26, డిసెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 180 (సిరి వలదనువాని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
ఈ సమస్యను పంపిన `విద్యాసాగర్ అందవోలు` గారికి ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. హరి కైనను, హరు కైనను
    సురపతికైన,ధరనేలు శూరుని కైనన్,
    నిరతము గావలె జీవన
    సిరి,వలదనువానికిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  2. రాముడని ధాముడని
    త్యాగ రాజాత్ముడని వినుతించి మదిన్
    నిధి వలదనె సన్నిధి సుఖమనె
    సిరి వలదనువానికిలను చిక్కులు గాదా!

    రిప్లయితొలగించండి
  3. అరకొర సాయము జేసిరి
    మరి,యే తీరున సరిపడు?మంత్రుల చేతల్
    ఉరితాడై పురిగొల్పగ,
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  4. సరకుల ధర మింటి కెగిసె,
    వరి పంటలు నీట గలిసె, వరదలు రాగా,
    చిరు సాయము సరి పోదని
    సిరి వలదను వాని కిలను చిక్కులు గాదా!!

    రిప్లయితొలగించండి
  5. మురిపముగ ముద్దు పెట్టగ
    పరిణయమాడిన తన సతి ప్రణయము తోడన్
    సరసము తెలియక విసిరి క-
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  6. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో :

    హరి వచ్చె సిరులు గొనుటకు
    మరియాదలు దప్పకున్న మనుగడ చనునే ?
    తిరుగాడు మేను సెప్పగ
    సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  7. నిరసింప చుప్పనాతిని
    ధరణిజ హరియింప బడియె! తరుణుల వలపున్
    పర పురుషుడనను భీతి ము-
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  8. సదస్యులకు
    అబివంద నాభినందనలు.
    అందరి పూరణలూ బహు బాగున్నవి.


    అయితే
    మిస్సన్న మహాశయా
    చుప్పనాతిని వలదని
    రాముడు తప్పే చేసాడంటారా!!!

    రిప్లయితొలగించండి
  9. కిషోర్ మహోదయా ధర్మ మార్గాన్ని విడిచి పెట్టని వారికే గదా చిక్కులన్నీ?

    రిప్లయితొలగించండి
  10. మురిపెంపు సుతకు జనకుడె
    పరిణయవేళనిడబోవ భాగమ్మాస్తిన్
    అరరే! తోబుట్టువుకే
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  11. కొరమీనునుపట్టుటకై
    సరగునపడవెక్కిబోయిసంద్రపుకడకున్
    బరువగుచేపపయి వలవి
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    పరిణయమాడగనుడివియు,
    పరివిధములబొంకియున్ను, ప్రణయము బొందన్
    తరుణులపై వలపువలవి
    సిరి, వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  12. అందరికీ,
    నమస్కారములు. ఈ బ్లాగ్ తో పరిచయ భాగ్యం ఈ మధ్యనే కలిగింది. ఈ బ్లాగ్ లో అనేక పండితోత్తములు, కవి శ్రేష్ఠులు సమస్యా పూరణాలు చేస్తున్నారు. అవి చదువుతుంటే చాలా ఆనంద దాయకం గాను, స్ఫూర్తి దాయకంగాను ఉంటోంది. నేను సమర్పిస్తున్న ఈ చిన్న పద్యం నా ప్రధమ ప్రయత్నం. నాకు పద్యాలు వ్రాయడం లో ఏ మాత్రము అనుభవము లేదు. తెలుగు భాషని 10 వ తరగతిలో (1975 ) వదిలేసాను. ఇది సరదాగా చేస్తున్నా చిన్ని ప్రయత్నం.
    అందరికి రాబోయే నూతన సంవత్సర అభినందనలు.
    నమస్కారం.

    సిరి లేకను, బడి సీటును
    దొరకదు, పదవులు, పరపతి, దూరము కాగా,
    పరిహాసములే పెరుగును
    సిరి వలదను వారి కిలను చిక్కులె కాదా!

    వెంకట శాస్త్రి.

    రిప్లయితొలగించండి
  13. సిరిగల శ్రీకృష్ణుని గని
    తరుణులు పదియారు వేలు తగు నెట్లయినన్ !
    పరమేశుని గంగ విడుమనె
    సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా ?

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు
    సదస్యులకు శుభాభినందనలు.
    పూరణలు బహు చక్కగ నున్నవి.

    మిస్సన్న మహాశయా!
    మీ పూరణ
    పైకి రాముని తప్పు బట్టి నట్లున్ననూ
    దానికి మీ సమర్థన
    బహుదా ప్రశంస నీయము.

    పద్యాన్ని చదివి అర్థం చేసుకో లేనట్టి
    నా వంటి అవివేకులకు కనువిప్పు.
    మీకివే నా వందన శతములు.
    _____________________________________
    01)
    సిరి , మరుగవ, హరి , పురి విడి
    ధరణిని సిరిసిరి యనుచును - తిరుగుచు వగచెన్!
    ఎరయై నాకలి దప్పుల!
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
    _______________________________________

    రిప్లయితొలగించండి
  15. ________________________________________
    02)
    సిరి గల వారలె , ధన్యులు !
    సరి ! సరి ! సరివారు , లేరు - జగతిని గనగా
    సిరినే గొల్చుము సతతము
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  16. _________________________________________
    03)
    హరి !వెలసెను సిరి చేకొని !
    గరళము గొని , స్మరహరుండు - కబళము కొరకై
    కరమున , చషకము బట్టెను!
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  17. కిషోర్ మహోదయా ఒక కోణంలో పరికిస్తే మీరు సూచించిన అపార్థం స్ఫురి స్తోందని పిస్తోంది. మరీ పద్య భావాలను అర్థం చేసుకోలేని శిశువు కాదు మీరు. మీ పద్యాలే దానికి నిదర్శనం. ఏమైనప్పటికీ మీ సూచనకు ధన్యవాదాలు. సవరించిన నా పద్యం:
    *********************************************
    నిరసింప చుప్పనాతిని
    ధరణిజ హరియింప బడియె! తరుణుల వలపున్
    సరగున సచ్చీలతను క-
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  18. కిషోర్ గారూ మీ మూడో పద్యం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  19. పరికింపరె సిరి లేనిచొ
    పరికించిన పెదవి విప్పి పలుకివ్వరుగా
    కరచెదరో పలుకిచ్చిన
    సిరి వలదనువాని కిలను చిక్కులు గాదా !

    రిప్లయితొలగించండి
  20. హమ్మయ్య!
    ఇప్పుడపార్థానికి
    తావే లేకుండా పోయింది.
    అభినందనలు
    మిస్సన్న మహాశయా!

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్నగారూ మీ పద్యము చాలా బాగుంది. వసంత కిశోర్ మహాశయా మీ మూడో పద్యము అదిరింది. చాలా బాగుంది. మొదటి పద్యములో యతి ధరణికి, తిరుగుటకు సరి చెయ్యాలి కదండీ !

    రిప్లయితొలగించండి
  22. నరసింహ మూర్తి గారూ ధన్యవాదాలు.
    మీ తాజా పద్యం చాల బాగుంది.
    కిషోర్ గారూ హమ్మయ్యమ్మయ్య! మిమ్మల్ని తృప్తి పరచ గలిగేను.

    రిప్లయితొలగించండి
  23. మూర్తిగారికీ
    మిస్సన్న మహాశయులకూ
    ధన్యవాదములు.
    ఔనండోయ్! మూర్తిగారూ!
    నేను గమనించ లేదు.
    మీ కు మరో విడత కృతఙ్ఞతలు.
    ఇదిగో సవరణ :
    _________________________________________
    01)
    సిరి , మరుగవ, హరి , పురి విడి
    ధరణిని దారన్ దెలియక - దైన్యము నొందెన్
    ఎరయై నాకలి దప్పుల!
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  24. మంద పీతాంబర్ గారూ,
    మీ మూడు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.

    ఎన్నెల గారూ,
    భావం మంచిదే. కాకపోతే పద్యం సలక్షణమై లేదు. వీలైతే సాయంత్ర వరకు సవరిస్తాను.

    జిగురు సత్యనారాయణ గారూ,
    భార్యను "కసిరి వలదనుకుంటే" చిక్కులే గదా! బాగుంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ మొదటి పూరణ బాగుంది. వసంత్ కిశోర్ గారి వ్యాఖ్యతో దానికి మీరు చేసిన సవరణ ఇంకా బాగుంది. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    మీ మూడు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. వెంకట శాస్త్రి గారూ,
    `శంకరాభరణం` బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
    మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. మీరు నిస్సంకోచంగా పద్య రచనను కొనసాగించండి.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    బాగుంది పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో "పరమేశు గంగ విడుమనె" అంటే గణదోషం తొలగిపోతుంది.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. మిస్సన్న గారు, గన్నవరపు వారు చెప్పినట్లు మీ మూడో పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. వసంత్ కిశోర్ గారూ,
    మిమ్మల్ని మరచి పోవడమా?
    వరుసగా అందరికీ వ్యాఖ్యలు పెడుతుంటే మా అబ్బాయి వచ్చి అర్జంటుగా మెయిల్ చెక్ చేసుకోవాలన్నాడు. అందువల్ల టైపు చేసినంత వరకు పోస్ట్ చేసి సిస్టం ను 5 నిమిషాలకోసం మా అబ్బాయికి ఇచ్చాను.

    రిప్లయితొలగించండి
  27. ఊకదంపుడు గారి వ్యాఖ్య .........................
    వేంకట శాస్త్రి గారూ,
    స్వాగతం. ఇక్కడ అందరమూ పద్యాలు వ్రాయటం నేర్చుకుంటున్నవాళ్లమే. కాబట్టి సందేహించకుండ ప్రతిదినమూ వ్రాయమని మనవి.
    వసంత కిశోర్ గారు,
    మీ పేరు జూచి ఇప్పుడే ఎంగినీరింఘ్ కాలేజీ లో చేరి ఉంటరనుక్కునాను. మీరు చెబితే తెలిసింది పదవీ విరమణ చేశారాని. పద్యాలు చాలా చక్కగా వ్రాస్తున్నాను, ధన్యవాదములు.
    మిస్సన్న గారూ, గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అడపాదడపా మీరు నా పద్యాలపై వెలిబుచ్చిన అభిప్రాయలకు స్పందించలేకపోయాను, మన్నించండి. సమయం అనుకూలించకపోవడమే కాని - మరేమి కాదు, అన్యధా భావించకండి.
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ ప్రశ్నకు నేనొక సమాధానం బాకీ. ప్రస్తుతానికి బాకీ ఉండనీయండి.
    ఎన్నెల గారూ,
    మీరు ఛందస్సు నేర్చుకోకుండా ఇంకా ఆలస్యం చేయటమ్ భావ్యం కాదు.
    పెద్దవారైన రాజరాజేశ్వరి గారే సాధ్యం కాదు అనుకోకుండా నేర్చుకొని వ్రాస్తున్నారు.
    శంకరయ్య గారూ,
    ఆహా ఏమి అదృష్టమండీ, మాది. ఒక పక్క పద్యవిద్యలో సాధికారత కలిగిన డాక్టరు గారిని మాకు పరిచయంజేశారు. మరొకవైపు - కొత్తగా పద్యమ్ నేర్చుకోవటనికి సమయాత్తమౌతున్నవారు. నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఇంత కన్నా కావాల్సిందేముంది.
    మీకొక విన్నపం, ఇకపై, టాపా శీర్షిక లో సమస్యాపూరణమూ, సంఖ్యా ప్రక్కన కుదిరితే ఒకటీ రెండు పదాలను ఉంచండి, పాత సమస్యలను చూస్తున్నప్పుడు, 'బ్లాగు ఆర్కైవ్' లో పేరు చూడగానే సమస్య స్పురిస్తుంది, వెతకటం తేలికౌతుంది.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  28. పైన నా వ్యాఖ్యలో పెద్ద అచ్చుతప్పును సవరించి మళ్లీ వ్రాస్తున్నాను

    వసంత కిశోర్ గారు,
    మీ పేరు జూచి ఇప్పుడే Engineering College లో చేరి ఉంటారనుకున్నాను. మీరు చెబితే తెలిసింది పదవీ విరమణ చేశారాని. పద్యాలు చాలా చక్కగా వ్రాస్తున్నారు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు. మీ సలహాను పాటించి ఇకనుండి సమస్యాపూరణం సంఖ్య ప్రక్కన సమస్య పాదంలోని కొన్ని పదాలను ఉంచే ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి
  30. ఎన్నెల గారూ,
    మీ భావానికి నా పద్య రూపం ....................
    వర రామ పాద సేవా
    నిరతుండగు త్యాగరాజు నిధి వలదనుచున్
    భరియించెఁ బేదరికమును
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
  31. గురువు గారూ ,
    ఎన్నెల గారి చక్కని భావానికి మీరు మనొజ్ఞమైన పూరణ సమకూర్చారు.

    రిప్లయితొలగించండి
  32. నేను పంపిన సమస్య కి నా పూరణ బహుశ: సరిగా పంపక పోవటం వలన, బ్లాగ్ లో పోస్ట్ అవలేదు.
    అందుకని ఇప్పుడు మళ్ళీ పంపుతున్నాను.
    మిత్రులందరి పూరణలు చాల బాగున్నాయి.
    నా పూరణ:
    సిరి యను రెండక్షరములు
    మురిపించును లోక మెల్ల మురళీ లోలా
    సిరి చేదను వారెవ్వరు?
    సిరి వలదను వానికిలను చిక్కులె కాదా!

    శంకరయ్య గారిచ్చిన ప్రోత్సాహం వల్లనే నా పూరణ పంపటానికి ధైర్యం చేస్తున్నాను,

    విద్యాసాగర్

    రిప్లయితొలగించండి
  33. విద్యాసాగర్ గారూ,
    ఆలస్యంగా అందినా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. మాష్టారూ, ధన్యవాదాలండీ.

    విద్యాసాగర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు

    రిప్లయితొలగించండి
  35. మాస్టారు గారికి నమస్సులు...వెంటనే మొదలు పెడతానండీ చందస్సు పాఠాలు.... ప్రోత్సహిస్తున్న మీకు సర్వధా కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  36. వర రామ పాద సేవా
    నిరతుండగు త్యాగరాజు నిధి వలదనుచున్
    భరియించెఁ బేదరికమును
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
    చాలా చాలా బాగుంది మాస్టారు గారూ...మరొక్క సారి కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  37. హరి శ్రీమతి తా పుణ్యుల
    సిరులను గురిపించు దరిని జేరిచి దయతో !
    మరి పాపిని దరి దీయక
    సిరి వలదను; వాని కిలను చిక్కులె గాదా ?

    రిప్లయితొలగించండి
  38. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. తరలగ నమరావతికిన్,
    సరసము వలదనిన నరుడు శాపము వొందెన్,
    ధరణిన షండుండవ, మగ
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి సవరణతో:

      తరలగ నమరావతికిన్,
      సరసము వలదనిన నరుడు శాపము నొందెన్,
      ధరణిని షండుండవ, మగ
      సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  40. తిరుగుచు మూషిక మొక్కటి
    బిరబిర కౌపీనము తిన భిక్షుని గుడిసెన్
    చిరు మార్జాలము పెంచగ
    సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

    రిప్లయితొలగించండి