25, డిసెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 179

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.
ఈ రోజు ఏ సమస్య ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే వసంత్ కిశోర్ గారి సూచన నాకు వర ప్రసాద మయింది. వారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. తమ్ము డాయెను బేంకున , తన తదుపరి
    జేరి!నాకర్వై నిండెను ,వారు తమ్ము
    డాయె! యీ బ్లాగులో నేజేర నాయె నన్న!
    తమ్మునికి నన్న వరుసకు తమ్ము డాయె!!!

    (నేను బ్యాంకుఅధికారిగా పని జేసి పదవి విరమణ చేసినాను వారు బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారని వారి profile చూస్తే తెలిసింది.ఇంకా అరువది నిండలేదని మొన్న వారు సెలవిచ్చారు .అందుకే వారిని తమ్ముడన్నాను.

    శంకరాభరణము బ్లాగులోకి వారి తర్వాత వచ్చి పద్యాలను వ్రాయడం నేర్చుకుంటున్న వాణ్ని .మిన్నగా వ్రాసే మిస్సన్నకు నేను తమ్మున్ని గాక నేమౌతాను.?నేను పద్యం ద్వారానే వివరణ ఇద్దామని అనుకుంటుండగా ,గురువు గారు అదే సమస్యను ఇచ్చారు .మిస్సన్న గారికి,వసంత కిషోర్ గారికి మరియు గురువు గారికి నమోవాకములు.)

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యులకు
    వందన శతములతో
    కృతఙ్ఞతలు.

    నేనేదో
    సరదాగా
    పీతాంబరధరుల
    వ్యాఖ్యలకు
    స్పందిస్తూ
    వ్రాసిన వాక్యమది.

    అందులో ఎన్ని తప్పులున్నాయో
    నని సందేహిస్తూ , సంకోచముతో
    తప్పులు దిద్దుటకు మీరున్నారనే ధైర్యంతోనే
    బ్లాగులో పెట్టాను.
    తప్పులు సరి చేసి మీరు
    ఈ రోజు సమస్యగా ఇస్తారని
    కలలో కూడా అనుకోలేదు.

    అసలు ఈ ఆలోచన నాది కాదు.
    పీతాంబర ధరుల వారిది.

    వారికీ మీకూ మరోసారి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  3. 01)
    ____________________________________
    రామునకు , తమ్ము, డైనట్టి - లక్ష్మ ణుండు !
    ధరణి ప్రభవించె గాదొకొ ,- ద్వాపరమున
    అన్నగా బలరాముడై ,- అచ్యుతునకు!
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  4. నా పై పద్య రెండవ పాదములో గణం తప్పై నట్లు గమనించాను .సవరించిన పద్యం యిది.తమ్ములు తప్పులు చేయడం మొదట అన్నలు తర్వాత గురువులు క్షమించడం సహజమే!

    తమ్ము డాయెను బేంకులో , తను తదుపరి
    జేరి!నిండెనా కరువది ,వారు పిన్న
    నౌట! యీ బ్లాగులో నేజేర నాయె నన్న!
    తమ్మునికి నన్న వరుసకు తమ్ము డాయె!!!

    రిప్లయితొలగించండి
  5. పీతాంబర ధరా!
    వందనములు.

    ఈ సమస్యకు మూల కారణం మీరే.
    ఆలోచన మీది.
    అక్షర రూపం నాది.
    గురువుగారి పరిష్కరణ తో

    కిందనుండ వలసింది పైకెక్కింది.

    ఏది ఏమైనా , దీని తాలూకు పొగడ్తలూ తెగడ్తలూ
    అన్నీ మీవే.

    నా
    సందేహానికి
    చక్కని పద్యంతో
    సమాధాన మిచ్చి,
    సమస్యా పూరణము కూడా
    సాధించిన మీ
    సవ్యసాచిత్వానికివే
    నా జోతలు.

    మీ పద్యం లో
    రెండవ పాదములో ఏదో "టైపో" ఉన్నట్టుంది.
    అర్థం కావడం లేదు.
    మూడవ పాదంలో ఒక అక్షరం ఎక్కువై నట్టుంది.
    ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  6. ఓహోహోహో!
    ఇప్పుడర్థమయ్యింది.

    "నాకర్వై" అంటే అర్థం కాలేదు - ఏ కర్వో(curve)
    ఎంత బుర్ర కొట్టు కున్నా.
    మా సివిల్ ఇంజనీరింగు లో
    చాలా కర్వులు(curves)ఉంటాయి లెండి.
    ఎన్నిసార్లు ఆలోచించినా
    నా ఆలోచన లన్నీ
    ఆ కర్వుల చుట్టూనే తిరిగి తిరిగి
    చివరికి "టైపో" అనే నిర్ణయానికి వచ్చేసి postకూడా వేసేసాను.
    తరువాత మీ వివరణ(సవరణ) కనుపించింది.

    " నాకు అరవై "
    అన్న మీ భావం
    ఇప్పుడర్థమైంది.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. భార్య అక్కను పెండ్లాడి ,భార్య బావ,
    అన్నగా మారె,వదినమ్మ మిన్ని కెగయ,
    అతను తన భార్య చెల్లినే చేత బట్టి !
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.
    (నాకు ముగ్గురు మేనకోడళ్ళు .మొదటి కోడలి భర్త తన భార్య అకాల మరణంతో నా మూడవ కోడలును పెళ్ళాడాడు నా రెండవ కోడలి భర్తకు అన్నయైన వాడిప్పుడు ,మరదలిని చేబట్టడం తో తమ్మునిగా మారిన సంఘటన గుర్తుకు వచ్చింది యాదృచ్చికంగా అతను నేడు ఇంటికి వచ్చి సమస్యను చూడడం జరిగింది.)

    రిప్లయితొలగించండి
  8. అన్నట్టు మరిచాను శ్రీ కిషోర్ పూరణ అత్యద్భుతంగా ఉంది .ప్రణామాలు

    రిప్లయితొలగించండి
  9. శహభాష్!
    పీతాంబరధరా
    శహభాష్!

    పరమాద్భుతం మీ పూరణ.

    మీకివే శతకోటి కేకిసలు.

    రిప్లయితొలగించండి
  10. ____________________________________
    02)

    పరిచ యస్థులై రిరువురు! - పాన శాల !
    పిలుచు కొందు, " రన్నా " యని - పేర్మి తోడ
    ఒండొరుల , మైక మొక , ఊపు - ఊచి నపుడు!
    తమ్మునికి నన్న వరుసకుఁ - దమ్ముఁ డయ్యె.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. అన్నదమ్ములు తెఱచిరి యంగడులను
    లక్షలార్జంచె అన్న యా లక్ష్మి కృపను
    చేరి వరియించె తమ్ముని జ్యేష్ఠ లక్ష్మి
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  12. అక్క చెల్లెల్ల సుతులు తోడల్లురయ్యె
    తమ్మి చేకొనె అక్కను ధర్మ సతిగ
    అన్న చేకొనె చెల్లిని ఆలిగ మరి
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  13. అందరి పూరణలూ
    మింట చుక్కల వలె
    మెరయు చున్నవి.
    అందరికీ
    నా కేకిసలు.

    రిప్లయితొలగించండి
  14. అన్నల్లారా మీ కోసము!

    గన్నవరపుల కెప్పుడు గారవమ్మె
    ఎదుటి వారల నెన్నగ నెంచి ప్రీతి
    పిన్న వారల బిల్తురు నన్న లనుచు
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె !!

    ఏమమ్మా ! ఎన్నెలా ! నేను చెప్పినది సబబుగా ఉందా ?

    రిప్లయితొలగించండి
  15. మువ్వురన్నదమ్ములొకింట మురిపెముగను
    విధివశమున బాల్యముననె వీడిరాపై
    కనుగొనెను పెద్ద కడకును తనదుఁ చిన్న
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్నగారూ, మందా వారికే కాదు, నాకు కూడా మీరు అన్నే !

    అన్న తమ్ముడొ మిస్సన్న మిన్న గాదె
    పద్య మన్నను పిన్నయు విద్య మీఱి
    ముందు నిలబడి యన్నయె మూర్తి కైన
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె !!

    రిప్లయితొలగించండి
  17. గన్నవరపు మూర్తి అన్నయ్యకి అభినందనలు. చాల బాగుంది మీ పూరణ.. ఇంటి పేరు మీ పద్యంలో చూసుకుని మురిపెం తో నాన్నకి చదివి వినిపించమని చెల్లికి పంపాను. కృతజ్ఞతలు


    కంది శంకరయ్య గారికి నమస్సుమాంజలి. నా యీ భావములకు మీ చందస్సౌందర్య తళుకులద్దమని విజ్ఞప్తి.

    కవలలిద్దరు ముద్దుగ ఒకరినొకరు
    అన్నయని పిలుచుకుందురు ప్రేమ మీర
    ఎవడన్న ఎవడు ఎవనికి తమ్ముడనగ
    తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె

    కృతజ్ఞతలు

    గన్నవరపు ఎన్నెల

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ మీ బ్లాగు వలన నాకు మరో చెల్లెలు, చాలా మంది అన్నలు సమకూడారు !
    మరో పూరణ:

    ఎర్ణకుళమున కొన్నాళ్ల కేగుదెంచె
    నల్లతంబియు పిలువగ పిల్లవాఁడు
    పొరుగు రామణ్ణ దమ్ముగ నెరిగె నతడు
    తంబికిని నణ్ణ వరుసకుఁ దమ్ముఁడయ్యె!

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    సవరించిన తర్వాత మీ పూరణ నిర్దోషంగా బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణలో `మిన్ని కెగయ` ప్రయోగమే పానకంలో పుడకలా ఉంది.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు మనోల్లాసాన్ని కలిగించాయి. అభినందనలు.

    కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    చాలా బాగుందండీ మీ పూరణ. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సమస్యా పూరణలో మీ సంప్రదాయ సంస్కారాలను పరిచయం చేసారు. మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    రవి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదం చివర `వీడి రాపై` అని చివర గురువు వేసారు. అక్కడ లఘువు ఉండాలి కదా! `వీడి తుదలు` అంటే సరిపోతుంది కదా?

    ఎన్నెల గారూ,
    నా బ్లాగు వల్ల మీకో అన్నయ్య దొరకడం సంతోషంగా ఉంది.
    ఇక మీ పద్యానికి నా సవరణ .....
    కవల లిద్దరు ముద్దుగ కలసి మెలసి
    అన్న యని పిల్చుకొందు రత్యంత రక్తి
    నెవ్వఁ డన్న వానికిఁ దమ్ముఁ డెవ్వఁ డనిన
    తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్య గారికి, నమస్సులు.
    అవునండీ, నాకు మా అన్నయ్య దొరికారు మీ బాగు వల్ల. కృతజ్ఞతలు.
    పద్యం చాల బాగా వచ్చిందండీ. మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షమించండి...చదివి ఆనందించాలి అనుకుని వస్తాను మీ బ్లాగుకి...కానీ వ్రాయాలనిపిస్తుంది....కొంచెం సమయం దొరికినప్పుడు మీ చందస్సు ట్యుటొరియల్ చదువుతాను..కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  21. హన్నన్నన్నా! ఈ అన్న ఊళ్ళో లేకుండా చూసి అన్నాదమ్ములందరూ అన్న మీద అన్నన్ని మిన్నవైన పద్యాలు వ్రాసేస్తారా! అన్నదమ్ముల పూరణలన్నీ ఒక దాన్ని మించి ఒకటున్నాయి.
    *************************
    బుద్ధి ప్రజ్ఞల నందరి ముందు నేను
    పిన్న వాడను తమ్ముడ పెద్ద గాను
    అయిన పంచిరి ప్రేమ నన్నంత జేసి
    తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె.
    **************************
    పీతంబార్ గారూ మరొక్క సారి సోదరాభివందనాలు.
    గన్నవరపు వారూ మీకు కూడా.
    క్రొత్త మిత్రులతో సహా అందరి పూరణలూ చాలా బాగున్నాయి.
    గురువుగారికి వందనములు.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న మహాశయులకు
    అభివాదములు.
    అభినందనలు.
    మీ పూరణ లెప్పుడూ
    వింత వింత పొకడలతో
    విచిత్రముగా
    ప్రత్యేకతను
    సంతరించుకొని ఉంటాయి.
    మీ పూరణ చాలా బాగుంది.
    సమకాలీన రాజకీయ చిత్రణ మీ ప్రత్యేకత.

    రిప్లయితొలగించండి
  23. చిన్న తనమున కలవగ అన్నలందు
    అన్నయందురు ఆతని నాదరమున;
    స్వంత అక్కయ జేయును సాయ మెపుడు
    తమ్మునికి; నన్న వరుసకు తమ్ముడయ్యె.

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి