 01) మింటి కెగసె ధరలు - మెరయు చుక్కల దాకె పేద వాని కేది - పెత్త నంబు! ముందు జూపు లేని - మూర్ఖ పాలకుల , లో పాల వలన జనులు - పతితు లైరి. ___________________________________
కవిమిత్రులారా, ప్రయాణాలు, అస్వస్థత వల్ల కొంత విరామం వచ్చింది. మొన్ననే మాకు ఇక్కడ పాలు పోసే వాడి తో అన్నాను, "నువ్వు పోసే పాలు తాగి పాపాల పాలు అవుతున్నాము, అన్ని రకాల పాలూ కలిపి పోస్తున్నట్టున్నావు. రుచి పచి లేదు. లీటరు కి 50 రూపాయలయినా ఇస్తాను కొంచెం మంచి పాలు పొయ్యిబాబూ!" అని. కానీ ఈ రోజు సమస్యాపూరణంలో చూశాను, వేరే రకాల పాలు కూడా ఉంటాయని (నవ్వుతూ).
జీవితం ఒక సినిమా ఐతే నా పూరణ లోని మొదటి రెండు పాదాలు ఇంటర్వెల్ పూర్వ భాగం సంతానాన్ని కని,కమ్మని అమ్మపాలిచ్చి, ఊపిరులిచ్చి,ప్రేమ నిచ్చి, సకల సదుపాయాలనుకూర్చి,విద్యా బుద్దుల నిచ్చి,పెళ్లి చేసి,వారి మురిపాలలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న తల్లిదండ్రులు.ఇక తర్వాతి భాగంలోభార్యలు రావడం వారికి పిల్లలు కలుగడం,అన్నదమ్ములలో వైషమ్యాలు పెరుగడం,తమలో తాము కలహించుకోవడం ,పాలి (దాయాది) పగలు పెంచుకోవడం ఆస్తులలో పాలడగడం(భాగము)తుదకు
తల్లి దండ్రులు గూడ బరువై, వారిని ,వారి పోషణ భారాన్ని గూడ వంతుల వారిగా పంచుకొని వారికి తీరని వ్యధను కలిగిస్తున్న
ఎంతో మంది తీరును నా పూరణలో అంతర్లీనంగా ప్రస్తావించడం జరిగింది.
శ్రీ వసంత కిషోర్ గారి పూరణలు చాలా ఉంటున్నాయి ,చాలా బాగుంటున్నాయి . బ్లాగులో ఇప్పుడే వసంత సమీరమే వచ్చెనా! లేక కవితా వనంలో చిరు (అది శిశువని చెప్పుకున్నారు గనుక ) కిశోరమే జోచ్చెనా ! అన్నట్లుగా ఉంటున్నాయి పూరణలు.
శ్రీ చంద్ర శేఖరు గారి పునరాగమనము ఇన్నాళ్ళు వారు లేని లోటుని తీర్చుతాయి.వారికి నమస్కారం.
మంద పీతాంబర్ గారూ, మీ రెండు పూరణలలో మొదటిది మీరు వ్యాఖ్యానించిన తర్వాత కూడ ఎందుకో తృప్తికరంగా లేదు. దుగ్ధమనే అర్థంలో పాలు నిత్య బహువచనం. భాగం అనే అర్థంలో పాలుకు బహువచనం పాళ్ళు అవుతుంది. అది "పాళ్ళ వలన" అవుతుంది కాని "పాల వలన" కాదు కదా! అయినా నేను మీ భావాన్ని అర్థం చేసికొనడంలో పొరబడి ఉండవచ్చు. క్షంతవ్యుణ్ణి. ఇక మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ, మీ సరీసృపాల పూరణం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, స్వాగతం!
మిస్సన్న గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
లక్కాకుల వెంకట రాజారావు గారూ, బాగుందండీ మీ పూరణ. అభినందనలు.
హరి గారూ, ఆర్ద్రమైన భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ, అత్యుత్తమమైన పూరణ నందించారు. అభినందనలు.
ఏమి వ్రాయాలో పాలు పోవటం లేదు. పాల ఖరీదు పెరిగినా మంచి పాలు దొఱకటం లేదంటున్నారు.,చంద్రశేఖరు గారు. ఎలర్జీల పాలయి కోలుకొంటున్నానని నాకు తెలిపారు. ఈ రోజు వారి పాల కొరత తీరిందనుకొంటున్నాను. నా పాలుగా :
భూమి పాలు నీయ భూపాలు డొల్లక అడవి పాలు జేసె నాత్మజులను ఆస పాలు పెరుగ నని పాలు జెంది శా పాల వలన జనులు పతితులైరి.
అందఱి పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి. గురువు గారు శలవిచ్చినటుల మిస్సన్నగారి మూడవ పూరణ అత్యుత్తమంగా ఉంది. ఏనాడో తెలుగు మాధ్యమములో విజ్ఞాన శాస్త్రములో చదివా సరీసృపముల పద ప్రయోగము. ఊకదంపుడు గారు ఆ మాటను మళ్ళీ గుర్తు చేసారు.
శ్రీ శంకరయ్య గారు నమస్కారము .మీరు" క్షంతవ్యున్ని" లాంటి పదాలు దయ చేసి మాపట్ల వాడ వలదు.నేను ఇంకా నేర్చుకుంటున్న వాణ్ణే.నా భావాన్ని సరిగా communicate చేసిఉండక పోవచ్చును.నేను మీ బ్లాగులో నిత్య విద్యార్థినే.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండి__________________________________
01)
మింటి కెగసె ధరలు - మెరయు చుక్కల దాకె
పేద వాని కేది - పెత్త నంబు!
ముందు జూపు లేని - మూర్ఖ పాలకుల , లో
పాల వలన జనులు - పతితు లైరి.
___________________________________
ప్రజల నడత యందు ప్రభువుకు భాగమ్ము
రిప్లయితొలగించండిప్రభువు ధర్మ రీతి ప్రజకు రక్ష!
పాలకు లవినీతి పరులౌట వారి పా-
పాల వలన జనులు పతితులైరి.
కిషోర్ గారూ భేష్ !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
ఇది మీరు చూపిన దారే!
సమకాలిక రాజకీయాల మీద మీ వలెనే
స్పందించవలెననెడి చిరు ప్రయత్నం.
మీ పూరణ కూడా పసందుగా నున్నది.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిలోపాలను చూపిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీరు పాపాలను చూపుతూ చేసిన పూరణ బహు బాగున్నది. అభినందనలు.
తల్లి పాల నిచ్చి ,తనయుల మురిపాలు
రిప్లయితొలగించండితనివి దీర గ్రోలె తన్మయమున!
పాలి పగలుపెరిగి,పాలులనడిగిరి
పాల వలన జనులు పతితు లైరి!!
నూటపాతికేండ్లు నోళ్లుగొట్టిరిగాద
రిప్లయితొలగించండిఉద్ధరింతుమనుచు నూళ్లుమింగి
స్కాములనుపడగల,కాంగిరెసుసరీసృ
పాల వలన జనులు పతితులైరి.
వసంత్ కిశోర్ గారూ,మిస్సన్న గారూ,
మీ పూరణలు చాలా బాగున్నాయి.
పీతంబరధరా !
రిప్లయితొలగించండిఅభినందనా సహిత
వందనములు .
బహు చక్కగ నున్నది
మీ పూరణ.
మీరు "పాల"ను -పాలు-అని గాకుండా
వేరే అర్థము లో ప్రయోగించి నట్లు న్నారు
దయచేసి 3 మరియు 4 వ పాదాల అర్థం వివరించ గలరా!
ఊక దంపుడు గారూ !
రిప్లయితొలగించండిదంచేసారు గదా ! పద్యాన్ని.
"కాంగిరెసు సరీ సృపాలు"
అత్యద్భుతం మీ ప్రయోగం
వందనములు మరియు
అభినందనలు.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిప్రయాణాలు, అస్వస్థత వల్ల కొంత విరామం వచ్చింది. మొన్ననే మాకు ఇక్కడ పాలు పోసే వాడి తో అన్నాను, "నువ్వు పోసే పాలు తాగి పాపాల పాలు అవుతున్నాము, అన్ని రకాల పాలూ కలిపి పోస్తున్నట్టున్నావు. రుచి పచి లేదు. లీటరు కి 50 రూపాయలయినా ఇస్తాను కొంచెం మంచి పాలు పొయ్యిబాబూ!" అని. కానీ ఈ రోజు సమస్యాపూరణంలో చూశాను, వేరే రకాల పాలు కూడా ఉంటాయని (నవ్వుతూ).
ఊకదంపుడు గారూ అనుపమానమైన పద ప్రయోగం!
రిప్లయితొలగించండికిషోర్ గారూ ధన్యవాదాలు.
చంద్ర శేఖర్ గారి పునర్దర్శనం ఆనందదాయకం.
పొదుగు పాల బదులు పొడి పాలు వచ్చెను
రిప్లయితొలగించండిచేరె పొడుల బదులు సింథ టిక్స్
తిoడె మనిషి నడత దిద్దెడు నను గీత
పాల వలన జనులు పతితులైరి.
నేటి రాజ నీతి నీచాతి నీచమ్ము
రిప్లయితొలగించండివెరవ రెంత కైన వెగటు పుట్టు
నేర చరితు లైన నేతల కుటిల పా
పాల వలన జనులు పతితు లైరి
- వెంకట రాజా రావు . లక్కాకుల
బ్లాగు టైటల్ : సుజన-సృజన
జీవితం ఒక సినిమా ఐతే నా పూరణ లోని మొదటి రెండు పాదాలు ఇంటర్వెల్ పూర్వ భాగం సంతానాన్ని కని,కమ్మని అమ్మపాలిచ్చి, ఊపిరులిచ్చి,ప్రేమ నిచ్చి, సకల సదుపాయాలనుకూర్చి,విద్యా బుద్దుల నిచ్చి,పెళ్లి చేసి,వారి మురిపాలలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న తల్లిదండ్రులు.ఇక తర్వాతి భాగంలోభార్యలు రావడం వారికి పిల్లలు కలుగడం,అన్నదమ్ములలో వైషమ్యాలు పెరుగడం,తమలో తాము కలహించుకోవడం ,పాలి (దాయాది) పగలు పెంచుకోవడం ఆస్తులలో పాలడగడం(భాగము)తుదకు
రిప్లయితొలగించండితల్లి దండ్రులు గూడ బరువై, వారిని ,వారి పోషణ భారాన్ని గూడ వంతుల వారిగా పంచుకొని వారికి తీరని వ్యధను కలిగిస్తున్న
ఎంతో మంది తీరును నా పూరణలో అంతర్లీనంగా ప్రస్తావించడం జరిగింది.
శ్రీ వసంత కిషోర్ గారి పూరణలు చాలా ఉంటున్నాయి ,చాలా బాగుంటున్నాయి . బ్లాగులో ఇప్పుడే వసంత సమీరమే వచ్చెనా! లేక కవితా వనంలో చిరు (అది శిశువని చెప్పుకున్నారు గనుక ) కిశోరమే జోచ్చెనా ! అన్నట్లుగా ఉంటున్నాయి పూరణలు.
శ్రీ చంద్ర శేఖరు గారి పునరాగమనము ఇన్నాళ్ళు వారు లేని లోటుని తీర్చుతాయి.వారికి నమస్కారం.
పశువు నేమరించి పాలను కాజేసి
రిప్లయితొలగించండిదూడ గడ్డి మేప దోషమవదె?
నోరులేని ప్రాణి నోటికూడు గుడిచి
పాల వలన జనులు పతితులైరి.
వనిత కళ్ళు కామ వాకిళ్ళుగా జేసి
రిప్లయితొలగించండిపైట జార పిలిచె పడుచు వాణ్ని ,
పడెను వాడు వలలొ,పదమనె? వెగటు,రూ
పాల వలన జనులు పతితులైరి.
వహ్ని తరిగె మౌని పత్నుల మోహించి
రిప్లయితొలగించండిగాడి తప్పె మౌని గాధి సుతుడు
తార పతన మొందె, తగని శృంగార తా
పాల వలన జనులు పతితులైరి.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలలో మొదటిది మీరు వ్యాఖ్యానించిన తర్వాత కూడ ఎందుకో తృప్తికరంగా లేదు. దుగ్ధమనే అర్థంలో పాలు నిత్య బహువచనం. భాగం అనే అర్థంలో పాలుకు బహువచనం పాళ్ళు అవుతుంది. అది "పాళ్ళ వలన" అవుతుంది కాని "పాల వలన" కాదు కదా! అయినా నేను మీ భావాన్ని అర్థం చేసికొనడంలో పొరబడి ఉండవచ్చు. క్షంతవ్యుణ్ణి.
ఇక మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
మీ సరీసృపాల పూరణం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
స్వాగతం!
మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
బాగుందండీ మీ పూరణ. అభినందనలు.
హరి గారూ,
ఆర్ద్రమైన భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
అత్యుత్తమమైన పూరణ నందించారు. అభినందనలు.
మోక్ష గాము లయిరి మునులు నాడు జపత-
రిప్లయితొలగించండిపాల వలన, జనులు పతితులైరి
భోగ లాలసులయి ముక్తి మాట మరచి
కలి యుగాన నకట కాల మహిమ!
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఅత్యుత్తమమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
చంద్ర శేఖరుని ,వసంత కిశోరుని ,
రిప్లయితొలగించండిఊకదంపుడు ,హరి ,టేకుమళ్ళ ,
మిమ్ము ,నేదునూరి ,మిస్సన్న,మందను
క్రొత్త వత్స రమ్ము గూర్చు గాత !
-మీ వెంకట రాజా రావు.లక్కాకుల
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అచ్చెరువొందించు చున్నవి.
చంద్ర శేఖర్ గారు చెప్పినట్లు
లోకంలో ఎన్నెన్ని రకాల "పాలు" !!!
లోపాలు,పాపాలు,మురిపాలు,పాలు(వంతు)
సరీసృపాలు, పొడి పాలు,కుటిల పాపాలు,
కుడిచే పాలు, వెగటు రూపాలు,శృంగార తాపాలు,
జప తపాలు,...............
అబ్బో!!! చాలా చాలా రకాల పాలు
మురిపెము గొలుపుచూ ముచ్చటగా నున్నవి.
విలక్షణ ప్రయోగాలతో నలరించిన
సదస్యులకు శుభాభినందనలు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఏమి వ్రాయాలో పాలు పోవటం లేదు. పాల ఖరీదు పెరిగినా మంచి పాలు దొఱకటం లేదంటున్నారు.,చంద్రశేఖరు గారు. ఎలర్జీల పాలయి కోలుకొంటున్నానని నాకు తెలిపారు. ఈ రోజు వారి పాల కొరత తీరిందనుకొంటున్నాను. నా పాలుగా :
రిప్లయితొలగించండిభూమి పాలు నీయ భూపాలు డొల్లక
అడవి పాలు జేసె నాత్మజులను
ఆస పాలు పెరుగ నని పాలు జెంది శా
పాల వలన జనులు పతితులైరి.
అందఱి పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి. గురువు గారు శలవిచ్చినటుల మిస్సన్నగారి మూడవ పూరణ అత్యుత్తమంగా ఉంది. ఏనాడో తెలుగు మాధ్యమములో విజ్ఞాన శాస్త్రములో చదివా సరీసృపముల పద ప్రయోగము. ఊకదంపుడు గారు ఆ మాటను మళ్ళీ గుర్తు చేసారు.
రిప్లయితొలగించండిలక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఇంతకీ నూత్న సంవత్సరంలో మిత్రులకు ఏం "కూర్చ" దలచుకున్నారు?
వసంత్ కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
కవి కోకిలలు నూతన సంవత్సరం కోసం ముందే కూస్తున్నాయి.
మీ పాల రూపాల విశ్లేషణ బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మహా భారత నేపథ్యంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఇతర కవుల పూరణలను మెచ్చుకొన్న మీ సంస్కారానికి, సహృదయానికి ధన్యవాదాలు.
గురువుగారికి నమస్కారాలు. కవి మిత్రులందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారు నమస్కారము .మీరు" క్షంతవ్యున్ని" లాంటి పదాలు దయ చేసి మాపట్ల వాడ వలదు.నేను ఇంకా నేర్చుకుంటున్న వాణ్ణే.నా భావాన్ని సరిగా communicate చేసిఉండక పోవచ్చును.నేను మీ బ్లాగులో నిత్య విద్యార్థినే.
రిప్లయితొలగించండిఆ.వె.అంతరంగమందు అధికార వాంఛయే
రిప్లయితొలగించండినిండినట్టి మిగుల నీచ జనులు
గద్దె నెక్క వారి కడునీచ మయిన పా
పాల వలన జనులు పతితు లైరి.
అన్ని పూరణలు చాలా చాలా బాగున్నాయి. ఒకటి రెండు పూరణలు మకుటాయ మానమై ఒప్పుచున్నాయి.
రిప్లయితొలగించండికొండకోనలన్ని పిండిగొట్టుచునుండ
రిప్లయితొలగించండివనములోని యెల్ల ప్రాణులున్ను
పారిపోవుచుండి పాపము , మౌన శా
పాల వలన జనులు పతితులైరి!!
చిత్రమాయె నేటి చిన్నారి శిశువులు!
రిప్లయితొలగించండితల్లిపాలు లేక తల్లడిల్ల!
ఘనరసాయనముల కల్తీయునౌ డబ్బ!
పాల వలన జనులు పతితులైరి!!
పరులవృద్ధిగాంచి ,పగబూనితిరుగుచు
రిప్లయితొలగించండికీడుజేయువారు నేడుగలరు
దుష్టభావజనులు ,దోషాలనెంచి ,కో
పాలవలనజనులుపతితులైరి.