21, డిసెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 175

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

23 కామెంట్‌లు:

  1. మన వారెవరైనా కాళిదాసు రచించిన 'సకలజననీస్తవా' నికి తెలుగులో తాత్పర్యం ఏ బ్లాగులో నైనా లభిస్తుందేమో చెప్పి సహాయం చేయగలరా?

    రిప్లయితొలగించండి
  2. ఏమని కూసెనొ కోయిల,
    ఆమని పిలిచెనొ అతనిని అచ్చెరువొందన్ ,
    రాముని కావ్యము వ్రాసెను
    పామరుడే కవిగా మారి ప్రస్తుతి లందెన్ !


    ఏమని వేడెనొ కాళిక,
    నేమని కోరెనొ వరములు నేరుగ నిచ్చెన్!
    రాము రఘువంశ కర్తగ
    పామరుడే కవిగా మారి ప్రస్తుతి లందెన్ !

    రిప్లయితొలగించండి
  3. 01)
    కామాటి , వెర్రి , గొల్లని
    నా మీనాక్షికి, కుయుక్తి - నాధుం జేయన్
    కామాక్షి కృపను గాదొకొ
    పామరుఁడే కవిగ మారి - ప్రస్తుతు లందెన్.

    [గొల్లడు = కాళిదాసు]

    రిప్లయితొలగించండి
  4. నీమమున గురువు చేయగ
    వేమరు బోధనల నంటు విద్యలు వినమే
    భ్రామర కీటక సూత్రము
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

    రిప్లయితొలగించండి
  5. నా పూరణలలొ నాల్గవ పాదం టైపు చేయడంలో తప్పు దొర్లినట్లుంది .ఇలా చదువ గలరు "పామరుఁడే కవిగ మారి - ప్రస్తుతు లందెన్."

    రిప్లయితొలగించండి
  6. రామసునామప్రియునిన్
    దామోదరముఖ్యదేవతార్చితమూర్తిన్
    కామారిన్నిష్ఠఁగొలిచి
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

    (నత్కీరన్ కధ ఆధారంగా)

    రిప్లయితొలగించండి
  7. నా కంటే పామరు డెక్కడ! క్రితము సారి భారత దేశము వచ్చినప్పుడు విజయనగరములో చెప్పిన కంద పద్యము,

    విద్యల నగరము నందున
    విద్యల ఘనులైన వారు వేవురు మధ్యన్
    విద్యయ!యిది కనువిద్దియ!
    పద్యములను నేను జెప్ప పామరుడయ్యున్ !

    ఆ పనే యిప్పుడు శంకరాభరణములో చేస్తున్నాను !

    రిప్లయితొలగించండి
  8. ఏమూలో దాగిన కవి
    సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్
    ఆ మాన్యు ప్రోద్బలము చే
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

    రిప్లయితొలగించండి
  9. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, డిసెంబర్ 21, 2010 12:32:00 PM

    హరి గారూ,
    నాదీ ఇదే భావం. కృతజ్ఞతలు
    నా లాంటి పామరులని శంకరాభరణం స్కూల్ ద్వారా కవులని చేస్తున్నారు, శంకరయ్య మాష్టారు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  10. అయితే హరీజీ,

    మన మందరం
    కాళిదాసు, వాల్మీకీ
    ఐ పోయినట్టే నంటారా!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    అందరూ వినండహో!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    రిప్లయితొలగించండి
  11. నరసింహ మూర్తి గారూ మీ పద్యం చాల బాగుంది.
    హరి గారూ మీరు గురు దక్షిణ సమర్పించేశారు.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్నగారూ ధన్యవాదములు. హరి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.మా అందరి తరపున మీకు ధన్యవాదములు. వసంత కిశోర్ గారూ మీ కీర్తి ఖండాంతరాలు వ్యాపించింది. మీ పద్యాలు చాలా బాగుంటున్నాయి. శ్రీ పీతాంబర్ గారి పూరణలు ఆమని కోయిల పాటల్లాగ ఉన్నాయి. మిస్సన్న గారి పద్యా లెప్పుడు బాగుంటాయి.

    సీమల గోవులు కాయగ
    శ్రీముఖమై పొసగె వాణి శ్రీ అందెశ్రీ
    కోమలపు పలుకు పాటల
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్!!!

    రిప్లయితొలగించండి
  13. ఊకదంపుడు గారూ, మీ పద్యము చాలా మధురముగా ఉంది. రాముడిని,విష్ణువుని,ఈశ్వరుడిని చిన్న పద్యములో స్తుతించి నత్కీరుడిని సన్నుతించారు.

    రిప్లయితొలగించండి
  14. ఐనా ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకొంటున్న శిశువును
    అప్పుడే అంతదూరం ఎలా పాకానబ్బా!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    మూర్తి గారూ! ధన్యవాదములు.
    బహు వదాన్యులు మీరు.
    శిశువును గూడా ప్రశంసలతో
    ముంచెత్తే మీ వదాన్యత
    బహుదా అభినందనీయం.

    సదస్యు లందరికీ శుభాభినందనలు.
    మీ మీ పూరణలు వివాహ భోజనము వలె
    పసందుగా నున్నవి.

    రిప్లయితొలగించండి
  15. శంకలు మానుము! సోదర
    శంకితుడై! పదము, పదము - చందము జెప్పన్
    శంకానివృత్తి సాధక,
    శంక్రాభరణము! పుడమిని - శంకలు దీర్చున్

    చందమున పదము జెప్పగ
    సందేహము, వలదు ! కంది- శంకరు గరుణన్
    ఎందెందు పదము పాడిన
    నందందే గలుగు శోభ - నాకును, నీకున్

    రిప్లయితొలగించండి
  16. కవి మిత్రులందరికీ వందనాలు.
    హైదరాబాద్ వెళ్ళే తొందరలో అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేకపోతున్నాను. నేను ఊహించినట్లే ఎక్కువ మంది వాల్మీకి, కాళిదాసుల ఐతిహ్యాలతో పద్యాలు చెప్పారు.
    ఊకదంపుడు గారు నత్కీరుణ్ణి, గన్నవరపు నరసింహ మూర్తి గారు అందెశ్రీని విషయంగా స్వీకరించడం బాగుంది.
    మిస్సన్న, హరి గారి పూరణలు విలక్షణంగా ఉన్నాయి.
    ముఖ్యంగా ఒకరి పూరణను మరొకరు విశ్లేషిస్తూ ప్రశంసించడం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించండి.
    అందరికీ అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. ప్రేమతో మనకందించిన
    ధీమంతుడు కంది వారిదీ (వెన) 'మన' బ్లాగున్
    సీమలు మెచ్చగ, పాల్గొని
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్!

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. నామము స్మరించి యాశ్రీ
    రాముని గొలువంగ శంకరాభరణమునన్
    గోముగ పూరణ చేయగ
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్

    రిప్లయితొలగించండి
  20. శంకరాభరణం - 175

    "పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్"

    ఏమియు ఛందము తెలియక
    తోమగ శంకరులు నల్ల తోలే తెలుపై
    సోమరి తనమున గీకెడి
    పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్

    (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

    రిప్లయితొలగించండి